Supreme Court of India : TGPSC గ్రూప్-1 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు లైన్ క్లియర్... ఈ పిటిషన్ కొట్టివేత

దీంతో TGPSC గ్రూప్-1 సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే గ్రూప్-1 General Ranking Listను విడుదల చేసిన విషయం తెల్సిందే.
గతంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయవివాదాలను అధిగమించేందుకు జీవో 55ను ప్రభుత్వం సవరించి.. జీవో 29 తీసుకొచ్చింది. దీని ప్రకారం.. రిజర్వుడు కేటగిరీలతో సంబంధం లేకుండా ప్రతి మల్టీజోన్‌లోని పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేయాలి. అయితే మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన వారిలో ఏదైనా రిజర్వుడు కేటగిరీలోని పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో ఆ వర్గం అభ్యర్థులు లేకుంటే.. ఆ కేటగిరీలోని తదుపరి మెరిట్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలి.
గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు (మెయిన్స్) అభ్యర్థుల ఎంపికలో రిజర్వుడు కేటగిరీ వర్గాలకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ మెరిట్ జాబితా రూపొందించినట్లు టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంలో సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి భవిష్యత్తులో న్యాయవివాదాలు తలెత్తకుండా జీవో 29 రూపొందించి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఒక నోటిఫికేషన్‌లో రెండు స్థాయుల్లో రిజర్వేషన్లు అమలు చేయకూడదన్న నిబంధన పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయనున్నట్లు స్పష్టంచేశాయి. తెలంగాణ సబార్డినేట్ సర్వీసు నిబంధనల ప్రకారం అన్నివర్గాలకు సమన్యాయం చేసేలా గ్రూప్-1లో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి.
మొత్తం 563 పోస్టులకు 1:50 నిష్పత్తిలో 28,150 మంది మాత్రమే మెయిన్స్‌కు హాజరుకావాలి. ఇందులో అన్నివర్గాలకు చోటు లభించింది. కానీ రిజర్వుడు వర్గాలకు న్యాయం చేసేందుకు జీవో 29 ద్వారా తీసుకొచ్చిన నిబంధనతో.. మెరిట్ జాబితాలో చోటు దక్కని ఆయా వర్గాలకు చెందిన దాదాపు 3,233 మందికి అదనంగా ప్రధాన పరీక్షలు రాసే అర్హత లభించినట్లు వెల్లడించాయి. అయితే ఈ విధానంతో తాము నష్టపోతున్నామని కొందరు అభ్యర్థులు చెబుతున్నారు.
2007లో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ 196 పోస్టులతో గ్రూప్-1 ప్రకటన వెలువరించింది. ఈ మేరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1997లో జారీచేసిన జీవో 570 ప్రకారం.. రిజర్వుడు కేటగిరీలతో సంబంధం లేకుండా (అంటే ఈ మెరిట్‌లో ఓసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వుడు కేటగిరీల వారు ఉంటారు) ఉద్యోగ ఖాళీల సంఖ్య మేరకు 1:50 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెలువరించింది. 2007 నోటిఫికేషన్‌లో మెయిన్స్ పరీక్ష ఎంపికకు అనుసరించిన ఈ విధానాన్ని బాలోజి బడావత్, మరో 30 మంది హైకోర్టులో సవాల్ చేశారు. రిజర్వుడు కేటగిరీలతో సంబంధం లేకుండా జనరల్ మెరిట్ ద్వారా మెయిన్స్‌కు ఎంపిక చేయడం చెల్లదని.. సంబంధిత రిజర్వుడు కేటగిరీల వారీగా 1:50 నిష్పత్తి పాటిస్తూ ఎంపిక చేయాలని 2008లో హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించింది. ఈ నిర్ణయాన్ని ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ రిజర్వుడు కేటగిరీలతో సంబంధం లేకుండా మెయిన్స్‌కు జనరల్ మెరిట్ లిస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించింది.
తెలంగాణలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 55 ప్రకారం... ప్రతి మల్టీజోన్‌లోని పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపికలో తెలంగాణ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 22, 22 ఏ నిబంధనల ప్రకారం రిజర్వుడు కేటగిరీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్స్ రిజర్వేషన్లు పాటించింది. జీవో 55 తీసుకువచ్చినపుడు దీన్ని సవాల్ చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయాన్ని టీజీపీఎస్సీ వర్గాలు గుర్తుచేశాయి. గతంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయవివాదాలను అధిగమించేందుకు జీవో 55ను ప్రభుత్వం సవరించి.. జీవో 29 తీసుకొచ్చింది. దీని ప్రకారం.. రిజర్వుడు కేటగిరీలతో సంబంధం లేకుండా ప్రతి మల్టీజోన్‌లోని పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేయాలి. అయితే మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన వారిలో ఏదైనా రిజర్వుడు కేటగిరీలోని పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో ఆ వర్గం అభ్యర్థులు లేకుంటే.. ఆ కేటగిరీలోని తదుపరి మెరిట్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలి.
Tags
- supreme court has given the green signal for Group 1 recruitments
- Telangana by dismissing the petition filed against GO 29
- GO 29 news in telugu
- supreme court of india cancelled go 29
- supreme court of india cancelled go 29 news telugu
- TSPSC Group 1
- tspsc group 1 certificate verification
- Supreme Court of India dismissed a petition GO 29
- tspsc group 1 certificate verification dates
- tspsc group 1 news telugu
- tspsc group 1 news details telugu
- TSPSC Group 1 news
- TSPSC Group 1 news in telugu