Skip to main content

TGPSC Group 1 Ranker: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. గ్రూప్-1లో 148వ ర్యాంక్‌ సాధించిన తరుణ్‌ చక్రవర్తి!

చౌటుప్పల్‌ రూరల్‌: గ్రూప్‌–1 ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన వనం తరుణ్‌ చక్రవర్తి రాష్ట్ర స్థాయిలో 148వ ర్యాంక్ సాధించి అద్భుత విజయం సాధించారు.
softwre job to group 1 success tarun chakravarthy ranking 148

తరుణ్‌ చక్రవర్తి తల్లిదండ్రులు వనం శ్రీలత, శ్రీనివాసులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఆయన భువనగిరిలోని మదర్‌థెరిస్సా హైస్కూల్‌లో ప్రాథమిక విద్య, చలకుర్తి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 6 నుంచి 10వ తరగతి, హైదరాబాద్ నారాయణ కళాశాలలో ఇంటర్‌, అనంతరం వరంగల్ NITలో బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తి చేశారు.

చదవండి: TGPSC Group 1 Ranker: గ్రూప్‌–1 ఫలితాల్లో 1వ ర్యాంకును కైవసం చేసుకున్న కన్నం హరిణి

చదువు పూర్తయ్యాక రెండేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన తరుణ్‌ సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి నాలుగేళ్లుగా గ్రూప్‌–1 కోసం కష్టపడి ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌–1లో 148వ ర్యాంకు సాధించి తన పట్టుదల నిరూపించుకున్నారు.

తన విజయానికి పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, కఠినమైన కృషే కారణమని తరుణ్‌ చక్రవర్తి తెలిపారు. పట్టుదలతో ప్రయత్నిస్తే గ్రూప్‌–1లో విజయం సాధించవచ్చనిaspiring candidatesకి ఆయన సూచించారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 03 Apr 2025 12:25PM

Photo Stories