Skip to main content

Medical Courses : ప్రారంభం కానున్న ఎంబీబీఎస్, బీడీఎస్‌ తరగతులు.. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులతో విస్తృత నైపుణ్యం!

ఎంబీబీఎస్‌.. బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సర్జరీ! బీడీఎస్‌.. బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ!!
Classes for students in medical courses at degree and pg level

వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే విద్యార్థులు ఎంచుకునే కోర్సులివి. వీటిల్లో చేరేందుకు అహర్నిశలు కృషి చేసి.. లక్షల మందితో పోటీ పడి ర్యాంకు సాధిస్తారు. అలా మెడికల్‌ కోర్సుల్లో సీటు దక్కించుకున్న విద్యార్థులు తరగతి గదిలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు! త్వరలో దేశ వ్యాప్తంగా మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. వైద్య కోర్సుల్లో రాణించేందుకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.. 

అయిదున్నరేళ్ల వ్యవధిలో ఉండే ఎంబీబీఎస్‌ కోర్సులో చేరిన విద్యార్థులు మొదటి నుంచి అకడమిక్స్‌తోపాటు ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్మీడియెట్‌లో మా­దిరిగా పుస్తకాలకే పరిమితమైతే సబ్జెక్ట్‌ నైపుణ్యం లభించొచ్చు. కానీ తమ కెరీర్‌ లక్ష్యం నెరవేరదని స్పష్టం చేస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్‌లో సీటు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో నిపుణులైన వైద్యులుగా రాణించేందుకు అకడమిక్‌గా తొలి రోజు నుంచే కృషి చేయాలని పేర్కొంటున్నారు. 
మూడు విభాగాలుగా బోధన
➡︎
    ఎంబీబీఎస్‌ కోర్సును ప్రస్తుతం మూడు స్పెషలైజేషన్లుగా వర్గీకరించి బోధిస్తున్నారు. అవి ప్రీ–క్లినికల్, పారా–క్లినికల్, క్లినికల్‌. అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ సబ్జెక్ట్‌లు ఉండే ప్రీ–క్లినికల్‌లో రాణించడం చాలా అవసరం. కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్‌ సైన్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ సబ్జెక్ట్‌లు పారా క్లినికల్‌ విభాగంలో ఉంటాయి. ఈ దశలోనే విద్యార్థులు ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్స్, వార్డ్స్‌లో క్లినికల్‌ పోస్టింగ్స్‌ పేరుతో ఆస్పత్రులలో ప్రాక్టికల్‌గా పని చేస్తూ నైపుణ్యం పెంచుకోవాల్సి ఉంటుంది. క్లినికల్‌ విభాగంలో కమ్యూనిటీ మెడిసిన్, మెడిసిన్‌– మెడిసిన్‌ అనుబంధ సబ్జెక్ట్‌లైన సైకియాట్రి, డెర్మటాలజీ, ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, పిడియాట్రిక్స్‌తోపాటు సర్జరీ, సర్జరీ అనుబంధ సబ్జెక్ట్‌లుగా అనస్థీషియాలజీ, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌ ఉంటాయి. దీంతోపాటు క్లినికల్‌ పోస్టింగ్స్‌ అంటే ఆస్పత్రుల్లో ఆయా విభాగాల్లో ప్రాక్టికల్స్‌ చేయాల్సి ఉంటుంది.
➡︎    స్పెషలైజేషన్లు, వాటిలోని సబ్జెక్ట్‌లను పరిశీలిస్తే సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వైద్య నైపుణ్యాలు అందించే కమ్యూనిటీ మెడిసిన్‌ మొదలు వైద్య రంగంలో కీలకమైన సర్జరీ వరకు అనేక సబ్జెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో రాణించేందుకు విద్యార్థులు అకడమిక్‌ లెక్చర్స్‌ వినడం, పుస్తకాలను చదవడంతోపాటు వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందేలా ప్రాక్టికల్స్‌లోనూ నైపుణ్యం పెంచుకోవాలి. అందుకోసం టీచింగ్‌ హాస్పిటల్స్‌లోని అధ్యాపకులతో నిత్యం సంప్రదిస్తూ.. వారు చికిత్స పరంగా అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవాలి. అదే విధంగా రోగులకు సంబంధించి కేస్‌షీట్లు పరిశీలిస్తూ.. సంబంధిత వ్యాధులు, వాటి నివారణ మార్గాలపై అవగాహన పెంచుకోవాలి.
