Skip to main content

TGPSC Group 2 : గ్రూప్-2 ఉద్యోగం కోసం ఈ మార్కులు వ‌స్తే చాలు.. పేప‌ర్లు ఎలా వ‌చ్చాయంటే..!

తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌కాల‌కు నిర్వ‌హించే ప‌రీక్ష గ్రూప్స్‌.
TGPSC group 2 exams cut off marks for job guarantee

సాక్షి ఎడ్యుకేష‌న్: గ్రూప్స్‌ ఈ ప‌రీక్ష కోసం వేలాది, ల‌క్షాది మంది అభ్య‌ర్థులు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప‌రీక్ష‌లు రానే వ‌చ్చాయి. సజావుగా ముగిసాయి. 2024, డిసెంబ‌ర్ 15, 16వ తేదీల్లో ఈ పరీక్ష‌ల‌ను నాలుగు పేప‌ర్లుగా విభ‌జించి, నిర్వ‌హించింది టీజీపీఎస్సీ.

Syllabus Reduction : విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఈ సిల‌బ‌స్‌లో కుదింపు.. బోర్డు కీల‌క నిర్ణ‌యం..!!

ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు గానూ ప‌రీక్ష‌ల‌ను నిర్వహించారు. ఈ పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఈ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌పై అభ్య‌ర్థుల‌కు అనేక సందేహాలు ఉన్నాయి. ఇందులో ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది..? కటాఫ్ మార్కులు ఎంత వరకు ఉండొచ్చు..? ఏఏ పేపర్ కఠినంగా వచ్చింది..? అనే విష‌యాల‌ని ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

పేప‌ర్ సులువా.. క‌ఠిన‌మా..!

టీజీపీఎస్సీ గ్రూప్-2 పేపర్-1 అయితే, కఠినంగా వచ్చిందని చెప్పవచ్చు. ఈ ప‌రీక్ష‌లో కరెంట్ అఫైర్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి ప్రశ్నలు వచ్చాయి. అది కూడా హార్డ్ లెవల్‌లో రావ‌డం అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న లేపింది. దీంతో ప‌రీక్ష క‌ఠినంగా మారింది. ఇదిలా ఉంటే, జాగ్రఫీ ఎవరికీ ఎక్కడ కనబడని ప్రశ్నలు వ‌చ్చాయి.. ముఖ్యంగా వరల్డ్ జాగ్రీపీ అయితే మ‌రింత‌ కఠినంగా వ‌చ్చిందని చెప్పొచ్చు. మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కూడా అదే లెవల్ లో రావడంతో చాలా మంది అభ్యర్థులు పేపర్ కఠినంగా వచ్చిందనే భావిస్తున్నారు. పేపర్‌కు 70 నుంచి 80 వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు. ఇక పేపర్ -2 తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ చాలా కఠినమైన ప్రశ్నలు వచ్చాయి. పాలిటీ, సొసైటీ ఈజీ టూ మోడరేట్ గా ప్రశ్నలు రావడంతో.. పేపర్-2 లో 90 నుంచి 100 మార్కులు వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు.

Telangana Group-1 Mains Result News:తెలంగాణ గ్రూప్‌–1 మెయిన్స్‌ ఫలితాలకు లైన్‌క్లియర్‌.....హైకోర్టు వాదనలు సాగాయిలా... 

పేపర్-3, పేపర్-4 ఎలా ఉన్నాయంటే..?

పేపర్-3 విష‌యానికొస్తే ఎకానమీకి సంబంధించిన‌ పేపర్ కఠినంగా వచ్చింది. ఇండియన్ ఎకానమీ ఈజీ టూ మోడరేట్ గా ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ ఎకానమీ అయితే 2021-22, 2022-23 సర్వేల నుంచి ప్రశ్నలు రావడంతో చాలా మంది అభ్యర్థులు ప్రశ్నలకు ఆన్సర్ చేయలేకపోయార‌ని తెలిసింది. పేపర్-3 లో 85 నుంచి 95 మార్కుల మధ్య స్కోర్ వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు. ఇక పేపర్-4 తెలంగాణ ఉద్యమం చాలా మంది అభ్యర్థులు 140 చేయగలమని భావించారు. తీరా క్వశ్చన్ పేపర్ చూస్తే ప్రశ్నలు అంతా సులభంగా ఏం రాలేదు. ఇందులో 100 నుంచి 110 మార్కులు వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు.

పేపర్-1 జీఎస్: 70-80

పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ: 90-100

పేపర్-3 ఎకానమీ: 85-95

పేపర్-4 తెలంగాణ ఉద్యమం: 100-110

Group Exams Results : గ్రూప్-1 ఫ‌లితాల విడుద‌ల‌పై హైకోర్టు ఏమ‌న్నాదంటే..!!

ఇక‌పోతే, పేపర్లలో అన్నీ కలిపి 340 మార్కులు దాటితే అది మంచి స్కోర్ అనే చెప్పొచ్చు. 350 మార్కులు దాటిన వారందరూ హోప్ పెట్టుకోవచ్చు. 360 మార్కులు దాటిన వారికి ఛాన్స్‌ మరింత ఎక్కువే ఉంటుంది. అయితే, టీజీపీఎస్సీ అఫీషయల్ కీ కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. అఫీషియల్ కీ వచ్చాక ఎన్ని మార్కులు వచ్చాయనేది అభ్యర్థులు తెలుసుకోవచ్చు. గ్రూప్-2 అండ్ గ్రూప్ -3 పరీక్షల కీ త్వరగా విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 01 Jan 2025 12:19PM

Photo Stories