Navodaya Admissions : నవోదయ ప్రవేశ పరీక్షలో ఈ విద్యార్థుల ప్రభంజనం..!
తిరుపతి: జవహర్ నవోదయ విద్యాలయంలో 2024–25 విద్యాసంవత్సరంలో 6, 9వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష 3వ జాబితా ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ మేరకు ఆ విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. నవోదయ ప్రవేశ పరీక్ష మూడు జాబితాల ఫలితాల్లో 6, 9వ తరగతిలోకి మొత్తం 59 మంది విద్యార్థులు సీట్లు సాధించినట్లు తెలిపారు.
Gurukul School Salaries: గురుకుల ఉద్యోగుల వేతన వెతలు
గత 34 ఏళ్లుగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ వంటి పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడంతో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలతో పాటు అత్యుత్తమ మార్కులు, ర్యాంకులను తమ విద్యార్థులు సాధిస్తున్నారని తెలిపారు. అనంతరం నవోదయలో సీట్లు సాధించిన విద్యార్థులను ఆ విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి, కరస్పాండెంట్ ఎన్.తులసీ విశ్వనాథ్ అభినందించారు.
Deemed Medical Colleges: డీమ్డ్ మెడికల్ కాలేజీలపై సర్కారు గరం