తెలంగాణలో భారీగా విద్యుత్ కొలువులు.. సొంతం చేసుకోండిలా
Sakshi Education
తెలంగాణ దక్షిణ మండల విద్యుత్తు సరఫరా సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది. జూనియర్ లైన్‌మన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చింది. ప్రభుత్వ సంస్థల పరంగా చూస్తే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న సంస్థలు విద్యుత్ శాఖకు చెందినవే. దాంతో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలపై అభ్యర్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. పరీక్షకు రెండు నెలల సమయం అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. శ్రమిస్తే కరెంట్ కొలువును సొంతం చేసుకోవచ్చు...
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎస్పీడీసీఎల్).. 2500 జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలు (జేఎల్‌ఎం), 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (జేఏసీవో)జాబ్స్, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీఓ) కొలువుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు భర్తీ చేసే సర్కిళ్లు ఇవే..
మహబూబ్‌నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హబ్సిగూడ, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్, ఎస్‌సీఏడీఏ.
జూనియర్ లైన్‌మన్ (జేఎల్‌ఎం):
మొత్తం పోస్టుల సంఖ్య:2500
బేసిక్ పే: రూ.24,340
విద్యార్హతలు: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్/వైర్‌మన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ (ఎలక్ట్రికల్ ట్రేడ్) అర్హత ఉండాలి.
వయసు: 2019 జూలై1 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ఆర్టిజన్లుగా, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌లో ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న సర్వీసు ఉద్యోగుల వయసును వారు ఉద్యోగంలో చేరిన రోజు ప్రకారం పరిగణనలోకి తీసుకుంటారు.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.100, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: జేఎల్‌ఎం పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కోసం మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. రాత పరీక్షకు 80 మార్కులు కేటాయించారు. ఇందులో కనీస అర్హత మార్కులు పొందే ఇన్ సర్వీస్ ఔట్‌సోర్స్ ఉద్యోగులకు గరిష్టంగా 20 మార్కుల వరకు వెయిటేజీ ఉంటుంది. ప్రతి ఆరు నెలల సర్వీసుకు ఒక మార్కు చొప్పున వెయిటేజీ లభిస్తుంది. 6 నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వెయిటేజీ వర్తించదు.
సిలబస్ అంశాలు..
సెక్షన్ ఏ- ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్) :
మ్యాగ్నటిజం: మ్యాగ్నటిక్ మెటీరియల్స్,ప్రాపర్టీస్; లాస్ ఆఫ్ మ్యాగ్నటిజం, ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్.
ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ: సింపుల్ ప్రాబ్లమ్స్, పవర్, పవర్ ఫ్యాక్టర్, సింగిల్ పేజ్, త్రీపేజ్ సర్క్యూట్స్.
బేసిక్ ఎలక్ట్రానిక్స్: ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫయర్స్, ఆంప్లిఫయర్స్, ఆస్కిలేటర్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్.
డీసీ మెషీన్స్: కన్‌స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపుల్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ డీసీ జనరేటర్స్ అండ్ మోటార్స్, స్పీడ్ కంట్రోల్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డీసీ మోటార్స్ - వైండింగ్స్.
ట్రాన్స్ ఫార్మర్స్: కన్‌స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపుల్, బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రాన్స్‌ఫార్మర్స్-వైండింగ్స్, ఆటో ట్రాన్స్ ఫార్మర్స్, పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్, సీటీ అండ్ పీటీ.
ఏసీ మెషీన్స్: బేసిక్ కాన్సెప్ట్స్, కన్‌స్ట్రక్షన్ ప్రిన్సిపుల్, సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ త్రీ పేజ్ అండ్‌సింగిల్ పేజ్ ఇండక్షన్ మోటర్, యూనివర్సల్ మోటార్, ఆల్టర్‌నేటర్స్, సింక్రనస్ మోటార్స్-వాటి అప్లికేషన్లు, వైండింగ్స్-కాన్సెప్ట్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్.
ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్: ఏసీ, డీసీ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, డొమెస్టిక్ అప్లయన్సెస్, ఎలక్ట్రిక్ ల్యాంప్స్.
ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్: థర్మల్, హైడల్, న్యూక్లియర్; ట్రాన్స్ మిషన్ అండ్ డిస్టిబ్య్రూషన్ సిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్స్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్.
సెక్షన్ బీ - జనరల్ నాలెడ్జ్ :
అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కన్జ్యూమర్ రిలేషన్స్, నిత్యజీవితంలో జనరల్ సైన్స్, పర్యావరణం-విపత్తు నిర్వహణ; తెలంగాణ, భారత జాగ్రఫీ, ఎకానమీ, చరిత్ర; తెలంగాణ, ఉద్యమ చరిత్ర; తెలంగాణ సంస్కృతి, సమాజం, వారసత్వం, కళలు-సాహిత్యం తదితర అంశాలుంటాయి.
ఫండమెంటల్స్ + పునశ్చరణ :
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 అక్టోబర్ 22
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: 2019 నవంబర్ 10
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 2019 నవంబర్ 10
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 2019 డిసెంబర్ 5
పరీక్ష తేది: 2019, డిసెంబర్ 15
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://tssouthernpower.cgg.gov.in
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్:
మొత్తం పోస్టుల సంఖ్య: 500
బేసిక్ పే: రూ.29,255
విద్యార్హతలు: బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులు అర్హులు.
వయసు: 2019 జూలై 1 నాటికి 18- 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.100, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
సిలబస్ అంశాలు..
ముఖ్య సమాచారం:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 2019, అక్టోబర్ 31.
ఫీజుల చెల్లింపునకు చివరి తేది: 2019, నవంబర్ 20.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 2019, నవంబర్ 20.
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడింగ్: 2019, డిసెంబర్ 11.
పరీక్ష తేది: 2019, డిసెంబర్ 22.
వెబ్‌సైట్: https://tssouthernpower.cgg.gov.in
జూనియర్ పర్సనల్ ఆఫీసర్:
మొత్తం పోస్టుల సంఖ్య: 25
బేసిక్ పే: రూ.34,925
విద్యార్హతలు: బీఏ, బీకాం, బీఎస్సీ లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులు అర్హులు.
వయసు: 2019 జూలై 1 నాటికి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు కల్పించారు.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.100, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక
ముఖ్య సమాచారం:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 2019 అక్టోబర్ 22
ఫీజుల చెల్లింపునకు చివరి తేది: 2019 నవంబర్ 10
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 2019 నవంబర్ 10
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడింగ్: 2019 డిసెంబర్ 5
పరీక్ష తేది: 2019 డిసెంబర్ 15
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tssouthernpower.cgg.gov.in

- రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి రిజర్వేషన్ నిబంధనల మేరకు 1:2 నిష్పత్తిలో పోల్ క్లైంబింగ్‌కు పిలుస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే ఉద్యోగానికి ఎంపికచేస్తారు. ఈ టెస్టులో విఫలమైతే తిరస్కరణకు గురవుతారు. ఎలాంటి మౌఖిక పరీక్షలు ఉండవు.
- రాత పరీక్ష ప్రశ్న పత్రంలో 80 బహుళైశ్ఛిక ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు (సెక్షన్ ఏ, సెక్షన్ బీ) ఉంటాయి. సెక్షన్ ఏలో ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ సంబంధిత సబ్జెక్టు నుంచి 65 ప్రశ్నలు; సెక్షన్ బీలో జనరల్ నాలెడ్జ్ నుంచి 15 ప్రశ్నల అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. రుణాత్మక మార్కులుండవు.
- రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు.. ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం; ఎస్సీ/ఎస్టీలకు 30 శాతం, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు.
సిలబస్ అంశాలు..
సెక్షన్ ఏ- ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్) :
- ఎలక్ట్రిసిటీ ప్రాథమికాంశాలు: ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, టూల్స్, ఓమ్స్‌లా, కిర్కాఫ్స్ లా, సిరీస్, ప్యార్లర్, కిర్కాఫ్ లా అండ్ స్టార్ డెల్టా, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్ ప్రాబ్లమ్స్, ఎర్తింగ్ ప్రిన్సిపుల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎర్తింగ్.
