Tenth Board Exams : 10వ తరగతి వార్షిక పరీక్షలకు పాత విధానం.. ఈ విషయంలో మార్పు..

కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో పలు మార్పులు చేసినట్లు ప్రకటించింది. గతంలో, ఎలాంటి పరీక్షలైనా ఫలితాలు మాత్రం మార్కుల విధానంలోనే ఉండేది. తరువాత, గ్రేడింగ్ విధానాన్ని రూపోందించారు. ఇప్పటివరకు ఇలాగే నడిచింది కాని, ఇకపై మరోసారి తిరిగి అదే మార్కుల విధానానికి నాంది పలుకుతున్నారు విద్యాశాఖ అధికారులు.
ఈ మార్పు కేవలం మార్కుల విషయంలోనే కాకుండా, పరీక్షలో విద్యార్థులు రాసే అడిషనల్ పేపర్‌ల విషయంలో కూడా ఒక మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై, వార్షిక పరీక్షలో అడిషనల్ అడగాల్సిన అవసరం లేదు. ఈ విధానానికి బదులుగా ఒకటి రెండు కాదు, ఏకంగా.. 24 పేజీల బుక్‌లెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే జిల్లాకు సరిపడా బుక్‌లెట్‌లు చేరుకున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఇక అడిగే అవసరం లేకుండా..
వచ్చేనెల 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,011 ఉండగా 12,579 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రశ్నపత్రంతో పాటు ఓఎంఆర్ షీట్, జవాబులు రాసేందుకు 4 పేజీలు ఇవ్వడం, అందులో జవాబులు రాయడం పూర్తయ్యాక అడిషనల్ షీట్లు ఇవ్వడం చేసేవారు. కానీ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం లేకుండా ఈసారి 24 పేజీలతో బుక్‌లెట్‌ను తీసుకువస్తున్నారు. అన్ని జవాబులు బుక్‌లెట్‌లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
Inter Students : విద్యార్థులకు మరో అవకాశం.. విద్యాశాఖ కీలక నిర్ణయం..
నాలుగు చోట్ల..
జిల్లాకు 24 పేజీలతో కూడిన బుక్‌లెట్లు ఇప్పటికే చేరుకున్నాయి. వాటిని భద్రపరిచేందుకు జిల్లాలో నాలుగు స్టేషనరీ రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణ కేంద్రాలతో పాటు పిట్లం మండల కేంద్రంలో ఇవి ఉన్నాయి. పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ సెంటర్ల నుంచి పరీక్షా కేంద్రాలకు బుక్‌లెట్‌లను తీసుకువెళ్లనున్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు
పదోతరగతి వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఈసారి విద్యార్థులు జవాబులు రాసేందుకు బుక్‌లెట్లను ఇవ్వనున్నాం. దీని ద్వారా తర చూ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం ఉండదు.
– ఎస్.రాజు, డీఈవో, కామారెడ్డి
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Tenth Students
- Tenth board exams
- key changes in board exams
- marks method for tenth board exams
- DEO Raju
- tenth board
- telangana tenth board exams 2025
- annual exams changes
- 24 pages booklet
- marks method
- 24 pages booklet for tenth board exams 2025
- Telangana Government
- telangana tenth board
- Education News
- Sakshi Education News