IAS Ramya Sucess Story: రూ.5 వేలకు చిరు ఉద్యోగం, అయిదు సార్లు ఓటమి..కట్ చేస్తే..!
విజయం సాధించాలంటే ఎంత కష్టమైనా భరించాలి. నిబద్దత, పట్టుదల ఉంటే చాలు ఓటమి ఎన్నిసార్లు వెక్కిరించినా విజయం వచ్చి ఒడిలో వాలుతుంది. కావాల్సిందల్లా సాధించాలనే కసి. కడు పేదరికం నుంచి కూడా ఓర్పు, అభిరుచి ఉంటే విజయం సాధించ వచ్చు. అలాంటి సక్సెస్ స్టోరీని తలుసుకుందాం...రండి..!
తమిళనాడులోని కోయంబత్తూర్ పాలక్కాడ్‌కు చెందిన ఆర్ ముత్తులక్ష్మి, ఆర్ చంద్రశేఖర్‌ల ఏకైక కుమార్తె రమ్య. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూపెరిగిన రమ్య చదులు రాణించింది. పదవతరగతి ఆ తరువాత పాలిటెక్నిక్ డిప్లమా చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ,ఆ తర్వాత IGNOUలో ఎంబీఏ చేసింది.
తండ్రి మరణంతో ఇంటి బాధ్యతలు..
ఐఏఎస్ కావాలను కలలు కంది.ఇంతలో తండ్రి అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుంది. బెంగళూరుకు చెందిన ఇన్‌స్ట్రుమెంటేషన్ కంపెనీలో మూడేళ్లపాటు పనిచేసింది. ఉద్యోగం చేస్తూనే ఐఏఎస్ ఆఫీసర్ కలలు కంది. క్రమంగా ఆ కల నెర్వేర్చుకోవాలనే పట్టుదలా పెరిగింది.
అలా 2017 లో యూపీఎస్సీ నోటిఫికేషన్ రావడం ఆలస్యం, ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నైకి వెళ్లిపోయింది. కానీ తన ఖర్చులకైనా ఏదో ఒక పని చేసుకోవాలి అందుకే రోజుకు మూడు గంటలు పనిచేసేలా డేటా ఎంట్రీ ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో ఆమె వేతనం ఐదు వేలు మాత్రమే.
ఐదు వేల ఉద్యోగం చేసే స్థాయి నుంచి కలెక్టర్‌గా..
మిగిలిన సమయాన్ని చదువుకోసం కేటాయించేది. కానీ తొలి పరీక్షలో కనీసం ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేక పోయింది. అయినా పట్టువీడలేదు. ఐదు సార్లు ఫలితం దక్కక పోయినా ఏ మాత్రం నిరాశ పడలేదు. అపజయాలే విజయానికి సోపానాలు అన్న మాటను అక్షరాలా నిజం చేస్తూ 2021 ఫలితాల్లో ఏకంగా జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. తల్లి సహకారం, తోడ్పాటుతోనే ఈ విజయం సాధించానంటూ ఆమో సంతోషంతో ఉప్పొంగిపోయింది. ప్రస్తుతం ఆమె ఐఎఫ్ఎస్ అధికారిణిగా పనిచేస్తున్నారు.