Skip to main content

Chaitra Varshini, RDO : ఈ మూడు వ్యూహాలు పాటిస్తే గ్రూప్స్‌లో విజయం ఖాయమే..!

‘పోటీ పరీక్ష ఏదైనా.. అభ్యర్థులు పీఈసీ (ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కన్సిస్టెన్సీ) దృక్పథం అలవర్చుకోవాలి. ఇది విజయం ముంగిట నిలిపే అవకాశాలను పెంచుతుంది.
Anarajula Chaitra Varshini, RDO
Anarajula Chaitra Varshini, RDO

కోచింగ్‌ తీసుకున్నా.. తీసుకోకున్నా.. ఈ అప్రోచ్‌ ఎంతో ముఖ్యం.’  అంటున్నారు.. ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1 (2016) తుది జాబితాలో 492.5 మార్కులతో (మెయిన్స్‌ + ఇంటర్వ్యూ) ఏడో స్థానంలో నిలిచి.. మహిళల విభాగంలో టాపర్‌గా నిలిచిన తిరుపతికి చెందిన ఎ. చైత్ర వర్షిణి. బీటెక్‌ పూర్తవుతూనే ప్రభుత్వ కొలువు దిశగా అడుగులు వేసి.. అనుకున్న లక్ష్యం సాధించిన చైత్ర సక్సెస్‌ స్టోరీ ఆమె మాటల్లోనే..

మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
ముందుగా నా విజయానికి ప్రధాన స్ఫూర్తి మా తల్లి దండ్రులే. నాన్న ఎ. రవి కుమార్‌ తిరుపతిలో పశు సంవర్థక శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అమ్మ వీణ.. శ్రీ వేంకటేశ్వర వెటరినరీ యూనివర్సిటీలో సర్జరీ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ విద్యావంతులు కావడంతో చిన్నప్పటి నుంచి అకడమిక్‌గా బెస్ట్‌ స్టూడెంట్‌ అనే పేరు ఉండేది. 

నా చదువు : 
నా విద్యాభ్యాసం పదో తరగతి వరకు తిరుపతిలోనే. 2009లో పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్మీడియెట్‌ను హైదరాబాద్‌లోని చుక్కా రామయ్య కళాశాలలో పూర్తి చేశాను. అంతటా మంచి మార్కులే వచ్చాయి. పదో తరగతిలో 562, ఇంటర్మీడియెట్‌లో 972 మార్కులు లభించాయి. 

ఎంసెట్‌లో ర్యాంకు.. ఎస్వీ క్యాంపస్‌లో సీటు.. కానీ..:

RDO Story


ఎంసెట్‌–2011లో 1200వ ర్యాంకుతో తిరుపతిలోనే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీటు లభించింది. అయితే.. అమ్మా, నాన్న ఇద్దరూ.. నాలో కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ వంటివి పెరుగుతాయనే ఉద్దేశంతో వీఐటీ–వెల్లూరులో బీటెక్‌ (ఈసీఈ)లో చేరి 8.2 జీపీఏతో 2015లో పూర్తి చేశాను. వీఐటీలోనూ స్కాలర్‌షిప్‌తో సీటు లభించింది.

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

కార్పొరేట్‌ ఉద్యోగం కాదని.. ప్రభుత్వ కొలువుల వైపు..:
సాధారణంగా బీటెక్‌ పూర్తి కాకుండానే కార్పొరేట్‌ కొలువు లభించడం చాలా మందికి సంతోషంగా ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న ఇద్దరూ ప్రభుత్వ కొలువుల వల్ల సొసైటీకి సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆ దిశగా యత్నించమని ప్రోత్సహించారు. దీంతో.. బీటెక్‌ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడే ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సిస్కోలో ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ లభించింది. ఇంటర్న్‌షిప్‌ కోణంలో ఆ ఆఫర్‌ను అంగీకరించాను. ఆ తర్వాత ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా మరో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ హనీవెల్‌లో ఆరు నెలలు ప్రాజెక్ట్‌ వర్క్‌ చేశాను. ఆ సమయంలో నా పనితీరుకు మెచ్చి శాశ్వత ఉద్యోగం ఆఫర్‌ చేశారు. కానీ.. గవర్నమెంట్‌ సర్వీస్‌ లక్ష్యం అప్పటికే బలంగా నాటుకుపోవడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. 

