Skip to main content

Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..

చదివింది బీఫార్మసీ. కానీ తన లక్ష్యం మాత్రం ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించ‌డ‌మే.
రామలక్ష్మి సక్సెస్ స్పీక్స్
రామలక్ష్మి, గ్రూప్-2 రాష్ట్ర స్థాయి మహిళా టాపర్‌

ఈ ఉద్యోగంతో సమాజానికి మేలు చేయడం.. అందుకే బీఫార్మసీ పూర్తవుతూనే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సివిల్స్ ప్రిపరేషన్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ గ్రూప్-2 ఫలితాల్లో 337.10 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మహిళా టాపర్‌గా నిలిచారు..ఎల్.రామలక్ష్మి. పోటీ పరీక్షల్లో అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ కష్టమైన అంశాలు, ఇష్టమైన అంశాలు ఉంటాయని.. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించడంలోనే విజయ రహస్యం దాగి ఉందంటున్న రామలక్ష్మి సక్సెస్ స్పీక్స్ ఆమె మాటల్లోనే..

కుటుంబ నేప‌థ్యం : 
మా స్వస్థలం విశాఖపట్నం జిల్లా, చీడికాడ మండలంలోని తురువోలు గ్రామం. అమ్మ సత్యవాణి, నాన్న జగ్గినాయుడు. పూర్తిగా వ్యవసాయ కుటుంబం. మాకున్న కొద్దిపాటి పొలమే కుటుంబానికి ఆధారం. అయినా అమ్మానాన్న.. అమ్మాయికి చదువెందుకని ఆలోచించలేదు. ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు.

Inspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా

నా చ‌దువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే..
నా చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. అయిదో తరగతి వరకు స్వగ్రామంలో, ఆరు నుంచి పదో తరగతి వరకు భీమునిపట్నంలో చదివాను. పదోతరగతిలో మంచి మార్కులు (535) వచ్చాయి. ఆ తర్వాత తాటిపూడిలోని ఏపీఆర్‌జేసీలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశాను. ఎంసెట్‌లో 9000వ ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుతో భీమవరంలోని ఓ ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో చేరాను. 2013లో బీఫార్మసీ పూర్తయింది.

ప్రిపరేషన్ పరంగా ఎలాంటి అవగాహనా లేదు.. కానీ
వాస్తవానికి బీఫార్మసీతో ఉద్యోగాలు లభిస్తాయి. కానీ, అధిక శాతం ప్రైవేటు రంగంలోనే ఉంటాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. అది కూడా ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం అయితే సమాజానికి కూడా మేలు చేయొచ్చని భావించాను. అప్పుడే అత్యున్నత సివిల్ సర్వీసెస్ గురించి తెలిసింది. సివిల్స్‌ను లక్ష్యంగా నిర్దేశించుకునే సమయానికి ఈ పరీక్షలో విజయం సాధిస్తే.. లభించే హోదాల గురించే తెలుసు. కానీ.. ప్రిపరేషన్ పరంగా ఎలాంటి అవగాహనా లేదు. దీంతో 2014లో హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్‌లో చేరాను.

ఎన్నో అవమానాలు.. అవహేళనలు ఎదుర్కొన్ని తహశీల్దార్ అయ్యానిలా..

నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2పై దృష్టి పెట్టానిలా..
వాస్తవానికి గ్రూప్-2లో ఈ స్థాయిలో నిలుస్తానని ఊహించలేదు. సివిల్స్‌కు ప్రిపరేషన్ సాగిస్తున్న తరుణంలో గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడింది. ఆ నోటిఫికేషన్ చూశాకే.. ఒక అటెంప్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచనకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్నాను. నా విషయంలో గ్రూప్-2 ప్రిపరేషన్ క్రమంలో సివిల్స్ శిక్షణ ఎంతో ఉపకరించింది. గ్రూప్-2లోని అధిక శాతం సిలబస్, సివిల్స్ సిలబస్‌లోని అంశాల సమ్మిళితంగా ఉండటంతో ప్రిపరేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. అప్పటికే ఆయా సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌ను డిస్క్రిప్టివ్ విధానంలో పూర్తిచేయడం.. ఫలితంగా గ్రూప్-2 ఆబ్జెక్టివ్ అయినప్పటికీ పరీక్షహాల్లో సులువుగా సమాధానాలు గుర్తించగలిగాను.

వీటిని తప్పనిసరిగా అనుసరించాను..
గ్రూప్-2 ప్రిపరేషన్ పరంగా ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ అంశాలకు మాత్రం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి వచ్చింది. అదేమంత కష్టం అనిపించలేదు. వాటికి సంబంధించి అకాడమీ పుస్తకాలను అనుసరించాను. ప్రిపరేషన్ పరంగా నాకు ప్రధానంగా కలిసొచ్చిన వ్యూహం.. సమన్వయం చేసుకోవడం! హిస్టరీ, పాలిటీ, ఎకానమీ.. ఇలా అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన సమకాలీన అంశాలను కోర్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదివాను. రోజూ కరెంట్ అఫైర్స్‌ను తప్పనిసరిగా అనుసరించాను.

Inspirational Story: పేదరికాన్ని జ‌యించాడు... సివిల్స్ స‌త్తా చాటాడు..

పరీక్ష హాల్లో చూపే ప్రతిభే విజయానికి..
గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల విషయంలో అభ్యర్థుల్లో నెలకొన్న ప్రధాన అభిప్రాయం.. కొన్ని సబ్జెక్ట్‌లు కొందరికి అనుకూలం.. మరికొందరికి ప్రతికూలం అనేది. కానీ.. పరీక్ష హాల్లో ప్రశ్నపత్రాల తీరు చూస్తే ఇలాంటివన్నీ అపోహలే అని అర్థమవుతుంది. ఎలాంటి నేపథ్యమున్న వారికైనా.. విజయంలో ప్రధాన సాధనం విశ్లేషణాత్మక దృక్పథం. ఒక విషయాన్ని పలు కోణాల్లో ఆలోచించి ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించడం ముఖ్యం. సబ్జెక్ట్‌ను ఆకళింపు చేసుకునే విషయంలో ప్రిపరేషన్ పరంగా అన్ని సబ్జెక్ట్‌లపై పట్ట సాధించడం ద్వారా పరీక్ష హాల్లో చూపే ప్రతిభే విజయానికి కొలమానం!!

Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..

నా లక్ష్యం ఇదే..
నా భవిష్యత్తు లక్ష్యం సివిల్స్‌లో విజయం సాధించడమే. గతేడాదంతా గ్రూప్స్ ప్రిపరేషన్‌కే సరిపోయింది. దీంతో అటెంప్ట్ ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా పరీక్షకు హాజరుకాను. ఎలాగైన సివిల్స్‌లో విజయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను.

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

Published date : 16 Mar 2022 06:25PM

Photo Stories