TSPSC Group 1 Notification: 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ప్రాక్టీస్ టెస్ట్స్, గైడెన్స్ వివరాలు
ఇటీవలే ఇంటర్వ్యూలను తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో కేవలం ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు దశల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే. మెయిన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గతంలో మొత్తం 1,000 మార్కులకు ఉండే గ్రూప్–1 పరీక్షను (ఇంటర్వ్యూ 100 మార్కులు పోను) 900 మార్కులకు.
చదవండి: TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్టడం ఎలా? ఎలాంటి బుక్స్ చదవాలి..?
గ్రూప్–1 సర్వీసెస్
డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, రీజినల్ ట్రాన్ ్సపోర్ట్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, డివిజినల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఎస్సీడీడీ), అసిస్టెంట్ డైరెక్టర్ (బీసీడబ్ల్యూఓ), జిల్లా గిరిజన సంక్షేమాధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్(మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, శిక్షణ కళాశాలలో అసిస్టెంట్ లెక్చరర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్.
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మొత్తం మార్కులు: 900
సబ్జెక్ట్ | సమయం (గంటలు) | గరిష్ట మార్కులు |
ప్రిలిమినరీ టెస్ట్ (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) | 2 1/2 | 150 |
రాత పరీక్ష (మెయిన్ ) (జనరల్ ఇంగ్లిష్)(అర్హత పరీక్ష) | 3 | 150 |
మెయిన్ పేపర్–1 జనరల్ ఎస్సే
|
3 | 150 |
పేపర్–2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ
|
3 | 150 |
పేపర్–3 ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
|
3 | 150 |
పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
3 | 150 |
పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
|
3 | 150 |
పేపర్–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
3 | 150 |
చదవండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్