Justice Manmohan: సుప్రీం జడ్జీగా జస్టిస్ మన్మోహన్ ప్రమాణం
Sakshi Education
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ (61) డిసెంబర్ 5వ తేదీ సుప్రీంకోర్టు జడ్జీగా ప్రమాణం చేశారు.
సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనకు ప్రమాణం చేయించారు.
జస్టిస్ మన్మోహన్ చేరికతో సీజేఐతో కలిపి సుప్రీంకు మంజూరైన 34 మంది జడ్జీలకు గాను ప్రస్తుతం 33 మంది ఉన్నట్లయింది. నవంబర్ 28వ తేదీన సుప్రీంకోర్టు కాంప్లెయం ఆయన పేరును సిఫారసు చేసి, డిసెంబర్ 3వ తేదీన రాష్ట్రపతి ముర్ము ఆయన్ను నియమించారు.
జస్టిస్ మన్మోహన్ ఢిల్లీ హైకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి, అలాగే ఆల్ ఇండియా హైకోర్టు జడ్జీల సీనియారిటీ ప్రకారం రెండవ స్థానంలో ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన ఆయన 1987లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. సుప్రీంకోర్టు జడ్జీల వయో పరిమితి 65 ఏళ్లు కాగా, హైకోర్టు జడ్జీల విరమణ వయస్సు 62 ఏళ్లు.
Utpal Kumar Singh: లోక్‌సభ సెక్రటరీ జనరల్ పదవీకాలం పొడిగింపు
Published date : 06 Dec 2024 12:07PM