Skip to main content

1,271 Jobs in TSSPDCL: విద్యుత్‌ కొలువులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు!

TSSPDCL 2022 notification

తెలంగాణ దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) తాజాగా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది! జేఎల్‌ఎం, సబ్‌–ఇంజనీర్, ఏఈ స్థాయిలో.. 1,271 పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. దీనిద్వారా ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌లలో.. ఎలక్ట్రికల్, ఈఈఈ బ్రాంచ్‌ అభ్యర్థులు.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో కొలువుదీరే అవకాశం దక్కించుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతన శ్రేణి సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ తాజా నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ..

  • టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 1,271 కొలువులకు ప్రకటన
  • ఏఈ, సబ్‌ ఇంజనీర్, జేఎల్‌ఎం ఉద్యోగాల భర్తీ
  • రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
  • పరీక్షల తేదీలు కూడా ప్రకటించిన టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌
  • ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు సదవకాశం

మొత్తం 1,271 పోస్ట్‌లు

  • టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌..మొత్తం 1,271పోస్ట్‌లు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు...
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌–70, సబ్‌ ఇంజనీర్‌–201, జూనియల్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎమ్‌)–1000

విద్యార్హతలు

  • ​​​​​​​అసిస్టెంట్‌ ఇంజనీర్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లతో బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏఎంఐఈ నిర్వహించే ఎలక్ట్రికల్‌/ఈఈఈ విభాగాల్లో సెక్షన్‌–ఏ,బీలలో ఉత్తీర్ణత సాధించాలి.
  • సబ్‌–ఇంజనీర్‌: ఈ పోస్ట్‌లకు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఇవే బ్రాంచ్‌లతో బీటెక్‌ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జూనియర్‌ లైన్‌మెన్‌: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రికల్‌ లేదా వైర్‌మెన్‌ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణులు లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సుల ఉత్తీర్ణులు అర్హులు.


చ‌ద‌వండి: Telangana Govt Jobs: విద్యుత్‌ శాఖలో 1271 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

వయసు

  • ఏఈ, సబ్‌–ఇంజనీర్‌ పోస్ట్‌లకు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 44ఏళ్లను గరిష్ట వయోపరిమితిగా పేర్కొనగా.. జూనియర్‌ లైన్‌మెన్‌ అభ్యర్థులకు 35ఏళ్లను గరిష్ట వయోపరిమితిగా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ నిర్దేశించింది. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

రాత పరీక్ష ఆధారంగా ఎంపిక

అసిస్టెంట్‌ ఇంజనీర్, సబ్‌–ఇంజనీర్‌ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా నియామకాలు ఖరారు చేయనున్నారు. వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో.. రెండు విభాగాలుగా ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష మొత్తం రెండు గంటల వ్యవధిలో జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు..

సెక్షన్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
సెక్షన్‌–ఎ కోర్‌ టెక్నికల్‌ సబ్జెక్ట్‌ 80 80
సెక్షన్‌–బి జనరల్‌ అవేర్‌నెస్, న్యూమరికల్‌ ఎబిలిటీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమానికి సంబంధించిన చరిత్ర 20 20
మొత్తం   100 100

జేఎల్‌ఎమ్‌.. రాత పరీక్ష, పోల్‌ టెస్ట్‌

జూనియర్‌ లైన్‌మెన్‌ ఎంపిక విధానం కొంత భిన్నంగా ఉంటుంది. ముందుగా రెండు సెక్షన్లుగా రాత పరీక్ష, ఆ తర్వాత పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌(స్తంభాలు ఎక్కే పరీక్ష) నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తదుపరి దశలో పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. రాత పరీక్ష వివరాలు..

