TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చదివితే నెలలో ‘గ్రూప్స్’ కొట్టొచ్చు..
కోచింగ్ సెంటర్స్‌కు వెళ్తేనే పోటీ పరీక్షలో విజయం సాధిస్తామనేది భ్రమని చెప్పారు. గ్రూప్స్‌లో ఇంటర్వ్యూ తొలగించినందున పరిజ్ఞానం ఉన్నవాడికి పారదర్శకంగా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థులు ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే అంశంపై రవీందర్ ‘సాక్షి’తో పంచుకున్న అంశాలు ఆయన మాటల్లోనే.. మీకోసం..
లక్ష్య సాధనలో విద్యార్థుల పాత్రేంటి..?
ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్య దీనిపై లోతుగా అధ్యయనం చేసింది. చాలామంది విద్యార్థుల్లో అంతర్లీనంగా సామర్థ్యాలున్నాయి. దృష్టి పెడితే పోటీ పరీక్షల్లో విజయం సాధించగల సత్తా ఉంది. కానీ వాళ్లు స్వల్పకాలిక లక్ష్యాలకే ప్రాధాన్య మిస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. దీంతో గ్రూప్స్ పోటీకి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోలేకపోతున్నారు. దీన్ని గమనించిన తర్వాత ఓయూలో సివిల్స్ అకాడమీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీని కోసం రూ.37 లక్షలు ఖర్చు పెట్టాం.
కోచింగ్ కేంద్రాలతో ఫలితం ఉంటుందా.. ఉండదా..?
లక్షల మంది విద్యార్థులు కోచింగ్ కేంద్రాల బాట పడుతున్నారు. అక్కడికి వెళ్తేనే పోటీ పరీక్షల్లో రాణిస్తామని భ్రమ పడుతున్నారు. నా అనుభవం ప్రకారం ఇది శుద్ధ దండగ. అక్కడ కేవలం షార్ట్ కట్ పద్ధతులు మాత్రమే చెబుతారు. ఒకరకంగా ఇది మల్టిపుల్ చాయిస్ లాంటిదే. ఆ మాదిరి ప్రశ్న వస్తేనే అభ్యర్థి సమాధానం ఇవ్వగలడు. కానీ సొంతంగా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటే మెరుగైన రీతిలో గ్రూప్స్‌లో రాణించే వీలుంది. కాబట్టి కోచింగ్ కేంద్రాలకు వెళ్లి విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోవద్దు.
TSPSC & APPSC: గ్రూప్స్ పరీక్షల్లో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..?
గ్రూప్స్‌కు ఏం చదవాలి? ఏఏ పుస్తకాలు చదవాలి..?
గ్రూప్స్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా 8 నుంచి ఇంటర్ వరకూ ఉన్న పుస్తకాలను అభ్యసించాలి. వీటిల్లో లోతైన విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌సీ ఇంటర్మీడియెట్ పుస్తకాలు.. రాష్ట్ర సిలబస్‌తో పోలిస్తే పోస్ట్‌గాడ్యుయేషన్ పుస్తకాలతో సమానం. ప్రతీ పాఠం తర్వాత పాఠానికి కొనసాగింపు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఫలితంగా గ్రూప్స్‌లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా తేలికగా సమాధానం ఇవ్వగలిగే సత్తా విద్యార్థులకు ఉంటుంది.
TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్టడం ఎలా? ఎలాంటి బుక్స్ చదవాలి..?
ఆప్షన్స్ ఎంపిక ఎలా ఉంటే మంచిది ?
ఈ మధ్య గ్రూప్–2లో సోషల్ సబ్జెక్టు ఆప్షన్‌గా తీసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులే మంచి స్కోర్ సాధించారు. కొత్త సబ్జెక్టు అయితే, మూలాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లోతుగా అధ్యయనం చేసే విద్యార్థి ఆప్షన్ విషయంలో ఏది తీసుకున్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి. సివిల్స్‌లో కూడా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది.
Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
తక్కువ సమయంలోనే గ్రూప్స్‌కు ప్రిపరేషన్ ఎలా.?
సాధ్యమే. రోజూ ఒక గంట ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు చదవాలి. ఆ తర్వాత దినపత్రికల్లో సంపాదకీయాలు చదవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రముఖ రచయితల పుస్తకాలు చదవాలి. పోటీ పరీక్షలకు గ్రూప్ డిస్కషన్స్ చాలా ముఖ్యం. ఈ తరహా చర్చల వల్ల లోతైన పరిజ్ఞానం అలవడే వీలుంది. నెల రోజులు సీరియస్‌గా చదివితే కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండానే గ్రూప్స్ కొలువు కొట్టొచ్చు. అలాగే, ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. సమయపాలన చాలా ముఖ్యం. దీనిపై ప్రిపరేషన్ నుంచే దృష్టి పెట్టాలి.
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో భర్తీ చేయనున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..
➤ గ్రూప్-1 పోస్టులు: 503
➤ గ్రూప్-2 పోస్టులు : 582
➤ గ్రూప్-3 పోస్టులు: 1,373
➤ గ్రూప్-4 పోస్టులు : 9,168
Success Story: వేలల్లో వచ్చే జీతం కాదనీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..
TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?
ఇటు ఆంధ్రప్రదేశ్‌లో.. గ్రూప్–1, 2 పోస్టుల భర్తీ ఇలా..
గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో ప్రకటించిన జాబ్ క్యాలండర్ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ 1, 2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. ఆ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినివ్వడంతో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.