Success Story: ఇందుకే పోలీస్ ఉద్యోగంలోకి వచ్చాను.. కానీ
2018 గ్రూప్-1 బ్యాచ్‌కు చెందిన ఈమె అప్పటి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 14, మహిళా విభాగంలో నాలుగో ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. శ్రావణి తొలుత కృష్ణా జిల్లా బందర్ సబ్‌డివిజన్ ఇన్ చార్జి డీఎస్పీగా విధులు నిర్వహించారు. అలాగే పాలకొండ పోలీస్ సబ్‌డివిజన్ అధికారిగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. ఆమెను కలిసిన ‘సాక్షి’తో ముచ్చటించారు.
Success Story: కూలీ పనులు చేస్తూ చదివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..
సాక్షి: మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
డీఎస్పీ శ్రావణి: మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. అక్కడ బీఈ ఎలక్ట్రానిక్స్ చదివా. తండ్రి గాంధీ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శేషపద్మ గృహిణి. నాకో సోదరుడు ఉన్నారు.
సాక్షి: పోలీస్ శాఖను ఎంచుకోవడంలో మీ ముఖ్య ఉద్దేశం ఏమిటి ?
డీఎస్పీ శ్రావణి: మిగాతా ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే పోలీస్ శాఖ ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్స్‌కు సిద్ధమై విజయం సాధించాను.
Group 1 Ranker: ఆన్‌లైన్ కోచింగ్..గ్రూప్–1 ఉద్యోగం
సాక్షి: భవిష్యత్ లక్ష్యాలు ఏమిటి ?
డీఎస్పీ శ్రావణి: ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి వచ్చాను. అన్నివర్గాల ప్రజలకు చట్టం సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం. భవిష్యత్‌లో ఎక్కడ విధులు చేపట్టినా మంచి పేరు తెచ్చుకోవాలి. ఓ ఉద్యోగిగానే కాకుండా ప్రజలు మెచ్చిన అధికారిగా ఉంటా.
సాక్షి: మీరు ఏఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తారు?
డీఎస్పీ శ్రావణి: ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల భద్రత, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాను. ఏజెన్సీ కలబోసి ఉన్న ఈ సబ్‌డివిజన్ లో సారా అమ్మకాలు, తయారీపై కఠినంగా వ్యవహరిస్తా. సమస్యల పరిష్కారం కోరి వచ్చిన వారితో గౌరవంగా సిబ్బంది మెలిగేలా చొరవ తీసుకుంటా. ట్రాఫిక్ సమస్యను గాడిలో పెట్టేందుకు ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై అపోహలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా.
Y.Obulesh, Group 1 Ranker : ప్రభుత్వ స్కూల్‌లో చదివా...ప్రభుత్వ ఉద్యోగం కొట్టానిలా..
సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎటువంటి చర్యలు చేపడతారు?
డీఎస్పీ శ్రావణి: ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపడతాం. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని ముందుగానే బైండోవర్ చేస్తాం. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తాం.
సాక్షి: నేటితరం యువతకు మీ సూచనలు..?
డీఎస్పీ శ్రావణి: యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. లక్ష్యం కోసం కృషి చేస్తే కోరుకునే ఆనందం దక్కుతుంది. ఆ లక్ష్యం చేరుకున్నప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుంది. కన్నవారు సంతోషిస్తారు. ప్రజలకు శాఖా పరంగా అందుబాట్లో ఉంటా. ఏ సమస్య ఉన్నా నేరుగా కలిసి తెలియజేయవచ్చు.
DSP Snehitha : గ్రూప్–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా
Success Story: ఫస్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..
గ్రూప్–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్.. ఆర్‌టీఓగా ఉద్యోగం
Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..
గ్రూప్–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్.. ఆర్‌టీఓగా ఉద్యోగం