Success Story: శభాష్.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక.. చివరికి..
పాలెం గ్రామానికి చెందిన జెనిగె బాలకొండయ్య, లక్ష్మి కుమారుడు శివకుమార్ ఒకటి నుంచి ఐదువరకు కొత్తకోట భారతీ విద్యామందిర్‌లో, ఆరు నుంచి పదివరకు బీచుపల్లి రెసిడెన్సియల్‌లో చదివాడు. ఇంటర్ విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీ, బీటెక్ గట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో, ఎంటెక్ మీర్‌పేటలోని తీగల కృష్ణారెడ్డి కాలేజీలో విద్యనభ్యసించాడు. విద్యానంతరం తీగల కృష్ణారెడ్డి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వరిస్తూ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌ల పరీక్ష రాసాడు.
ఈ నాలుగింటిలోనూ...
ఈ నాలుగింటిలోనూ ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. వీటిలో ఎస్‌పీడీసీఎల్(సౌత్ పవర్ డిస్ట్రీబ్యూటర్ కార్పోరేషన్ లిమిటెడ్)లో రాష్ట్ర స్థాయి 18వ ర్యాంకు సాధించాడు. దీంతో ఎస్‌పీడీసీఎల్‌లో నియామకం అయినట్టు శివకుమార్ తెలిపాడు. తండ్రి బాలకొండయ్య ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తండ్రి ప్రోత్సాహంతో ఈ విజయాలు సాధించినట్లు శివకుమార్ తెలిపాడు.
Success Story: పరీక్ష రాస్తే.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగమే...
Inspirational Story: పేదరికాన్ని జయించాడు... సివిల్స్ సత్తా చాటాడు..
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..