OMR Sheets in Pre Final Exams : ఈసారి ప్రీ ఫైనల్స్‌లోనే ఓఎంఆర్ షీట్లు.. విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలివే..

సాక్షి ఎడ్యుకేషన్: సాధారణంగా, ప్రతీ బోర్డు పరీక్షల్లో విద్యార్థులకు ఓఎమ్ఆర్ షీట్లను కేటాయిస్తారు, అందులో వారి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దానితోపాటు, వారి సంతకాలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే, ఈసారి విద్యార్థులకు ఈ ఓఎంఆర్ షీట్లపై అవగాహన కల్పించేందుకు ముందుగానే ఈ కార్యక్రమం జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే, ఏకంగా బోర్డు పరీక్షల్లోనే కాకుండా, ముందుగా వారికి నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షల్లో వారికి ఈ ఓఎంఆర్ షీట్లపై అవగాహన కల్పిస్తారు. ఇలా అయితే, పరీక్షల సమయంలో విద్యార్థులకు ఆయోమయం తప్పుతుంది. అక్కడి ఇన్విజిలేటర్లకు కూడా ఒత్తిడి తగ్గుతుందని ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు పాఠశాల విద్యాశాఖ.
ప్రీ ఫైనల్ పరీక్షలోనే అవగాహన..
ప్రతీ బోర్డు పరీక్షలో ఏర్పాటు చేసే ఓఎంఆర్ షీట్లను ప్రీ ఫైనల్ పరీక్షలకే ఏర్పాటు చేసి, విద్యార్థుల చేత అందులోని వివరాల నమోదును అర్థమయ్యేలా వివరిస్తారు. విద్యార్థులకు కూడా ఎక్కడెక్కడ ఏఏ వివరాలను నమోదు చేయాలి. ఎక్కడ ఏం రాయకూడదు అనే విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా, పరీక్షల సమయంలో ఎలాంటి సమయం వృధా కాకుండా ఉంటుంది.
జాగ్రత్తగా నింపాలి..
విద్యార్ధులకు అందించే ఈ ఓఎమ్‌ఆర్ పత్రాల్లో ప్రతి విద్యార్థి తనకు ఇచ్చిన ఆన్సర్ బుక్‌లెట్ సంఖ్యను రాయాల్సి ఉంటుంది. అలాగే దానిపై సంతకం కూడా చేయాలి. విద్యార్థికి సంబంధించిన ఇతర వివరాలు కూడా అందులో ముందుగానే ముద్రించి ఉంటాయి. వాటిని విద్యార్థులు సరిచూసుకోవాలి. వివరాల్లో తప్పులున్నా.. ఆ ఓఎంఆర్ తనది కాకపోయినా.. విద్యార్ధులు వెంటనే ఇన్విజిలేటర్‌కు చెప్పాల్సి ఉంటుంది. అలాగే వారిచ్చే ఇతర నామినల్ రోల్ పత్రంలో సరైన వివరాలను రాయాల్సి ఉంటుంది.
Good News for Tenth Students : విద్యార్థులకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక ఆదేశాలు..!!
అనుమానాలు ఉండకూడదు..
కాగా, వచ్చేనెల మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలో విద్యార్థులు ఏకేసారి ఇలాంటి విషయాలను తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా, సమయం కూడా వృధా అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా టీచర్లు, ఇన్విజిలేటర్లు చెప్పిన విధంగా అర్థం చేసుకొని, ఓఎంఆర్ షీట్లను నింపాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి అనుమానాలు ఉన్న వాటిని వెంటనే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి. ఎలాంటి సందేహాలు లేకుండా పరీక్షలను పూర్తి చేసుకోవాలని సూచించింది విద్యాశాఖ.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Tenth Students
- Telangana Government
- School Education Department
- Key decision
- tg tenth board exams
- omr sheets awareness
- Pre Final Exams
- omr sheets for pre final exams
- tenth exams preparations
- tg tenth exams preparations
- omr sheets for tenth students
- omr sheets for tenth pre final exams
- awareness on omr format for ts tenth
- tenth public exams preparation
- omr sheets for tenth pre final exams 2025
- Education News
- Sakshi Education News