Skip to main content

1, 661 Jobs: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో పోస్టుల భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: Telangana State Southern Power Distribution Company Limited (TSSPDCL)లో ఖాళీగా ఉన్న 1,553 Junior Lineman (JLM), 48 Assistant Engineer (Electrical) పోస్టులు కలిపి మొత్తం 1,661 పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్‌ జారీ చేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆదేశించారు.
1, 661 Jobs
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో పోస్టుల భర్తీ

నిరంతర విద్యుత్‌ సరఫరాపై జనవరి 31 ఆయన మింట్‌ కాంపౌండ్‌ లోని తన కార్యాలయంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డితో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యుత్‌ డిమాండ్‌ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు.

చదవండి: ఈ కొలువులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపు

రాష్ట్రంలో ఏడాదికేడాది విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిపోతోందని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 6,666 మెగావాట్లు ఉన్న గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ గతేడాది యాసంగిలో 14,160 మెగావాట్లకు పెరిగిందన్నారు. వచ్చే వేసవిలో 15,500 మెగావాట్లకు మించనుందని, అందుకు తగ్గట్టు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎండీలను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, గృహ వినియోగదారుల పెరుగుదల, వ్యవ సాయ రంగానికి ఉచితవిద్యుత్‌ సరఫరాతో డిమాండ్‌ గణనీయంగా పెరిగిందన్నారు. 

చదవండి: విద్యుత్‌ కొలువులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు!

Published date : 01 Feb 2023 12:24PM

Photo Stories