1,661 Jobs: టీఎస్ ఎస్పీడీసీఎల్‌లో పోస్టులు
ఏఈ పోస్టులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15వరకు.. జేఎల్‌ఎం పోస్టులకు మార్చి 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రెండు పరీక్షలకు కూడా ఏప్రిల్ 24 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30న రాతపరీక్ష నిర్వహించనున్నారు. గరిష్ట వయోపరిమితి జేఎల్‌ఎం పోస్టులకు 35 ఏళ్లు, ఏఈ పోస్టులకు 44 ఏళ్లు.
చదవండి: విద్యుత్ కొలువులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు!
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు అర్హులు. జూనియర్ లైన్‌మన్ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్‌మన్ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్రి్టకల్ ట్రేడ్‌లో ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్ (https://tssouthernpower.cgg.gov.in) ను సందర్శించవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రకటించింది.
చదవండి: తెలంగాణలో భారీగా విద్యుత్ కొలువులు.. సొంతం చేసుకోండిలా