Skip to main content

Syllabus Reduction : విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఈ సిల‌బ‌స్‌లో కుదింపు.. బోర్డు కీల‌క నిర్ణ‌యం..!!

ప‌రీక్ష‌ల మాట వింటేనే విద్యార్థుల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. ప్ర‌తీ ప‌రీక్ష‌కు పూర్తి సిల‌బ‌స్‌ను చ‌దివినా, కొన్నిసార్లు ప‌రీక్ష రాసే స‌మ‌యంలో గుర్తుండ‌దు చాలామంది విద్యార్థుల‌కు.
Syllabus reduction for telangana intermediate first and second year students

సాక్షి ఎడ్యుకేష‌న్: ప‌రీక్ష‌ల మాట వింటేనే విద్యార్థుల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. ప్ర‌తీ ప‌రీక్ష‌కు పూర్తి సిల‌బ‌స్‌ను చ‌దివినా, కొన్నిసార్లు ప‌రీక్ష రాసే స‌మ‌యంలో గుర్తుండ‌దు చాలామంది విద్యార్థుల‌కు. అయితే, ఎటువంటి ప‌రీక్ష ఉన్న‌ప్ప‌టికీ దానికి ఒక క్ర‌మం, ప‌ద్ధ‌తి పాటిస్తూ విద్యార్థులంతా సన్న‌ద్ధ‌మ‌వుతుంటారు. ఎంత చ‌దివిన‌ప్ప‌టికీ, విద్యార్థుల్లో ఆ భ‌యం ప‌రీక్ష‌లు ముగిసి, ఫ‌లితాలు వెలువ‌డే వ‌ర‌కు వెంటాడుతూనే ఉంటుంది.

TS Inter Admissions 2025 : ఇక‌పై ఇంట‌ర్‌లో ప్ర‌వేశాలు DOST లాగే.. JOST.. ఎలా అంటే..?

మ‌రీ ముఖ్యంగా ఇంట‌ర్ విద్యార్థుల‌కు అయితే ఇంకా ఎక్కువే. వారికి త‌ర‌గ‌తులు ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి వారి ఇంట‌ర్ విద్య పూర్తి చేసుకునే వ‌ర‌కు ప్ర‌తీ ప‌రీక్ష భ‌యంగా, ఒత్తిడిగానే ఉంటుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం విద్యార్థుల భ‌యాన్ని, ఒత్తిడిని గుర్తించి, అర్థం చేసుకొని, ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం ఒక కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సమావేశం నిర్వహించిన‌ బోర్డు అధికారులు.. సిల‌బ‌స్‌లో మార్పుల‌ను ప్ర‌క‌టించారు. ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఉన్న‌ సిలబస్‌లో కొన్ని తగ్గింపులు చేయాల‌ని నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) సిలబస్‌ను దృష్టిలో పెట్టుకొని.. సైన్స్ స‌బ్జెక్ట్‌తో సహా అన్ని సబ్జెక్టుల్లో సిలబస్‌ను తగ్గించేందుకు చర్య‌లు చేప‌డుతుంది స‌ర్కార్‌.

Inter Board : ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష ఫీజు చెల్లింపుకు మ‌రింత పెరిగిన గ‌డువు.. ఇంట‌ర్ బోర్డ్ స్ప‌ష్ట‌త‌..!

ఈ సబ్జెక్టుల్లో..

అయితే, విద్యార్థుల‌కు సిల‌బ‌స్‌తో ఒత్తిడిని త‌గ్గించేందుకు తీసుకున్న నిర్ణ‌యాన్ని ఇప్పుడు కాకుండా, వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం అంటే, 2026-27 నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంట‌ర్మీడియ‌ట్‌లో అమలు చేయనుంది తెలంగాణ స‌ర్కార్‌. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఇక‌పై కెమిస్ట్రీలో 30 శాతం, ఫిజిక్స్ లో 15 శాతం, జువాలజీలో 5-10 శాతం వరకు సిలబస్ తగ్గించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

COE Notification: సీవోఈ నోటిఫికేషన్‌ ఎప్పుడో?.. ప్రవేశం దక్కితే విద్యార్థులకు వరం..

సిలబస్ కుదింపు నిర్ణయం అమల్లోకి వస్తే.. సైన్స్ విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఒత్తిడి తీవ్రత తగ్గడమే కాకుండా, పాస్ పర్సంటేజ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలా జ‌రిగితే గ‌న‌క విద్యార్థుల‌కు మ‌రింత సులువ‌వుతుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 01 Jan 2025 11:06AM

Photo Stories