మ్యాగ్నటిజం: మ్యాగ్నటిక్ మెటీరియల్స్,ప్రాపర్టీస్; లాస్ ఆఫ్ మ్యాగ్నటిజం, ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్.
ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ: సింపుల్ ప్రాబ్లమ్స్, పవర్, పవర్ ఫ్యాక్టర్, సింగిల్ పేజ్, త్రీపేజ్ సర్క్యూట్స్.
బేసిక్ ఎలక్ట్రానిక్స్: ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫయర్స్, ఆంప్లిఫయర్స్, ఆస్కిలేటర్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్.
డీసీ మెషీన్స్: కన్‌స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపుల్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ డీసీ జనరేటర్స్ అండ్ మోటార్స్, స్పీడ్ కంట్రోల్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డీసీ మోటార్స్ - వైండింగ్స్.
ట్రాన్స్ ఫార్మర్స్: కన్‌స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపుల్, బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రాన్స్‌ఫార్మర్స్-వైండింగ్స్, ఆటో ట్రాన్స్ ఫార్మర్స్, పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్, సీటీ అండ్ పీటీ.
ఏసీ మెషీన్స్: బేసిక్ కాన్సెప్ట్స్, కన్‌స్ట్రక్షన్ ప్రిన్సిపుల్, సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ త్రీ పేజ్ అండ్‌సింగిల్ పేజ్ ఇండక్షన్ మోటర్, యూనివర్సల్ మోటార్, ఆల్టర్‌నేటర్స్, సింక్రనస్ మోటార్స్-వాటి అప్లికేషన్లు, వైండింగ్స్-కాన్సెప్ట్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్.
ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్: ఏసీ, డీసీ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, డొమెస్టిక్ అప్లయన్సెస్, ఎలక్ట్రిక్ ల్యాంప్స్.
ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్: థర్మల్, హైడల్, న్యూక్లియర్; ట్రాన్స్ మిషన్ అండ్ డిస్టిబ్య్రూషన్ సిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్స్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్.
సెక్షన్ బీ - జనరల్ నాలెడ్జ్ :
అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కన్జ్యూమర్ రిలేషన్స్, నిత్యజీవితంలో జనరల్ సైన్స్, పర్యావరణం-విపత్తు నిర్వహణ; తెలంగాణ, భారత జాగ్రఫీ, ఎకానమీ, చరిత్ర; తెలంగాణ, ఉద్యమ చరిత్ర; తెలంగాణ సంస్కృతి, సమాజం, వారసత్వం, కళలు-సాహిత్యం తదితర అంశాలుంటాయి.
ఫండమెంటల్స్ + పునశ్చరణ :
- మొదట సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించి సరైన మెటీరియల్ సేకరించుకోవాలి. నిత్యం లక్ష్యాలు పెట్టుకొని వాటిని చేరుకోవాలి. పరీక్షకు సమయం తక్కువ ఉంది. కాబట్టి ఒక్కో అంశానికి రెండు, మూడు రోజులు కేటాయించుకుంటూ సన్నద్ధమవ్వాలి. టెక్నికల్ సబ్జెక్టుకు సంబంధించిన ఫార్ములాలను ఒకచోట రాసుకొని, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఏవైనా సందేహాలుంటే.. వెంటనే ఫ్యాకల్టీ, స్నేహితుల సహాయంతో నివృత్తి చేసుకోవాలి.
