ఈ కొలువులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపు
Sakshi Education
తెలంగాణ ట్రాన్స్కోలో ఉద్యోగ నియామకాల కోసం గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పొడిగిస్తూ సంస్థ సీఎండీ డి.ప్రభాకర్ రావు మే 25న ఉత్తర్వులు జారీ చేశారు.
2024 మార్చి 18 వరకు ఈ పొడిగింపు అమల్లోకి ఉండనుంది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) విభాగం మినహా మిగిలిన అన్ని విభాగాల కొలువులకు వయోపరిమితి పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కొలువుల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ట్రాన్స్‌కోలో సైతం అమలు చేయాలని సంస్థ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌కో జారీ చేసిన ఉత్తర్వులను మిగిలిన విద్యుత్ సంస్థలైన జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ సైతం అమలు చేయనున్నాయి.
చదవండి:
TSPSC గ్రూప్–1 నోటిఫికేషన్.. శాఖలవారీగా పోస్టులు.. వయోపరిమితి సడలింపు!
Published date : 26 May 2022 04:35PM