Skip to main content

TSSPDCL: జేఎల్‌ఎం నోటిఫికేషన్‌ రద్దు!

సాక్షి ఎడ్యుకేషన్‌: Southern Power Distribution Company of Telangana(TSSPDCL)లో వెయ్యి Junior Lineman(JLM) పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి ఆగస్టు 25న ప్రకటించారు.
TSSPDCL
జేఎల్‌ఎం నోటిఫికేషన్‌ రద్దు!

ఈ పోస్టుల భర్తీకి త్వరలో మరో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి గత జూలై 17న నిర్వహించిన రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, మరికొంత మంది దళారులతో కలిసి పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో వారికి సమాధానాలు చేరవేసినట్టు ఆరో పణలు వచ్చాయి. అప్పటికప్పుడు కొందరు విద్యు త్‌ అధికారులు, సిబ్బందిని రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు విచారించి అరెస్టు చేశారు. మొత్తం 181 అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు పోలీసు ల దర్యాప్తులో వెలుగు చూసింది. మరింత మంది అభ్యర్థులకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉండే అవకాశాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కొంత మంది అభ్యర్థులు హైదరాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో ఉన్న సంస్థ కార్యాలయం ఎదుట అప్ప ట్లో ధర్నాలు నిర్వహించారు. అభ్యర్థుల నుంచి వ చ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ JLM పోస్టుల భర్తీకి గత మే 9న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. 

నోటిఫికేషన్‌ రద్దుపై అభ్యర్థుల్లో అసంతృప్తి

జేఎల్‌ఎం రాత పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని తాము కోరితే ఏకంగా నోటిఫికే షన్‌ రద్దు చేయడం సరికాదని కొందరు జేఎల్‌ఎం అభ్యర్థులు పేర్కొంటున్నారు. మళ్లీ కొత్తగా నోటిఫి కేషన్‌ జారీ చేస్తే నియామక ప్రక్రియలో తీవ్ర జా ప్యం జరుగుతుందని, మళ్లీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Published date : 26 Aug 2022 03:30PM

Photo Stories