సెక్షన్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
సెక్షన్‌–ఎ కోర్‌ ఐటీఐ సబ్జెక్ట్‌ 65 65
సెక్షన్‌–బి జనరల్‌ నాలెడ్జ్‌ 15 15
మొత్తం   80 80

రెండో దశలో పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌

  • జూనియర్‌ లైన్‌మెన్‌ రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా తదుపరి దశలో పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఒక్కో పోస్ట్‌కు 1:2 నిష్పత్తిలో పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ టెస్ట్‌కు 20 మార్కులు కేటాయించారు.
  • రాత పరీక్ష, పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌లలో పొందిన మార్కులను గణించి.. తుది జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.

రెండేళ్ల ప్రొబేషన్‌

మూడు రకాల పోస్ట్‌లకు కూడా ఎంపికైన వారికి ప్రొబేషన్‌ పిరియడ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఒక ఏడాది పాటు శిక్షణ సమయంగా, తదుపరి ఏడాదిని ప్రొబేషనరీ పిరియడ్‌గా పరిగణిస్తారు. ఈ రెండూ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి శ్వాశత కొలువు ఖరారు చేస్తారు.

రాత పరీక్షలో విజయం ఇలా..

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సంస్థ ఏఈ, సబ్‌–ఇంజనీర్, జేఎల్‌ఎమ్‌ పోస్ట్‌లకు నోటిఫికేషన్, రాత పరీక్ష వివరాలు ప్రకటించిన నేపథ్యంలో.. రాత పరీక్షలో విజయానికి దృష్టి పెట్టాల్సిన అంశాలు..

ఏఈ పరీక్షకు సన్నద్ధత..

  • ఏఈ పోస్ట్‌లకు పోటీ పడే అభ్యర్థులు బీటెక్‌లో తాము చదివిన కోర్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. 
  • ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌లో లీనియర్‌ అల్జీబ్రా, కాలిక్యులస్, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, కాంప్లెక్స్‌ వేరియబుల్స్, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్, న్యూమరికల్‌ మెథడ్స్, ట్రాన్స్‌ఫార్మ్‌ థియరీలపై పట్టు సాధించాలి.
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించి ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ ఫీల్డ్స్, సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్, ఎలక్ట్రికల్‌ మెషిన్స్, పవర్‌ సిస్టమ్స్, కంట్రోల్‌ సిస్టమ్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మెజర్‌మెంట్స్, అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగాలపై అవగాహన పెంచుకోవాలి.

సబ్‌ ఇంజనీర్‌కు ఇలా

సబ్‌ ఇంజనీర్‌ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. బేసిక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెషిన్స్‌ అండ్‌ మెజర్‌మెంట్స్, ఏసీ సర్క్యూట్స్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మర్స్, ఏసీ మెషిన్స్, పవర్‌ సిస్టమ్‌ జనరేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్, ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్, యుటిలైజేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ డ్రైవ్స్, ఎలక్ట్రికల్‌ ఎస్టిమేషన్‌ అండ్‌ ఆటోమేషన్, బేసిక్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మైక్రో కంట్రోలర్‌ విభాగాల్లోని అన్ని అంశాలపై సంపూర్ణ పట్టు సాధించాలి. 

జనరల్‌ అవేర్‌నెస్‌.. సిద్ధమవ్వాలిలా

  • ఏఈ, సబ్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లకు 20 మార్కులకు ఉండే జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం కోసం అభ్యర్థులు అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్, తెలంగాణ సంస్కృతి,ఉద్యమాలకు సంబంధించిన ముఖ్యాంశాలు, పరిణామాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌పై అవగాహన పెంచుకోవాలి. 
  • అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీలో రాణించేందుకు బేసిక్‌ అర్థమెటిక్‌ అంశాలు(శాతాలు,నిష్పత్తులు, కాలం–దూరం,పని–కాలం,సగటు, బాడ్‌మాస్‌ తదితర)పై పట్టు సాధించాలి.
  • జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం కరెంట్‌ అఫైర్స్‌తోపాటు జనరల్‌ నాలెడ్జ్‌పై పట్టు పెంచుకోవాలి. సదస్సులు, ముఖ్యమైన వ్యక్తులు, అవార్డులు వంటి అంశాలు తెలుసుకోవాలి.
  • ఇంగ్లిష్‌లో రాణించడానికి బేసిక్‌ గ్రామర్‌ అంశాలు(ప్రిపొజిషన్స్, ఆర్టికల్స్, పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, యాంటానిమ్స్, సినానిమ్స్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్‌ తదితర) ప్రాక్టీస్‌ చేయాలి.
  • తెలంగాణ సంస్కృతి, ఉద్యమానికి సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటం మొదలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వరకూ.. ముఖ్యమైన ఘట్టాలపై అవగాహన పెంచుకోవాలి.
  • కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కోసం బేసిక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్, కీ–బోర్డ్‌ షార్ట్‌ కట్‌ కమాండ్స్, పీపీటీ ప్రజెంటేషన్‌ రూపకల్పన, ఎక్స్‌ఎల్‌ ఫార్మ్‌ క్రియేషన్‌ తదితర అంశాలపై పట్టు పెంచుకోవాలి.

