Success Story: నా కష్టం వృథా కాలేదు.. గ్రూప్-2 కొట్టానిలా..
ఆ కోవకే చెందుతుంది మౌనిక. చదువు పూర్తవగానే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంది. ఇందులోభాగంగా గ్రూపు-2పై దృష్టి సారించి, దానితోపాటు మరో రెండు ఉద్యోగాలు సాధించింది. వివరాల్లోకి వెళితే...
Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..
ఇలా చదివా..
కరీంనంగర్ జిల్లాకు చెందిన మౌనిక బీటెక్ చదివింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో 2014లో హైదరాబాద్ వచ్చింది. ఎనిమిది నెలలపాటు కోచింగ్ కేంద్రంలో శిక్షణ పొందింది. ప్రతిరోజూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. ఏ రోజుకారోజు చదువుకోవడమే కాకుండా పునశ్చరణ చేసుకునేది. కోచింగ్ తర్వాత కూడా ప్రతిరోజూ స్టడీ హాల్‌కు వెళ్లి పుస్తకాలపైనే దృష్టి పెట్టింది.
Inspirational Story: కూలీ పనులు చేస్తూ చదివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా
మౌనిక కష్టం వృథా కాలేదు.. కానీ
2015లో గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది. దానికోసం అన్నివిధాలుగా సిద్ధమైనప్పటికీ ఆ పరీక్ష కాస్తా వాయిదా పడింది. ఆ తర్వాత 2016, నవంబర్‌లో ఎట్టకేలకు పరీక్ష జరిగింది. అయితే కోర్టు కేసుల కారణంగా ఫలితాలు రాలేదు. 2017లో టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికైంది. ఇదే పరీక్షపై కోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే తెలంగాణాలో పంచాయితీ కార్యదర్శి, గ్రూప్-4 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయినా మౌనిక కష్టం వృథా కాలేదు పంచాయితీ కార్యదర్శితోపాటు గ్రూప్-4కి కూడా ఎంపికైంది. పంచాయితీ కార్యదర్శి ఫలితాలు మొదట రావడంతో మానకొండూరు మండలంలోని రంగపేట గ్రామంలో కార్యదర్శిగా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత గ్రూప్-2 ఫలితాలొచ్చాయి. అందులో అబ్కారీశాఖలో ఎస్‌ఐగా కొలువు దక్కింది.
Success Story: గ్రూప్-2లో విజయం సాధించా.. మళ్లీ గ్రూప్-2 రాశా.. ఎందుకంటే..?