Success Story: కేంద్ర కొలువుకు నో చెప్పా.. గ్రూప్-2కు జై కొట్టా..
గ్రూప్-2తో కలిపి మూడు ఉద్యోగాలు సాధించిన పవన్ తో సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేక ఇంటర్యూ..
Success Story: పరీక్ష రాస్తే.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగమే...
కుటుంబ నేపథ్యం..
మాది నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని దాచేపల్లి గ్రామం. నాన్న చీమర్ల వెంకటరెడ్డి రిటైర్డ్ ఎల్ఐసీ ఉద్యోగి.. అమ్మ సుమిత్ర ప్రభుత్వ పాఠశాల టీచర్. ఇటీవలే వివాహం జరిగింది. భార్య పేరు హరిణి.
నా చదువు..
పాఠశాల విద్యను వనపర్తిలో పూర్తి చేశాను. ఇంటర్మీడియెట్, బీటెక్ హైదరాబాద్ లో చదివాను. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చేశాను.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
గుర్తింపు కోసమే..
బీటెక్ అవ్వగానే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాను. అనంతరం ఎంటెక్ చదువుతూనే ప్రిపరేషన్ కొనసాగించాను. 2015లో ఎస్ఎస్సీ సీజీఎల్ సాధించి, చెన్నైలో ఆడిటర్ గా ఉద్యోగం చేశాను. అయినా ఎదో అసంతృప్తి. జనంతో సంబంధం లేకుండా ఉండడం, ఐడెంటిటీ లేకపోవడం దానికి కారణం. ఆ సమయంలో తెలంగాణలో పోలీస్, గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదలవడంతో వాటికి ప్రిపేరేషన్ స్టార్ట్ చేశాను.
Success Story: శభాష్.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక.. చివరికి..
నా ప్రిపరేషన్ ఇలా..
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చదివేవాడిని. వారానికి ఐదు రోజులే పనవడంతో.. నా ప్రిపరేషన్ చాలా ఈజీ అయింది. ప్రతి శుక్రవారం వర్క్ అవ్వగానే ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చి, ఓ ప్రైవేటు ఇన్స్టిట్యూట్ లో ప్రాక్టీస్ టెస్టులు రాసేవాడిని. దాంతో నేను ఎంతవరకు నేర్చుకున్నానని, ఏ టాపిక్ లో వీక్ గా ఉన్నానో తెలిసేది. ఆ టాపిక్ కి ఎక్కువ సమయం కేటాయించేవాడిని. ప్రతి రోజు దినపత్రికలు కచ్చితంగా చదివేవాన్ని. ఒకరోజు చదవకపోయిన మనం ఇతరుల కంటే ఎంతో వెనుకబడిపోయినట్లే.
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..
ఒకే ప్రిపరేషన్‌తో.. రెండు ఉద్యోగాలు..
ఒకే ప్రిపరేషన్ తో అటు సివిల్ ఎస్సై.. ఇటు గ్రూప్స్ రాశా. ముందుగా పోలీస్ రిక్రూట్మెంట్ ఫలితాలు రావడంతో సివిల్ ఎస్సైగా జాయిన్ అయ్యా.. తర్వాత వచ్చిన గ్రూప్-2 ఫలితాల్లో ఎక్సైజ్ ఎస్సైగా సెలెక్ట్ అయ్యా. ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలు నాటుసారా, కల్తీ కల్లు వంటికి బానిసై జీవితాలను నాశనం చేసుకోకుండా చూడడం ఎంతో సంతృప్తినిస్తోంది.
TSPSC గ్రూప్–2 పరీక్ష 600 మార్కులకు కుదింపు... పరీక్షా విధానం ఇదే!
గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్లకి నా సలహా..
గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్లకి వారిపై వాళ్లకి సాధించాగలననే నమ్మకం ఉండాలి. ఎంత ఏకాగ్రతతో చదివితే లక్ష్యానికి అంత దగ్గరవుతారు. ఎక్కువగా ప్రాక్టీస్ టెస్టులు రాయాలి. అప్పుడే వాళ్లలో లోపాలు తెలుస్తాయి. రోజూ కచ్చితంగా దినపత్రిక చదవడం అలవాటు చేసుకోవాలి. అది దేశవ్యాప్తంగా జరిగే వివిధ విషయాలపై అవగాహన పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
Inspirational Story: పేదరికాన్ని జయించాడు... సివిల్స్ సత్తా చాటాడు..
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..