Skip to main content

Good News JLM and AE Jobs 2024 : 3,500 జూనియర్‌ లైన్‌మెన్ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్.... అలాగే ఏఈ పోస్టుల‌కు కూడా... ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో ఖాళీగా ఉన్న 3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.
 Junior Lineman Jobs

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌), వరంగల్‌ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎన్‌ఎస్పీడీసీఎల్‌)ల్లో ఇప్పటికే 3,500 వరకు జేఎల్‌ఎం, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. 

ఈ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఎప్పుడంటే...?
ఈ పోస్టుల‌కు అక్టోబర్‌ నెల చివ‌రిలోపు నోటిఫికేషన్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.
టీఎన్‌ఎస్పీడీసీఎల్‌లో 1,550 వరకు జేఎల్‌ఎం పోస్టులు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌ పరిధిలోనే 550 ఖాళీలున్నాయి. గతంలో ఇచ్చిన నియామక నోటిఫికేషన్‌లో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో హైదరాబాద్‌ పరిధిలో ఏకంగా 200 వరకు పోస్టులు మిగిలిపోయాయి. వీటన్నిటినీ కలిపి మరో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. 

☛ Police Jobs Notifications 2024 : పోలీసు ఉద్యోగాల భ‌ర్తీపై కీల‌క ఆదేశాలు...

మహిళలు కూడా..
మహిళలు కూడా ఈ పోస్టులకు అర్హులు కావడంతో త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరో వైపు 50 వరకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టులు ఉండటంతో వీటి భర్తీకి కూడా టీజీఎస్పీడీసీఎల్‌ నియామక ప్రకటన జారీ చేయనుంది. 

నోటిఫికేష‌న్ ఆల‌స్యంకు కార‌ణం ఇదే..?
జేఎల్‌ఎం, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టుల భర్తీకి అక్టోబరులోనే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు డిస్కంలు ప్రయత్నిస్తున్న ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వ అనుమతి మేరకే ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ అంశం తేలిన తర్వాతే తదుపరి ఉద్యోగ నోటిఫికేషన్లు అని ఇటీవల ఉపసంఘం ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో ముందుగానే ఉద్యోగ ప్రకటన ఇచ్చిరా పోస్టుల భర్తీ నాటికి వర్గీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి వ్యవహరించాలని డిస్కంలు భావిస్తున్నాయి. అన్ని కుదిరితే.. ఈ నెల చివ‌రిలోపు JLM and AE Jobs కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

Published date : 17 Oct 2024 07:47PM

Photo Stories