Follow our YouTube Channel (Click Here)
ఇంటర్న్‌షిప్‌
ఎంబీబీఎస్‌ కరిక్యులంలో భాగంగా విద్యార్థులు చివరల్లో ఏడాది పాటు రొటేటరీ ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. మెడిసిన్, సర్జరీ, రూరల్, పిడియాట్రిక్స్, ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, క్యాజువాలిటీ, అనస్థీషియాలజీ, ఆప్తాల్మాలజీ, ఎలక్టివ్‌ విభాగాల్లో.. ఒక్కో విభాగంలో నిర్దేశిత వ్యవధిలో మొత్తం 12నెలలపాటు ఇంటర్న్‌షిప్‌ చేయాలి. విద్యార్థులు అకడమిక్‌గా అప్పటి వరకు నాలుగున్నరేళ్లపాటు నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించేలా చూడటమే ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రధాన ఉద్దేశం. కాబట్టి విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఈ సమయంలో ఉన్నత విద్య ఎంట్రన్స్‌ల ప్రిపరేషన్‌కు, ఇతర ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని వైద్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 
ఫౌండేషన్‌ కోర్సు
ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు ఫౌండేషన్‌ కోర్సుకు తప్పనిసరిగా హాజరుకావాలి. ఎంబీబీఎస్‌ విద్యార్థులకు వెద్య విద్య ప్రధాన ఉద్దేశం, నేటి పరిస్థితుల్లో అనుసరించాల్సిన పద్ధతులు, వైద్య రంగంలో నైతిక విలువలు, అభ్యసన నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై ఇందులో అవగాహన కల్పిస్తారు. వీటితోపాటు సామాజిక పరిస్థితులపై అవగాహన కలిగేలా.. లైఫ్‌ సపోర్ట్, సోషియాలజీ అండ్‌ డెమోగ్రాఫిక్స్, బయో–హజార్డ్‌ సేఫ్టీ, పర్యావరణం, సామాజిక దృక్పథం వంటి వాటిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఫౌండేషన్‌ కోర్సు పేరిట కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఉన్నత లక్ష్యాలు చేరుకునేలా
➡︎
ప్రస్తుతం ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌తోనే కెరీర్‌లో స్థిరపడొచ్చు అనే పరిస్థితి లేదు. పీజీ, సూపర్‌ స్పె­షాలిటీ వంటి ఉన్నత కోర్సులు పూర్తి చేస్తేనే రాణించే అవకాశం ఉంది. కాబట్టి ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు మొదట్నుంచే ఉన్నత విద్య మార్గాలపై అవగాహన పెంచుకొని ఆ దిశగా కృషి చేయాలి. 
➡︎ ఎంబీబీఎస్‌ తర్వాత పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయి­లో ఎండీ లేదా ఎంఎస్‌ చేసే అవకాశముంది. ఎండీ కోర్సులో దాదాపు 30 స్పెషలైజేషన్లు ఉ­న్నా­యి. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ను ఎంచుకుని అందులో సీటు పొందేలా నీట్‌–పీజీ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. సర్జరీలపై ఆసక్తి ఉన్న వారు ఎంఎస్‌ కోర్సును ఎంచుకోవచ్చు. శస్త్రచికిత్సలు చేసేందు­కు ఎంఎస్‌ ఉత్తీర్ణులకు మాత్రమే అర్హత లభిస్తుంది. పీజీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు నీట్‌–పీజీ ఎంట్రన్స్‌లో; డీఎం, ఎంసీహెచ్, డీఎన్‌బీ వంటి సూపర్‌ స్పెషాలిటీ కోసం నీట్‌–ఎస్‌ఎస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 
Follow our Instagram Page (Click Here)