- ప్రీవియస్ పేపర్లు సమకూర్చుకొని అందులోంచి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
- ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో సేఫ్టీ, టూల్స్, కిర్కాఫ్స్ లా, మెథడ్‌స ఆఫ్ ఎర్తింగ్ అంశాలతోపాటు స్టార్‌డెల్టా ప్రాబ్లమ్స్‌పైనా దృష్టిపెట్టాలి. మ్యాగ్నటిజం రకాలు, వాటి ఉపయోగాలు తెలుసుకోవాలి. ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీలో పవర్ ఫ్యాక్టర్ సమస్యలు, సమీకరణాలను గుర్తుంచుకోవాలి. పేజ్ సర్క్యూట్ ఆపరేషన్ ఈక్వేషన్, గ్రాఫ్స్‌ను పరిశీలించాలి. బేసిక్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించి ఎలక్ట్రానిక్ ఎలిమెంట్ సింబల్స్, యూనిట్లు, రెక్టిఫయర్, ఇన్వర్టర్ తదితర అంశాలు ముఖ్యమైనవి. డీసీ మెషీన్స్, ట్రాన్స్ ఫార్మర్స్, ఏసీ మెషీన్స్ లోని చిన్నపాటి సమస్యలు, ఈక్వేషన్స్ పై దృష్టిపెట్టాలి. మెజర్‌మెంట్స్‌లో మెజర్‌మెంట్ మెథడ్‌స, అప్లికేషన్స్; రెసిస్టెన్స్ రేటింగ్‌స, ఎర్రర్స్, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకోవాలి. ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ సబ్జెక్టులో ఎక్కువగా ట్రాన్స్ మిషన్ సిస్టమ్స్ ముఖ్యమైనవి. అలాగే, విద్యుత్ ఉత్పత్తి ప్రాథమిక భావనలు, వనరులపై అవగాహన పెంపొందించుకోవాలి. జీఎస్‌లో తెలంగాణ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వడం లాభిస్తుంది. కన్జ్యూమర్ రిలేషన్స్‌పైనా దృష్టి పెట్టాలి. పర్యావరణ సబ్జెక్టుపరంగా ఇటీవల జరిగ సదస్సులు-ఎజెండాలు తెలుసుకోవాలి. చివర్లో కొంత సమయాన్ని తప్పనిసరిగా రివిజన్‌కు కేటాయించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 అక్టోబర్ 22
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: 2019 నవంబర్ 10
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 2019 నవంబర్ 10
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 2019 డిసెంబర్ 5
పరీక్ష తేది: 2019, డిసెంబర్ 15
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://tssouthernpower.cgg.gov.in
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్:
మొత్తం పోస్టుల సంఖ్య: 500
బేసిక్ పే: రూ.29,255
విద్యార్హతలు: బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులు అర్హులు.
వయసు: 2019 జూలై 1 నాటికి 18- 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.100, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
- మొత్తం 100 మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. మరో 20 మార్కులు ఆర్టిజన్లకు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీగా కేటాయిస్తారు. ఆరు నెలల సర్వీసుకు ఒక మార్కు చొప్పున వెయిటేజీ లభిస్తుంది. 6 నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వెయిటేజీ వర్తించదు. అయితే రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందిన ఉద్యోగులకే ఈ వెయిటేజీని అమలు చేస్తారు.
- రాత పరీక్షలో 80 బహుళైశ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న పత్రంలో మూడు విభాగాలు (సెక్షన్ ఏ, బీ, సీ) ఉంటాయి. సెక్షన్ ఏలో 40 ప్రశ్నలు న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ సబ్జెక్టుల నుంచి అడుగుతారు. సెక్షన్ బీలో కంప్యూటర్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు, సెక్షన్ సీలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 20 ప్రశ్నలు ఎదురవుతాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. రాత పరీక్షలో ఓసీలు 40 శాతం, బీసీలు 35 శాతం; ఎస్సీ/ఎస్టీలు 30 శాతం, దివ్యాంగులకు 30 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి. సెక్షన్ ఏ ప్రశ్నలు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటాయి.
సిలబస్ అంశాలు..
- న్యూమరికల్ ఎబిలిటీలో..సూచికలు(ఇండిసెస్), నిష్పత్తి, అనుపాతాలు, లాభ నష్టాలు, క్షేత్రగణితం, బీజ గణితం, రేఖాగణితం, సాంఖ్యాక శాస్త్రం చాప్టర్లను పొందుపర్చారు. లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ చాప్టర్లు సెక్షన్ ఏలో పేర్కొన్నారు. సిలబస్ స్పష్టంగా పరిమితంగా ఉంది. కాబట్టి అభ్యర్థులు వాటిపైనే తదేకంగా దృష్టి సారించాలి. ఇండిసెస్ చాప్టర్‌లో సూత్రాలు కొన్ని ఉంటాయి. వాటిని కంఠస్తం చేసి వాటి అనువర్తనాలతో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నిష్పత్తి అనుపాతాలు చాప్టర్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇందులో వెన్‌డయాగ్రమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి. లాభ నష్టాలు,క్షేత్రగణితం, బీజగణితం, రేఖాగణితం, సాంఖ్యాక శాస్త్రం చాప్టర్లలోనూ ఫార్ములాలు కంఠస్తం చేయడం ద్వారానే ప్రాబ్లమ్స్ పరిష్కరించవచ్చు.
