CM Revanth Reddy : 55 వేలకు పైగా గవర్నమెంట్ ఉద్యోగాలను ఇలా భర్తీ...? కానీ..
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ ఎన్నికల్లో నెగ్గి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది కాలంలో తాను చేసిన ప్రమాణాలు, అమలు చేసిన పథకాలను గుర్తిచేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తుంది. అయితే, ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన హయాంలో ఎన్ని పథకాలు, ప్రయోజనాలు అమలు చేసిన వాటిలో ఒకటైన ఉద్యోగ భర్తీ వివరాలను వెల్లడించారు.
New Education System: సగం కోర్సు ఇంటర్న్ షిప్ లే.. అన్ని కోర్సుల్లోనూ సమూల మార్పులు
55 వేలకు పైగా ఉద్యోగాలు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఒకటి ఉద్యోగ నియామకాలు. అయితే, పూర్తిగా 55,143 ఉద్యోగ నియామకాలను చేపట్టామని వివరిస్తూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంతలా ఉద్యోగావకాశాలను అందించారా అని వ్యాఖ్యానించారు.
నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే మొత్తంగా 55,143 ఉద్యోగావకాశాలను కల్పించామన్నారు. ఈ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఏ లక్ష్యం కోసం అమరుల ప్రాణ త్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం. ఇందులో ఒక్క తల తగ్గినా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.
అంతేకాదు, రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు, ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు, పేదలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు, కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.