Success Story: సొంతంగానే గ్రూప్-1కి ప్రిపేరయ్యా.. టాప్ ర్యాంక్ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..
గ్రూప్-1 (2011) నోటిఫికేషన్ రీ-ఎగ్జామినేషన్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 294 మందికి ఏపీపీఎస్‌సీ ఇంటర్వ్యూలు నిర్వహించిన...అభ్యర్థుల మార్కుల తుది జాబితాను వెల్లడించింది. 783 మార్కులకుగాను 489.5 మార్కులు సాధించిన తొలి స్థానంలో నిలిచిన వెంకట రమణ సక్సెస్ స్పీక్స్...
కుటుంబ నేపథ్యం :
మా స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. వ్యవసాయ కుటుంబం. నాన్న శ్రీరాములు, అమ్మ లక్ష్మీ నరసమ్మ. ఉన్న కొద్దిపాటి పొలం సాగు చేస్తూ .. వచ్చే ఆదాయంతోనే నన్ను, ఇద్దరు అన్నయ్యలను, తమ్ముడిని చదివించారు.
నా చదువు :
నా విద్యాభ్యాస మంతా మా స్వస్థలం మార్కాపురంలో ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తయింది. 2000లో ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక.. బీటెక్ చదవాలనే కోరికతో ఒక సంవత్సరం పాటు సొంతంగానే ఎంసెట్‌కు ప్రిపేరై 2001లో వేయి ర్యాంకు సాధించా. బీటెక్ ఈసీఈ పూర్తవగానే క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థలో 2005లో సర్క్యూట్ డిజైన్ ఇంజనీర్‌గా ఉద్యోగం లభించింది.
Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..
నా జీవితంలో మలుపుతిప్పిన ఉద్యోగం ఇదే..
ప్రభుత్వ సర్వీసులవైపు దృష్టి పెట్టడానికి నా ఉద్యోగ జీవితమే కారణమని చెప్పొచ్చు. నేను జాబ్ చేసేటప్పుడు ఖాళీ సమయాల్లో సహచర ఉద్యోగులతో కలసి సమీప ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లి, అక్కడి విద్యార్థులకు క్లాసులు చెప్పేవాళ్లం. ఆ సందర్భంగా సమాజానికి ఎంతో అవసరమైన ప్రాథమిక విద్యలో లోటుపాట్లు ప్రత్యక్షంగా చూశాను. దీంతో ప్రభుత్వ సర్వీసుల ద్వారా మరింత సేవ చేయొచ్చనే భావనతో గమ్యాన్ని మార్చుకున్నాను.
ఉద్యోగానికి రాజీనామ చేసి..
2009లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. సివిల్స్, గ్రూప్స్ ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. సివిల్స్ లక్ష్యంగా 2011లో తొలి అటెంప్ట్ ఇచ్చాను. అందుకోసం శిక్షణ కూడా తీసుకున్నాను. అప్పుడు ప్రిలిమ్స్‌లో నెగ్గి మెయిన్స్ రాసినా.. ఫలితం రాలేదు. ఆ తర్వాత సంవత్సరం నుంచే సివిల్స్ పరీక్ష విధానంలో మార్పు వచ్చింది. దాంతో అప్పుడే వెలువడిన 2011 గ్రూప్-1పై దృష్టిపెట్టా. ఒకవైపు ఉద్యోగానికి రాజీనామా.. మరోవైపు సొంత ప్రిపరేషన్ మొదలుపెట్టా. వ్యక్తిగత ఖర్చుల కోసం కుటుంబంపై ఆధారపడటం ఇష్టం లేక.. గ్రూప్-2, బ్యాంక్ పీఓ వంటి పరీక్షలకు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్‌కు ఫ్యాకల్టీగా పనిచేశా.
ఎన్నో అవమానాలు.. అవహేళనలు ఎదుర్కొన్ని తహశీల్దార్ అయ్యానిలా..
దురదృష్టవశాత్తు..
గ్రూప్-1కు తొలిసారిగా 2011లో హాజరయ్యాను. అప్పుడే ఇంటర్వ్యూ దశకు చేరుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు అది రద్దవడం తెలిసిందే. మళ్లీ గతేడాది రీ-ఎగ్జామినేషన్ నిర్వహించి.. తాజాగా ఫలితాలు విడుదల చేయడం.. అందులో మార్కుల పరంగా టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. దాదాపు అయిదేళ్లపాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రిపరేషన్‌లో ఏ సందర్భంలోనూ విసుగు చెందలేదు. నిరాశకు గురవలేదు. ఈ సమయంలో పట్టుదలతో నా నైపుణ్యాలను మరింత పెంచుకునేందుకు కృషి చేశాను.
నా ఇంటర్వ్యూ జరిగింలా..:
నా ఇంటర్వ్యూ దాదాపు అరగంట సేపు జరిగింది. ఏపీపీఎస్‌సీ చైర్మన్ సహా నలుగురు సభ్యుల బోర్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో నా వ్యక్తిగత నేపథ్యం, బీటెక్ చదివి ప్రభుత్వ సర్వీసువైపు రావడానికి కారణం, ప్రభుత్వ శాఖల్లో అవినీతి, మావోయిస్ట్ సమస్య, తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలు, సామాజిక మార్పు అంటే ఏంటి? మా ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తవకపోవడానికి కారణం? ఇలా దాదాపు అన్ని అంశాలపై ప్రశ్నలు సంధించారు. అన్నిటికీ సంతృప్తికరంగా సమాధానాలిచ్చాను. ఇంటర్వ్యూ పూర్తయ్యాక విజేతల జాబితాలో నిలుస్తాననే నమ్మకం కలిగింది. గ్రూప్-1 జాబితాలో వచ్చిన మార్కుల ప్రకారం.. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చే అవకాశముందని అనుకున్నా.. అలాగే.. వచ్చింది. నా పరిధిలో.. వ్యవసాయభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను.
సహనంతో ప్రిపరేషన్ సాగిస్తే.. విజయం మీదే..
గ్రూప్-1, సివిల్స్ వంటి పోటీ పరీక్షల అభ్యర్థులు ముందుగా వ్యక్తిగతంగా సహనం అలవర్చుకోవాలి. ఇది సుదీర్ఘంగా సాగే ఎంపిక ప్రక్రియ. ఏ సమయంలోనూ విసుగు చెందకుండా మానసికంగా స్థిరంగా ఉండాలి. ప్రిపరేషన్ పరంగా శిక్షణ తీసుకోవడం అనేది ఆయా అభ్యర్థుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. బేసిక్స్‌పై పట్టు సాధించి విశ్లేషణాత్మక దృక్పథంతో చదివాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫలితం గురించి ఆలోచించకుండా.. స్వయంకృషిని నమ్ముకొని ముందుకుసాగితే కొంత ఆలస్యమైనా విజయం వరిస్తుంది.
Inspirational Story: కూలీ పనులు చేస్తూ చదివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..