నా లక్ష్యనికి అడుగులు అడుగులు ఇలా..:
ప్రభుత్వ కొలువును లక్ష్యంగా అందులోనూ సివిల్స్, గ్రూప్స్‌ ఈ రెండు సర్వీసులనే లక్ష్యంగా పెట్టుకున్న నేను.. ఆ దిశగా 2015 జూన్‌లో అడుగులు ప్రారంభించాను. 2015 ఏడాది పాటు హైదరాబాద్‌లో ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ (ఆంత్రోపాలజీ) కోసం కోచింగ్‌ తీసుకున్నాను. జీఎస్‌కు మాత్రం స్వయంగా ప్రిపరేషన్‌ సాగించాను. 2016 సివిల్స్‌ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని.. తొలి అటెంప్ట్‌లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 2017 జూన్‌లో ఫలితాలు విడుదలయ్యాయి. కానీ.. ఆరు మార్కుల తేడాతో ఫలితం చేజారింది.

పోటీప‌రీక్ష‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే డైలీ,వీక్లీ,మంత్లీ క‌రెంట్అఫైర్స్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

ఆ సమయంలో ఎంతో ఆవేదనతో..
సివిల్స్‌ ఫలితం ఆరు మార్కుల తేడాతో చేజారడంతో ఎంతో ఆవేదనకు గురయ్యాను. అయితే.. అదే సమయంలో ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ఫలితాల్లో విజయం లభించింది. ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. దీంతో మెయిన్‌ పరీక్ష ప్రిపరేషన్‌ దిశగా సన్నద్ధమయ్యాను.

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల స్ట‌డీమెటీరిల్‌ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
 

కేంద్ర కొలువు కాదని..
ఇక్కడ ఇంకో ముఖ్య విషయం.. గవర్నమెంట్‌ సర్వీస్‌ను లక్ష్యంగా చేసుకున్న క్రమంలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీజీఎల్‌–2015 నోటిఫికేషన్‌లో తుది జాబితాలో నిలిచాను. 2017లో సెంట్రల్‌ ట్యాక్సెస్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం లభించింది. హైదరాబాద్‌లోని జీఎస్‌టీ భవన్‌లో జీఎస్‌టీ ఆఫీసర్‌గా రెండు నెలలు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత ఉద్యోగానికి సెలవు పెట్టి గ్రూప్స్‌ ప్రిపరేషన్‌వైపు దృష్టి సారించాను. 

45 రోజులలోనే..
గ్రూప్‌–1 స్క్రీనింగ్‌ ఫలితాల తర్వాత నేను పూర్తి స్థాయిలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ కోసం కేటాయించిన సమయం 45 రోజులే. 2017 జూన్‌లో సివిల్స్‌ ఫలితాల నిరాశ నుంచి తేరుకోవడానికి కొంత సమయం పట్టడమే ఇందుకు కారణం. ఒకవైపు అప్పటికే లభించిన సెంట్రల్‌ ట్యాక్సెస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి సెలవు పెట్టడంతో కొంత నిరాశకు లోనయ్యాను.

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

విభిన్న వ్యూహంతో :
గ్రూప్‌–1 మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు అందుబాటులో ఉన్న 45 రోజుల సమయంలో ప్రిపరేషన్‌ పరంగా విభిన్న వ్యూహాన్ని అనుసరించాను. ప్రతి వారం ఒక సబ్జెక్ట్‌ చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాను. ఈ విషయంలో అప్పటికే పూర్తి చేసిన సివిల్స్‌ ప్రిపరేషన్‌ అనుభవం ఎంతో కలిసొచ్చింది. ఇలా ప్రతి సబ్జెక్ట్‌ను మూడు సార్లు రివిజన్‌ చేసుకునేలా అందుబాటులో ఉన్న 45 రోజుల సమయాన్ని వినియోగించుకున్నాను. ఈ క్రమంలో నాకు మెమొరీ పరంగా ఆయా అంశాలు గుర్తుంచుకునేందుకు పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రమ్స్, ముఖ్యమైన గణాంకాలు నోట్‌ చేసుకోవడం వంటి టిప్స్‌ పాటించాను. అంతేకాకుండా రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం కూడా కలిసొచ్చింది. ఫలితంగా మెయిన్‌ మెరిట్‌ లిస్ట్‌లో నిలిచి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాను. 

