Digital Lab : గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో డిజిటల్ ల్యాబ్..

వర్గల్: డిజిటల్ లెర్నింగ్ విధానంలో పురోగతి సాధించేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు అన్నారు. శనివారం వర్గల్ పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత ఉద్యోగాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్యూర్ సంస్థ
డిజిటల్ రంగంలో వస్తున్న మార్పులతో మన జీవనశైలి మరింత ఆధునికంగా మారనుందని, విద్యార్థులు ఈ దిశగా విద్యను అభ్యసించాలని సూచించారు. డిజిటల్ లెర్నింగ్ కోసం ఫ్యూర్ సంస్థ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సహాయం అభినందనీయమన్నారు. ప్యూర్ సంస్థ సీఈఓ డాక్టర్ శైలా తాల్లూరి డిజిటల్ ల్యాబ్ కోసం 20 ల్యాప్‌టాప్‌లను అందించి. విద్యార్థులతో యూత్ హబ్‌లను ఏర్పాటు చేశారు.
Education News:ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరిక
విద్యార్థులకు సామాజిక, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్కింగ్‌ను ప్రోత్సహించేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులను గమనిస్తూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు తమను తాము అప్‌డేట్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్‌జిల్లా ఆర్సీఓ గౌతమ్‌కుమార్, కాగ్నిజెంట్ సీనియర్ మేనేజర్ శివ బవనరి, ప్రిన్సిపాల్ డాక్టర్ గడ్డం భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)