Skip to main content

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థుల పోరు దీక్ష

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/తిరుపతి కల్చరల్‌: ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.3,900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ బకాయిలు తక్షణం విడుదల చేయాలని, జీవో 77ను రద్దు చేయాలని విద్యార్థి యువజన సంఘాలు పోరు దీక్ష చేశాయి.
Students fight for fee reimbursement initiated

విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని కోరు­తూ వైఎస్సార్‌ విద్యార్థి విభాగం, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఏ, ఏఐవైఎఫ్‌ సోమవారం ఒక రోజు పోరుదీక్ష చేపట్టాయి.

చదవండి: Scholarship Applications: ‘ఉపకార’ దరఖాస్తులు 62 శాతమే.. కార‌ణం ఇదే..

విద్యార్థుల దీక్షలను వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. తిరుపతిలో వైఎస్సార్‌ విద్యార్థి విభా­గం, ఏఐఎస్‌ఎఫ్‌ పిలుపు మేరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఫీజు రీయిం­బర్స్‌మెంట్, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 31 Dec 2024 03:53PM

Photo Stories