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
 

స్వీయ ప్రిపరేషన్‌ ఇంటర్నెట్‌ సాధనంగా..:
స్వీయ ప్రిపరేషన్‌ క్రమంలో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండే సమాచారాన్నే ఆధారంగా చేసుకుని ముందుకు సాగాను. ఈ క్రమంలో ముఖ్యమైన అంశాలు, సందేహం కలిగిన అంశాల నివృత్తికి అవసరమైన పుస్తకాలు రిఫర్‌ చేశాను. మొత్తం మీద మెయిన్‌లో విజయం లభించింది.

Virendra, Excise SI: కూలీ ప‌నిచేస్తూ..ఎక్సైజ్‌ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా..

నా ఇంటర్వ్యూ సాగిందిలా..:
కమిషన్‌ చైర్మన్‌ సహా నలుగురు సభ్యుల బోర్డ్‌ ఇంటర్వ్యూ నిర్వహించింది. నా అకడమిక్‌ నేపథ్యం గురించి, అప్పటికే నేను కొన్ని రోజులు జీఎస్‌టీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించడంతో జీఎస్‌టీ గురించి.. అదే విధంగా ఆ హోదాలో కొనసాగితే రిటైర్‌ అయ్యే నాటికి ఏ స్థాయికి చేరుకుంటావు? సెంట్రల్‌ సర్వీస్‌ నుంచి స్టేట్‌ సర్వీస్‌ వైపు ఎందుకు రావాలనుకుంటున్నావు? వంటి ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ సంతృప్తికరంగా సమాధానాలిచ్చాను.

నా విజయంలో..

Success Mantra


సివిల్స్‌కు కోచింగ్‌ తీసుకున్నప్పటికీ అది ఆప్షనల్‌ వరకే. దీంతో జీఎస్‌ విషయంలో స్వీయ ప్రిపరేషన్‌తో సాగాను. ఈ క్రమంలో ప్రతి వారం మోడల్‌ టెస్ట్‌లు, ఆన్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌లకు హాజరై వాటి ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా నా ప్రిపరేషన్‌ స్థాయిని మెరుగుపరుచుకునేలా వ్యవహరించాను. ఇక మెయిన్‌ ఫలితాలు వచ్చాక మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. ఇది కూడా నా విజయంలో ఎంతో కలిసొచ్చింది. 

Success Story: ఓకే సారి గ్రూప్‌-2కు తండ్రీ కొడుకులు సెలక్ట్‌.. వీరి స‌క్సెస్ సిక్రెట్ చూస్తే..

ప్రతి రోజు ఒక సమయంలో..
భవిష్యత్తు ఔత్సాహికులకు ఇచ్చే సలహా.. ముందుగా సిలబస్‌ను విశ్లేషించుకోండి. దీనికి అనుగుణంగా ప్రతి రోజు ప్రిపరేషన్‌కు కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా సమయం కేటాయించుకోవాలి. కోచింగ్‌ తీసుకున్నా.. తీసుకోకపోయినా.. స్వీయ దృక్పథం అవసరం. ఈమె ప్రస్తుతం ఆర్డీవోగా పనిచేస్తున్నారు.

Inspiring Story: బాల కార్మికురాలు.. నేడు ప్ర‌భుత్వ ఉద్యోగి.. అది నుంచే కన్నీటి కష్టాలే..

DSP Snehitha : గ్రూప్‌–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా

Y.Obulesh, Group 1 Ranker : ప్ర‌భుత్వ స్కూల్‌లో చ‌దివా...ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

గ్రూప్‌–1 లో విజ‌యం సాధించానిలా..: హరిత, ఆర్డీఓ

Group 1 Ranker: ఆన్‌లైన్‌ కోచింగ్‌..గ్రూప్‌–1 ఉద్యోగం

Published date : 05 Mar 2022 03:24PM

Photo Stories