- లాజికల్ రీజనింగ్‌లో.. ప్రాబ్లమ్ సాల్వింగ్ సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారం రాబట్టాలి. మేధస్సును ఉపయోగించి ఒక నిర్ణయానికి వచ్చే తార్కిక ప్రశ్నలు ఎదురవుతాయి. ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయాలి.
- సెక్షన్ బీలో కంప్యూటర్ అవేర్‌నెస్‌లో ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్స్‌కు సంబంధించిన ప్రాథమిక భావనలు, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్కిల్స్, అకౌంటింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఎంఎస్ ఆఫీస్ టూల్స్‌పై ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ.
- సెక్షన్ సీలో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ రీ అరెంజ్‌మెంట్, నానార్థాలు, వ్యతిరేక పదాలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్‌లో కరెంట్ అఫైర్స్, కన్జ్యూమర్ రిలేషన్స్, నిజ జీవితంలో జనరల్ సైన్స్, పర్యావరణ సమస్యలు-విపత్తుల నిర్వహణ, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర చరిత్ర, జాగ్రఫీ, ఎకనామిక్స్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, సమాజం, వారసత్వం, కళలు-సాహిత్యం తదితర అంశాలుంటాయి.
- రాత పరీక్షలో మెరిట్ లిస్టులో నిలిచిన వారి నుంచి రిజర్వేషన్ నిబంధనల మేరకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టులకు ఎంపిక చేస్తారు. వీరికి 30 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు జరుగుతుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. 50 మార్కులకు నిర్వహించే ఈ టెస్టులో.. ఓసీ అభ్యర్థులు 20మార్కులు, బీసీలు 17.5మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 15 మార్కులు సాధించాలి.
ముఖ్య సమాచారం:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 2019, అక్టోబర్ 31.
ఫీజుల చెల్లింపునకు చివరి తేది: 2019, నవంబర్ 20.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 2019, నవంబర్ 20.
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడింగ్: 2019, డిసెంబర్ 11.
పరీక్ష తేది: 2019, డిసెంబర్ 22.
వెబ్‌సైట్: https://tssouthernpower.cgg.gov.in
జూనియర్ పర్సనల్ ఆఫీసర్:
మొత్తం పోస్టుల సంఖ్య: 25
బేసిక్ పే: రూ.34,925
విద్యార్హతలు: బీఏ, బీకాం, బీఎస్సీ లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులు అర్హులు.
వయసు: 2019 జూలై 1 నాటికి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు కల్పించారు.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.100, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక
- జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల ఎంపికలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, ఆర్టిజన్లకు వెయిటేజీ ఉండదు. 100 మార్కులకు నిర్వహించే రాత పరీక్ష ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
- మొత్తం 100 బహుళైచ్చిక ప్రశ్నలు మూడు సెక్షన్లుగా ఉంటాయి. సెక్షన్‌ఏలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ లాస్, జనరల్ లాస్, లేబర్ లాస్ మొదలైన అంశాల నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్ బీలో కంప్యూటర్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు; సెక్షన్ సీలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, అనలిటికల్, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న కరెంట్ అఫైర్స్, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్య సమాచారం:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 2019 అక్టోబర్ 22
ఫీజుల చెల్లింపునకు చివరి తేది: 2019 నవంబర్ 10
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 2019 నవంబర్ 10
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడింగ్: 2019 డిసెంబర్ 5
పరీక్ష తేది: 2019 డిసెంబర్ 15
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tssouthernpower.cgg.gov.in
Published date : 26 Oct 2019 03:15PM