జేఎల్‌ఎమ్‌ రాత పరీక్ష

జేఎల్‌ఎమ్‌ రాత పరీక్షలో రాణించాలంటే.. 65 ప్రశ్నలకు ఉండే కోర్‌ సబ్జెక్ట్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నటిజం, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఏసీ, బేసిక్‌ ఎలక్ట్రానిక్స్, డీసీ మెషిన్స్, ట్రాన్స్‌ ఫార్మర్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రికల్‌ మెజర్‌మెంట్స్, ఎలక్ట్రిక్‌ పవర్‌ జనరేషన్‌ విభాగాల్లోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.

జేఎల్‌ఎమ్‌.. జనరల్‌ అవేర్‌నెస్‌ ఇలా

15 మార్కులకు ఉండే జనరల్‌ అవేర్‌నెస్‌లో రాణించేందుకు అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, కరెంట్‌ అఫైర్స్,కన్సూ్యమర్‌ రిలేషన్స్,నిజజీవితంలో సామాన్య శాస్త్రం,పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ,తెలంగాణ హిస్టరీ,ఎకానమీ,జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమం అంశాలపై సన్నద్ధత సాధించాలి. అదే విధంగా సిలబస్‌లో తెలంగాణ సంస్కృతి,సమాజం,వారసత్వం, కళలు, సాహిత్యం, తెలంగాణ ఉద్యమాలకు కొంత వెయిటేజీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ హిస్టరీకి సంబంధించి ప్రత్యేక దృష్టితో చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.

అకడమిక్‌ పుస్తకాలతో.. కోర్‌ సబ్జెక్ట్స్‌

  • మూడు విభాగలకు సంబంధించి సెక్షన్‌–ఎలో ఉండే కోర్‌ సబ్జెక్ట్స్‌లో పట్టు సాధించేందుకు అభ్యర్థులు తమ అకడమిక్‌ పుస్తకాలను ఆలంబనగా చేసుకుని అభ్యసనం సాగించాలి. ఆయా అంశాలను అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ప్రాక్టీస్‌ చేయాలి. గత ప్రశ్న పత్రాలు, మోడల్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఏఈ అభ్యర్థులు గేట్, ఈఎస్‌ఈ పేపర్లను ప్రాక్టీస్‌ చేయడం మేలు చేస్తుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: http://tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ముందుగా నిర్దేశిత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 

ఏఈ పోస్ట్‌లు ముఖ్య తేదీలు

  • ఏఈ పోస్ట్‌లకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 3, 2022
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: జూలై 11, 2022
  • పరీక్ష తేదీ: జూలై 17, 2022

సబ్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూలై 5, 2022
  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: జూలై 23, 2022 
  • పరీక్ష తేదీ: జూలై 31, 2022

జూనియర్‌ లైన్‌మెన్‌ ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 8, 2022
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: జూలై 11, 2022
  • పరీక్ష తేదీ: జూలై 17, 2022
  • నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు, దరఖాస్తుకు వెబ్‌సైట్‌: http://tssouthernpower.cgg.gov.in, www.tssouthernpower.com

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్​​​​​​​
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification 10TH
Last Date July 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories