Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. వీళ్లు అర్హులు
Sakshi Education
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బెంగుళూరు నగరంలో కంప్యూటర్, ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పౌండేషన్ అడ్మిషన్స్ కో ఆర్డినేటర్ హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్ అయి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.
35 రోజులపాటు కొనసాగే ఈ శిక్షణలో ట్యాలీ, జీఎస్టీ, కంప్యూటర్ స్కిల్స్, స్పోకన్ ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్ ప్లేస్ ఎథిక్స్‌లో శిక్షణ ఇస్తారన్నారు.శిక్షణానంతరం వివిధ సంస్థల్లో కనీస వేతనం రూ.15వేలతో ఉపాధి కల్పిస్తారన్నారు. ఇతర వివరాలకు 90004 87423 నెంబరులో సంప్రదించాలన్నారు.
Published date : 16 Jul 2024 01:53PM
Tags
- Free training
- free training program
- Free training for unemployed youth
- Self Employed Courses
- Free Coaching
- Free Skill Training
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- SakshiEducationUpdates
- skill trainings
- Latest News in Telugu
- Education News
- andhra pradesh news
- jobs news
- Unnati Foundation free training
- computer tally courses Bangalore
- unemployed youth education
- skills training eligibility
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications