Skip to main content

Asst Engineer Posts : పీఆర్ శాఖ‌లో అసిస్టెంట్ ఇంజ‌నీర్ల పోస్టులు భ‌ర్తీ చేయాలి

రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పీఆర్‌ ఇంజినీర్ల సంఘాల నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు.
Assistant engineer posts at panchayati raj department

అమలాపురం టౌన్‌: పంచాయతీ రాజ్‌ (పీఆర్‌) శాఖలో దాదాపు 50 శాతం మేర ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజినీర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఏపీ రాష్ట్ర పీఆర్‌ డిప్లామా ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు కె.రవీంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పీఆర్‌ ఇంజినీర్ల సంఘాల నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు.

APPSC Jobs Notification Details 2024 : ఏపీపీఎస్సీ విడుద‌ల చేయ‌నున్న ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవే...? ఇంకా ఫెండింగ్‌లో ఉన్న‌వి కూడా...

ఈ కార్యక్రమానికి రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మిస్తున్న పీఆర్‌ విభాగం ద్వారా నిర్మిస్తున్న సీసీ రోడ్లలో నాణ్యత ఉండాలని సూచిస్తోంది కానీ, అందుకు తగ్గట్టు ఏఈల పోస్టులు భర్తీ కాకపోవతే వాటిని ఎలా పర్యవేక్షించాలని ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ తామంతా సమన్వయంతో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

జిల్లా పీఆర్‌ ఇంజినీర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా వీరభద్రరావు

ఈ సమావేశంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పీఆర్‌ ఇంజినీర్ల అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నికకు రాష్ట్ర పీఆర్‌ ఇంజినీర్ల అసోసియేషన్‌ కార్యదర్శి కె.రమేష్‌ ఎన్నికల అధికారిగా, ఫైనాన్స్‌ సెక్రటరీ మురళి పరిశీలకునిగా వ్యవహరించారు.

School Teachers : ప్ర‌తీ ఉపాధ్యాయులు క‌చ్చితంగా స‌మ‌య‌పాల‌న పాటించాలి

జిల్లా నూతన కార్యవర్గం అధ్యక్షునిగా డి.వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శిగా వి.రమేష్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా పీఎస్‌ రాజ్‌కుమార్‌, కోశాధికారిగా ఎంఎస్‌ఎల్‌ సంధ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా కేవీవీ సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గాన్ని అమలాపురం పీఆర్‌ డివిజన్‌ డీఈఈ, రాష్ట్ర అసోసియేషన్‌ కార్య నిర్వాహక కార్యదర్శి అన్యం రాంబాబు అభినందించారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Oct 2024 02:21PM

Photo Stories