Skip to main content

1,601 Jobs: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

సాక్షి, హైదరాబాద్‌: Telangana State Southern Power Distribution Company Limited (TSSPDCL) 48 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌), 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2న వేర్వేరు నియామక ప్రకటనలు జారీ చేసింది.
1,601 Jobs
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల స్వీకరణ తదితర వివరాలతో ఫిబ్రవరి 15 లేదా ఆ తర్వాత పూర్తి స్థాయి నియామక ప్రకటనను సంస్థ వెబ్‌సైట్ల(www.tssouthernpower.com లేదా tssouthern-power.cgg.gov.in) లో పొందుపరచనున్నారు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఎలక్రి్టకల్‌ అండ్‌ ఎలక్ట్రానికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ(ఎలక్ట్రికల్‌) పోస్టులకు అర్హులు కానున్నారు.

చదవండి: ఈ కొలువులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపు

జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్‌/వైర్‌మెన్‌ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు చేసి ఉండాలి. 2022లో 1,000 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్టు గుర్తించడంతో ఆ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దుచేశారు. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని గతంలో ఇచి్చన హామీ మేరకు పోస్టుల సంఖ్యను 1,553కి పెంచి తాజాగా సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

చదవండి: TSSPDCL: విద్యుత్‌ కొలువులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు!

Published date : 03 Feb 2023 03:33PM

Photo Stories