Skip to main content

Tenth Pre Final 2025 Schedule : విద్యార్థుల‌కు అలర్ట్‌.. టెన్త్ ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌ల‌.. తేదీలివే..

రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థుల ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌కు తేదీలను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఖరారు చేసింది.
Telangana tenth class pre final 2025 exam schedule released

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణలోని ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం అలెర్ట్ ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే ప్రీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నున్న‌ట్లు పేర్కొంది. రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థుల ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌కు తేదీలను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఖరారు చేసింది. గురువారం, జ‌న‌వ‌రి 23వ తేదీన ఈ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఈ మెర‌కు తేదీల‌వారిగా స‌బ్జెక్టుల‌నూ ప్ర‌క‌టించింది. వివ‌రాల్లోకి వెళ్తే..

Tenth Class Board Exams 2025 Model Papers: టెన్త్ విద్యార్థుల‌ బోర్డు ప‌రీక్ష‌ల‌కు మోడ‌ల్ పేప‌ర్ విడుద‌ల‌..

ప్రీ ఫైనల్ తేదీలు..

మార్చి 6 - ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 7 - సెకండ్ లాంగ్వేజ్
మార్చి 10 - ఇంగ్లీష్
మార్చి 11 - మ్యాథమేటిక్స్
మార్చి 12 - ఫిజికల్ సైన్స్
మార్చి 13 - బయోలాజికల్ సైన్స్
మార్చి 15 - సోషల్ స్టడీస్

10th Class Exams Pass Marks changed: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ మారనున్న 10వ తరగతి పాస్‌ మార్కులు..

స‌మ‌యానుసారం..

వ‌చ్చే నెల మార్చి 6వ తేదీన ప‌రీక్ష‌లు ప్రారంభ‌మై అదే నెల 15వ తేదీన ప‌రీక్ష‌లు ముగియ‌నున్నాయి. అయితే, ప్ర‌తీ ప‌రీక్ష మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు జ‌రుగుతాయి. స‌బ్జెక్టుల వారిగా స‌మ‌యం విష‌యానికొస్తే.. ఫ‌స్ట్ ల్యాంగ్వేజ్‌, సెకండ్ ల్యాంగ్వేజ్‌, థ‌ర్డ్ ల్యాంగ్వేజ్‌, మ్యాథ్స్‌, సోష‌ల్ స్ట‌డీస్ స‌బ్జెక్టులకు పూర్తిగా మూడు(3) గంట‌లు కేటాయిస్తారు.

School built by Maoists: ‘అన్న’లు నిర్మించిన పాఠశాల.. కూల్చవద్దు అంటున్న స్థానికులు

కాని, ఫిజిక్స్‌, బ‌యోల‌జీ స‌బ్జెక్టుల‌కు మాత్రం కేవ‌లం గంట‌న్న‌ర స‌మ‌యం కేటాయిస్తారు. అధికారులు ఇచ్చిన స‌మ‌యంలోనే విద్యార్థులు వారి ప‌రీక్ష‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప‌రీక్ష‌లో ప్ర‌క‌టించే ప్ర‌తీ నియ‌మ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ప‌రీక్ష‌ను పూర్తి చేయాలి.

ఫైన‌ల్..

ఇదిలా ఉంటే, ప్రీ ఫైన‌ల్ ప‌రీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఫైన‌ల్‌.. (వార్షిక‌) ప‌రీక్ష‌లు కూడా ప్రారంభం అవుతాయి. ఈ ప‌రీక్ష‌లు మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4వ తేదీన ముగియ‌నున్నాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Jan 2025 04:18PM

Photo Stories