Skip to main content

Mid Day Meal Share: బడుల్లో ‘మధ్యాహ్న భోజనం’ ఖర్చులో.. కేంద్ర.. రాష్ట్రాల.. వాటా ఎంతో తెలుసా?

బడుల్లో మధ్యాహ్న భోజనం (Mid-Day Meal) కార్యక్రమంలో ఖర్చు పంచుబాటును కేంద్రం, రాష్ట్రాల మధ్య ప్రత్యేక రేషియో ప్రకారం నిర్ణయిస్తారు.
Mid Day Meal Share

ఈ పథకం ప్రధానంగా పాఠశాలలోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రాధాన్యం ఇచ్చే "ప్రధానమంత్రి పోషణ పథకం" కింద అమలవుతోంది. ఖర్చులో కేంద్రం,  రాష్ట్రాల వాటా వివరణ ఇలా ..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

1. సాధారణ రాష్ట్రాలు (General States):
కేంద్రం వాటా: 60%
రాష్ట్రం వాటా: 40%

2. ప్రత్యేక రాష్ట్రాలు (Special Category States):
(జమ్మూ & కాశ్మీర్, నార్త్-ఈస్ట్రన్ రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మొదలైనవి)
కేంద్రం వాటా: 90%
రాష్ట్రం వాటా: 10%

3. కేంద్ర పాలిత ప్రాంతాలు (Union Territories):
100% ఖర్చు కేంద్రం భరిస్తుంది.

చదవండి: EC Report on Midday Meal: ప్రభుత్వ బడుల్లో ‘మధ్యాహ్న భోజనం’పై విద్యా కమిషన్‌ నివేదిక.. నివేదికలోని అంశాలు ఇవే..

మధ్యాహ్నం.. అధ్వానం!

సాక్షి, హైదరాబాద్‌: మధ్యాహ్న భోజనం ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తున్నాయి. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో మెస్‌ చార్జీలు పెంచారు. కానీ, ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ 1 నుంచి ఐదో తరగతి (ప్రైమరీ) వరకు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4.97 చొప్పున.. 6 నుంచి 8 తరగతులవారికి రూ.7.45 చొప్పున, 9, 10 తరగతులవారికి రూ.9.45 చొప్పున ఇస్తున్నారు. ఈ కేటాయింపులు పెంచాలి. 1–5 తరగతులకు 55 శాతం, 6–8 తరగతులకు 58 శాతం, 9–10 తరగతుల వారికి 60 శాతం చొప్పున నిధులు పెంచాలి.

Published date : 28 Jan 2025 01:25PM

Photo Stories