Skip to main content

BRICS Summit: జులైలో బ్రెజిల్‌ వేదికగా బ్రిక్స్‌ సదస్సు

అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ తదుపరి శిఖరాగ్రం జులై 6, 7వ తేదీల్లో బ్రెజిల్‌లోని రియోడిజనిరోలో జరగనుంది.
Brazil to host next BRICS Summit in Rio de Janeiro in July 2025

ఈ విషయాన్ని దేశ విదేశాంగ మంత్రి మౌరో వియెరా ప్రకటించారు. ప్రపంచ పాలన సంస్కరణలు, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారంపై దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకి భాగస్వామ్య దేశాలను కూడా ఆహ్వానించామని, సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయంతో మిగతా దేశాలు కూడా సమావేశాల్లో పాల్గొనవచ్చన్నారు. 

2025 జనవరి నుంచి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ స్వీకరించారు. బ్రెజిల్, రష్యా, ఇండియా చైనాలతో 2009లో బ్రిక్‌గా ఏర్పాటై, 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. 

గతేడాది ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈలను చేర్చుకుని ఈ కూటమిని విస్తరించారు. సౌదీ అరేబియాను కూడా కూటమి దేశాలు ఆహ్వానించాయి. బ్రిక్స్‌లో సభ్యత్వం కోసం తుర్కియే, ఆజర్బైజాన్, మలేసియా దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు ఆసక్తికనబరుస్తున్నాయి. ఇటీవలే ఇండోనేసియా 11వ సభ్య దేశంగా చేరింది. నైజీరియాకు భాగస్వామ్య దేశంగా గుర్తింపునిచ్చారు.

Artificial Intelligence: ఈ దేశాల మధ్య ఏఐపై ఆసక్తికరమైన చర్చలు, విభేదాలు!

Published date : 18 Feb 2025 10:18AM

Photo Stories