School Teachers : ప్రతీ ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించాలి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా సకాలంలో బడికి వెళ్లాలని నూతన డీఈఓ వరలక్ష్మి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా నుంచి బదిలీపై జిల్లాకు విచ్చేసిన ఆమె ఆదివారం డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. 2008, 2015లో చిత్తూరు డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్, అడిషనల్ డైరెక్టర్ 1, 2గా విధులు నిర్వహించినట్లు తెలిపారు.
Manda Makarand IAS: రూ.30 లక్షల జీతం వదులుకుని... మున్సిపల్ కమీషనర్ గా
ఆ సమయంలో ఉమ్మడి జిల్లా కావడంతో జిల్లాపై తనకు పట్టు ఉందన్నారు. ప్రభుత్వ ఆశయాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి చిత్తూరు జిల్లాకు అన్ని స్థాయిల్లో గౌరవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. శక్తి వంచన లేకుండా విధులు నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో బడికి డుమ్మా కొట్టే టీచర్లు ఉన్నట్లయితే వారి పట్ల ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు కచ్చితంగా సమయపాలన పాటించి పాఠశాలలకు హాజరుకావాలన్నారు. నిత్యం ఉపాధ్యాయుల హాజరుపట్టికను పరిశీలిస్తానని స్పష్టం చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఇష్టానుసారంగా గైర్హాజరుకావడం, అనుమతి లేకుండా పాఠశాలలు వదిలి వెళ్లడం వంటివి సహించేది లేదన్నారు. జిల్లాలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. అనంతరం ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ నూతన డీఈఓలతో నిర్వహిస్తున్న సమావేశానికి ఆమె బయలుదేరి వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన నూతన డీఈఓకు ఏడీ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్‌లు సత్య, రామ్‌కుమార్, వీజీ రమణ, సిబ్బంది మురళి, గోపాల్, సాయి, విజయ, మదన్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.