Telangana Police Jobs 2022: పక్కా వ్యూహంతోనే పోలీస్ కొలువు!
చాలా కాలం నుంచి పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. భారీ సంఖ్యలో కొలువుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. దీంతో అభ్యర్థులు.. నియామక పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి? కోచింగ్ తీసుకోవాలా? మొదలైన పలు సందేహాలతో గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటి నుంచి సమయాన్ని ఒక ప్రణాళికతో సరిగ్గా వినియోగించుకుంటే.. ఉద్యోగ సాధనలో విజయం తప్పక వరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీసు ఉద్యోగాల తీరుతెన్నులు, సిలబస్, పరీక్ష విధానం,అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు...
Also read: After Inter: ఇంటర్మీడియెట్ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..
పోలీస్ నియామకాల ఎంపిక విధానంలో గతంలో ప్రిలిమినరీ పరీక్షగా 5 కి.మీ. పరుగు పోటీ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత శారీరక దారుఢ్యంతోపాటు మానసిక సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి సారించారు. 5 కి.మీ. పరుగు స్థానంలో ప్రిలిమినరీ పరీక్షగా రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే 5 కి.మీ.పరుగు తొలగించిన తర్వాత పోలీసు ఉద్యోగాలకు పోటీ పెరిగింది. గ్రూప్స్, డీఎస్సీ, బ్యాంక్స్, రైల్వే అభ్యర్థులు కూడా వీటికి పోటీ పడుతున్నారు. ఎంతైనా గ్రూప్స్, డీఎస్సీ కంటే పోలీసు ఉద్యోగాలు పోటీ తక్కువగానే ఉంటుంది.
Also check: ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs
పరీక్ష విధానం ఇలా
సబ్ ఇన్‌స్పెక్టర్స్, పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టులకు వేర్వేరుగా అర్హత పరీక్షగా ప్రిలిమినరీ పరీక్షను నిర్వíß స్తారు. దీనిలో 180 నిమిషాల్లో 200 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 200 మార్కులుంటాయి. నెగెటివ్ మార్కులు ఉండవు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అంటే ఎత్తు, ఛాతి, బరువులకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణించరు. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు.. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కింద పురుషులకు 100 మీ. పరుగు, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, షార్ట్‌పుట్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. మహిళలకు 100 మీటర్ల పరుగు, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
Also read: పోలీస్ కానిస్టేబుల్ మోడల్ పేపర్ సొల్యూషన్స్ | How to Prepare for Police Exams
మెయిన్ మార్కులు కీలకం
సబ్ ఇన్‌స్పెక్టర్స్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో 4 పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లలో ఇంగ్లిష్, తెలుగు భాషాంశాలపై 100 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. 3, 4వ పేపర్లుగా అర్థమెటిక్–రీజనింగ్, జనరల్ స్టడీస్ అంశాలపై 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉండవు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో అర్థమెటిక్–రీజనింగ్, జనరల్ స్టడీస్‌లలోని మొత్తం 400 మార్కుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కానిస్టేబుల్స్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లిష్ సబ్జెక్టులు నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపరులో అర్హత సాధించిన అభ్యర్థుల మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కాన్సెప్ట్‌తో కూడిన షార్ట్‌కట్స్
గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రశ్నల సరళి కొంచెం కఠినంగానే ఉంది. జనరల్ స్టడీస్‌లో గ్రూప్–2, గ్రూప్–1 స్థాయిలో, అర్థమెటిక్–రీజనింగ్‌లో బ్యాంక్ పరీక్షల స్థాయిలో ప్రశ్నలు అడుగుతున్నారు. ‘జతపరచండి’ తరహాలో ప్రశ్నలు ఇస్తున్నారు. డైరెక్ట్ ప్రశ్నలు కాకుండా.. అనువర్తన ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యతనిస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు కాన్సెప్ట్స్‌తోపాటు షార్ట్‌కట్స్ కూడా నేర్చుకోవాలి. అలా అని కేవలం షార్ట్‌కట్స్‌పైనే ఆధారపడకూడదు. ప్రశ్నలకు ఎలా అడిగినా అభ్యర్థులు సమాధానాలు రాయగలగాలి. కాబట్టి కాన్సెప్ట్‌తో కూడిన షార్ట్‌కట్స్ నేర్చుకోవాలి. ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకుని చేసే అలవాటు చేసుకోవాలి.
