Skip to main content

3260 Jobs: డిస్కంలలో 3,260 కొత్త కొలువులు.. కొలువుల వివ‌రాలు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. వరంగల్‌ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో 2,212 జేఎల్‌ఎం (జూనియర్‌ లైన్‌మెన్‌), 30 సబ్‌ ఇంజనీర్, 18 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ల (ఎలక్ట్రికల్, సివిల్‌)తో పాటు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో 600 జూనియర్‌ లైన్‌ మెన్‌ (జేఎల్‌ఎం), 300 సబ్‌ ఇంజనీర్, 100 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్‌ సంస్థలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించిన నివేదికలో తెలిపాయి.
tg electricity department posts be filled discums  Recruitment fair for state power companies in Telangana Recruitment for electrical and civil engineers in Telangana power companies

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్, వీలింగ్‌ టారిఫ్‌ వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌) పిటిషన్లలో విద్యుత్‌ సంస్థలు ఈ కొత్త నియామకాల అంశాన్ని ప్రస్తావించాయి.

చదవండి: NGRI Recruitment 2025: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్‌ అర్హత‌తో ఉద్యోగాలు!

కాగా, ఐటీఐ చేసిన వారు జేఎల్‌ఎం ఉద్యోగాలకు, పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసిన వారు సబ్‌ ఇంజనీర్, బీఈ/బీటెక్‌ అభ్యర్థులు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు అర్హులు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం రెండు డిస్కంలు త్వరలో ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందని సమాచారం.

Published date : 20 Jan 2025 01:22PM

Photo Stories