10th Class Preparation Tips: ‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలా.. ఇలా చదవండి!

జిల్లా కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, సెక్టోరియల్ అధికారులతో ఫిబ్రవరి 14న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి ప్రగతి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. అలాగే విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను పరి శీలించాలన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా తరగతులు బోధించాలని, ప్రతిరోజు రెండు మూడు తరగతులను పరిశీలించాలని సూచించా రు. పర్ఫామెన్స్ విధంగా చూస్తే జిల్లాల పరంగా ఆదిలాబాద్ వెనుకబడి ఉందని తెలిపారు.
![]() ![]() |
![]() ![]() |

సబ్జెక్ట్ వారీగా ప్రిపరేషన్
తెలుగు
ఈ పేపర్‌లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు..ముందుగా పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను చదవాలి. వాటిని పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని చదవడంతోనే సరి పెట్టకుండా.. సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యం. ఉపవాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. వ్యాకరణంలో ప్రతిభ చూపాలంటే.. సంధులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్యర్థాలు, జాతీయాలు బాగా చదవాలి.
ఇంగ్లిష్
ఇంగ్లిష్ సబ్జెక్టులో కొద్దిపాటి చిట్కాలతో మంచి మార్కులు పొందొచ్చు. ఇందులో వెర్బల్, నాన్–వెర్బల్ అంశాలు బాగా చదవాలి. పొయెట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి. వీటితోపాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వెర్బ్స్‌పైనా అవగాహన పెంచుకోవాలి. వీటిని అధ్యయనం చేయడంతోపాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. అదే విధంగా అపరిచిత గద్యం (అన్‌నోన్ ప్యాసేజెస్) సారాంశాన్ని గ్రహించేలా చదవాలి. లెటర్ రైటింగ్‌కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్ ది లెటర్ వంటి అంశాలపైనా పట్టు పెంచుకోవాలి.
మ్యాథమెటిక్స్
ప్రతి చాప్టర్‌ను సిలబస్‌కు అనుగుణంగా పూర్తిగా అధ్యయనం చేయాలి. ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. పేపర్–2లో రేఖా గణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై పట్టు సాధించడం ఎంతో మేలు చేస్తుంది. సాధన చేయడంతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పెంచుకోవాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. రివిజన్ సమయంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పాఠ్యపుస్తకంలో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేయాలి.
ఫిజికల్ సైన్స్
ఫిజికల్ సైన్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే.. అప్లికేషన్ అప్రోచ్‌ను అనుసరించాలి. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజ జీవిత సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. విషయ అవగాహనతోపాటు, ప్రశ్నించడం–పరికల్పన చేయడం, ప్రయోగాలు–క్షేత్ర పర్యటనలు, సమాచార నైపుణ్యాలు–ప్రాజెక్ట్ పనులు, పటాలు–వాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా దృష్టిపెట్టాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై పట్టు సాధించాలి. మూలకాల ధర్మాలు–వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే పట్టు లభిస్తుంది.
నేచురల్ సైన్సెస్
జీవశాస్త్రం సబ్జెక్ట్‌లో అవగాహన, సొంత విశ్లేషణ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఫ్లో చార్ట్‌లు, బ్లాక్ డయాగ్రమ్స్‌లను సొంతంగా రూపొందించుకోవాలి. విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించే విధంగా చదవాలి. ప్రయోగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం ఎంతో మేలు చేస్తుంది. విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్ విషయంలో భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
సోషల్ స్టడీస్
సోషల్ స్టడీస్‌లో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు సమకాలీన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస/అభినందనలపై సాధన చేయాలి.
అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి, సొంత పరిజ్ఞానంతో రాసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్‌లో భారతదేశం –భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి–ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో రెండు ప్రపంచ యుద్ధ కాలాల సమయంలో ప్రపంచం, సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రపై ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించారు వంటి కోణాల్లో చదవాలి.
పదో తరగతి.. ప్రిపరేషన్ టిప్స్
- సిలబస్‌లో ఆయా సబ్జెక్ట్‌లు, చాప్టర్లలో సిలబస్‌ను పరిశీలించాలి.
- ముఖ్యమైన చాప్టర్లను వెయిటేజీ ఆధారంగా వర్గీకరించుకోవాలి.
- ముందుగా అత్యధిక వెయిటేజీ ఉండే అంశాలపై దృష్టి పెట్టాలి.
- ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- అవగాహన,ప్రతిస్పందన,స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు సాధించేలా కృషి చేయాలి.
- అనువర్తిత నైపుణ్యం పెంపొందించుకునేలా చదవాలి.
- మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, థీరమ్స్‌ను బాగా అధ్యయనం చేయాలి.
- ప్రతి అంశాన్ని సొంతగా విశ్లేషించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
Tags
- 10th class preparation tips
- 10th Class Exam Guidance
- Class 10 preparation tips
- Class 10 preparation tips 2025
- 10th class preparation tips maths
- Class 10 board exam Preparation tips
- Tenth Class Exam Guidance
- Hundred percent marks in 10th class
- How many students get 100 percent in 10th board exam
- Hundred percent marks in 10th class maths
- How to score 100 percent in class 10 without studying
- 10th Class Board Exam