Also read: MBA Placements: విద్యార్థులకు ఆఫర్ల జోరు.. కోవిడ్ పూర్వ స్థితికి రిక్రూట్‌మెంట్స్..
సిలబస్ అంశాలు..
- అర్థమెటిక్ విభాగం నుంచి సరాసరి, గ.సా.భా., క.సా.గు., సంఖ్యలు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు–ఘనమూలాలు, సూక్ష్మీకరణలు, నిష్పత్తి–అనుపాతం, భాగస్వామ్యం, వయసులు, శాతాలు,లాభ–నష్టాలు–తగ్గింపులు, సరళ వడ్డీ, చక్రవడ్డీ, మిశ్రమాలు, కాలం–పని, పంపులు–ట్యాంకులు,పనులు–వేతనాలు,కాలం–దూరం, రైళ్లు, పడవలు–ప్రవాహాలు, ఆటలు–పందేలు అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
- ప్యూర్ మ్యాథ్స్ విభాగం నుంచి వైశాల్యాలు, ఘనపరిమాణాలు, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత, త్రికోణమితి, మాత్రికలు మొదలైన అంశాలు ముఖ్యమైనవి. వీటితోపాటు పదోతరగతిలోపు ప్యూర్ మ్యాథ్స్‌ను కూడా చదవాలి.
- వెర్బల్ రీజనింగ్‌లో కేలండర్‌లు, గడియారాలు, టైమ్ సీక్వెన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, డైరెక్షన్ టెస్ట్, నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఆల్ఫాబెటికల్ టెస్ట్, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్ టెస్ట్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, అర్థమెటికల్ రీజనింగ్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం తదితర అంశాలు ముఖ్యమైనవి.
- లాజికల్ రీజనింగ్‌లో.. లాజికల్ వెన్‌డయాగ్రమ్స్, స్టేట్‌మెంట్స్ అండ్ ఆర్గుమెంట్స్, స్టేట్‌మెంట్స్ అండ్ అసంప్షన్స్, అసర్షన్ అండ్ రీజన్, సిల్లోజియం, డేటా సఫిషియెన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంశాలు ప్రధానం.
- నాన్‌వెర్బల్ రీజనింగ్‌లో.. క్యూబ్స్ అండ్ డైస్, సిరీస్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, కౌంటింగ్ ఫిగర్స్ మొదలైనవి ముఖ్యమైనవి.
Also Check: తెలంగాణ పొలీస్ ఉద్యోగాలు... డే 1 నుండి జాబ్ కొట్టే వరకు
ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవాలి
పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు.. వారి బలం, బలహీనతలను గుర్తించి వాటిని ముందుగా అధిగమించాలి. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న పోస్టుకు సంబంధించిన సిలబస్‌ను పూర్తిగా విశ్లేషించుకోవాలి. పరీక్షలో ప్రశ్నల స్థాయి తెలుసుకునేందుకు గత పరీక్షల ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. కొన్ని సబ్జెక్టులకు వెయిటేజీ ఎక్కువగానూ,కొన్నింటికి వెయిటేజీ తక్కువగానూ ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్ పేపర్‌లో కూడా ‘జతపరచండి’ తరహా ప్రశ్నలు ఇస్తున్నారు. వాటిని సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే..గుణింతాలు,వర్గాలు, ఘనాలు క్రమం తప్పకుండా సాధన చేయాలి. అప్పుడే కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలుగుతారు.నిర్ణీత సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలుగుతారు.
పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు చదివిన అంశాలను ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవాలి. రోజుకు ఒకసారి, వారంలో, నెలలో మరోసారి సమయం కేటాయించుకోవాలి. అలాగే పరీక్షకు ముందు నేర్చుకున్న అంశాలను తప్పనిసరిగా రివిజన్ చేసుకోవాలి. సిలబస్‌లోని అన్ని అంశాలను చదివిన తర్వాత గ్రాండ్‌టెస్ట్‌లు రాయాలి. వాటి ఫలితాల ఆధారంగా స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. తప్పులను సరిదిద్దుకోవాలి. అభ్యర్థులు పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రాక్టీస్ ప్రధానం. సాధన చేస్తే విజయం తప్పక వరిస్తుంది. కాబట్టి విశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధమవ్వాలి.
– ఉపేంద్ర, డైరెక్టర్, క్యాంపస్ స్టడీ సర్కిల్.