➡︎ రీసెర్చ్‌ అవకాశాలు: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులకు రీసెర్చ్‌ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నా­యి. ఎయిమ్స్,జిప్‌మర్, నిమ్‌హాన్స్, పీజీఐఎంఆర్‌ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు రాష్ట్ర స్థా­యిలోని యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ మెడికల్‌ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది.
బీడీఎస్‌లో రాణించేలా..
➡︎
    బీడీఎస్‌ కోర్సు.. మెడికల్, డెంటల్‌ సబ్జెక్ట్‌ల స­మ్మేళంగా ఉంటుంది. కోర్సు వ్యవధి అయిదేళ్లు. నాలుగేళ్లు క్లాస్‌ రూమ్‌ టీచింగ్, మరో ఏడాది రొటేటరీ ఇంటర్న్‌షిప్‌. కోర్సులో భాగంగా దంత సమస్యలకు సంబంధించిన చికిత్స పద్ధతులపై నైపుణ్యం కల్పిస్తారు. ఓరల్‌ అండ్‌ మ్యాక్సిలోఫేషియల్‌ సర్జరీ, ప్రోస్థోడాంటిక్స్, ఆర్థో డాంటిక్స్, ఓరల్‌ మెడిసిన్‌ అండ్‌ రేడియాలజీ, పెరియోడాంటిక్స్, పెడోడాంటిక్స్, కన్సర్వేటివ్‌ డెంటిస్ట్రీ వంటి దంత వైద్య సంబంధిత అంశాలతోపాటు జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్, ఫార్మకాలజీ వంటి అంశాల్లోనూ శిక్షణనిస్తారు.
ఉన్నత విద్య
➡︎
    బీడీఎస్‌ తర్వాత ఉన్నత విద్య కోణంలో ఎండీఎస్‌(మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ) కోర్సు అందుబాటులో ఉంది. మూడేళ్ల వ్యవధిలో ఉండే ఈ కోర్సులో పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇవి కూడా క్లినికల్, నాన్‌–క్లినికల్‌ సబ్జెక్ట్‌లుగా అందుబాటులో ఉండటం విశేషం. నీట్‌–పీజీ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఎండీఎస్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
Join our WhatsApp Channel (Click Here)
పీజీ డిప్లొమా
డెంటల్‌ మెడికల్‌ కేర్‌ విభాగంలో మరో ఉన్నత విద్య కోర్సు.. పీజీ డిప్లొమా. రెండేళ్ల వ్యవధిలో ఉండే ఈ పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేయడం ద్వా­రా పీజీ స్థాయి స్థాయి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగంలో పీజీ డిప్లొ­మా ఉత్తీర్ణులకు మంచి అవకాశాలే లభిస్తున్నాయి.
ఉద్యోగావకాశాలు
బీడీఎస్‌తో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ హోదాలో ప్రభుత్వ వైద్య విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు లేదా వైద్య శాఖలు నిర్వహించే నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదేవిధంగా బీడీఎస్‌ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటున్నాయి. ఆర్మీ డెంటల్‌ కార్ప్స్, టెరిటోరియల్‌ ఆఫీసర్‌ ఇన్‌ ఆర్మీ పేరుతో రక్షణ దళాల్లో, డెంటల్‌ ఆఫీసర్‌గా ఇండియన్‌ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. రైల్వే శాఖ, ఇతర పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్స్‌లోనూ డెంటల్‌ డాక్టర్‌గా ఉద్యోగం దక్కించుకోవచ్చు. ఇందుకోసం ఆయా శాఖలు, విభాగాలు నిర్వహించే నియామక పరీక్షలు, లేదా ఇంటర్వ్యూల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
Join our Telegram Channel (Click Here)
ఓర్పు అవసరం
ఎంబీబీఎస్, బీడీఎస్‌ విద్యార్థులకు ఓర్పు, సహ­నం, సేవా దృక్పథంతో మెలగడం చాలా అవసరం. ఇబ్బందులు ఎదురైనా తట్టుకోగలిగే స్వభా­వం ఉండాలి. విద్యార్థులు ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో అడుగులు వేయాలి. అదే విధంగా రోగులతో మాట్లాడుతుండటం, క్లినికల్‌ సబ్జెక్ట్‌ల విషయంలో ప్రొఫెసర్లను నిరంతరం సంప్రదించడం వంటివి అలవర్చుకోవాలి. ప్రస్తుతం కమ్యూనిటీ మెడిసిన్‌కు కూడా ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు సామాజిక దృక్పథాన్ని కూడా అలవర్చుకోవాలి. 

Published date : 15 Oct 2024 12:07PM

Photo Stories