Fundamental Rights of India: గతంలో అడిగిన ప్రశ్నలు ఇవే...
గతంలో అడిగిన ప్రశ్నలు
1. ప్రాథమిక హక్కులు?
ఎ) నిరపేక్షమైనవి
బి) ప్రభుత్వ అధికారాలపై పరిమితులు
సి) సవరణకు అతీతం
డి) న్యాయ సమీక్షకు గురికావు
- View Answer
- సమాధానం: బి
2. ప్రాథమిక హక్కులకు మరోపేరు?
ఎ) న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు
బి) న్యాయ సంరక్షణ లేని హక్కులు
సి) నైతిక హక్కులు
డి) పౌర హక్కులు
- View Answer
- సమాధానం: ఎ
3. కింద పేర్కొన్న ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు?
ఎ) గోలక్‌నాథ్
బి) కేశవానంద భారతి
సి) మేనకా గాంధీ
డి) మినర్వా మిల్స్
- View Answer
- సమాధానం: బి
4. సుప్రీంకోర్టు ఏ కేసులో సహజీవన హక్కును ప్రస్తావించింది?
ఎ) ఖుష్బూ
బి) అరుణా రాయ్
సి) అరుంధతీరాయ్
డి) విశాఖ
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?
5. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందా? కాదా? అని విచారించడానికి ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం?
ఎ) హెబియస్ కార్పస్
బి) సెర్షియోరరి
సి) మాండమస్
డి) కోవారెంటో
- View Answer
- సమాధానం: ఎ
6. ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?
ఎ) సుప్రీంకోర్టు
బి) రాష్ట్రపతి
సి) ప్రధాన మంత్రి
డి) పార్లమెంటు
- View Answer
- సమాధానం: బి
7. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయవచ్చు?
ఎ) ఆర్టికల్-13
బి) ఆర్టికల్-32
సి) ఆర్టికల్-14
డి) ఆర్టికల్-34
- View Answer
- సమాధానం: బి
8. ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ,హృదయం అని అంబేడ్కర్ వర్ణించారు?
ఎ) సమానత్వ హక్కు
బి) స్వాతంత్య్ర హక్కు
సి) పీడనాన్ని నిరోధించే హక్కు
డి) రాజ్యాంగ పరిహార హక్కు
- View Answer
- సమాధానం: డి
9. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్?
ఎ) హెబియస్ కార్పస్
బి) మాండమస్
సి) సెర్షియోరరి
డి) కోవారెంటో
- View Answer
- సమాధానం: బి
10. ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక, విద్యా హక్కుల ఉద్దేశం?
ఎ) నిరక్షరాస్యతను రూపుమాపడం
బి) ఒకే సంస్కృతిని రూపొందించడం
సి) అల్పసంఖ్యాక వర్గీయుల సంస్కృతిని సంరక్షించడానికి సహాయపడటం
డి) భారతదేశ సంస్కృతిని సంరక్షించడానికి ఇది సహాయపడదు.
- View Answer
- సమాధానం: సి
11. ఆర్థిక సమాన త్వాన్ని కల్పించేవి?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) అవతారిక
సి) ఆదేశిక సూత్రాలు
డి) ప్రాథమిక విధులు
- View Answer
- సమాధానం: సి
12. వార్తా ప్రచురణ హక్కును కల్పించే ఆర్టికల్?
ఎ) 14
బి) 21
సి) 32
డి) 19
- View Answer
- సమాధానం: డి
13. చట్టాల సమాన రక్షణను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) బ్రిటన్
బి) అమెరికా
సి) ఐర్లాండ్
డి) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: బి
14. ఏ ప్రకరణ ప్రకారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేశారు?
ఎ) ప్రకరణ 21 జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు
బి) ప్రకరణ 48 ఆదేశిక నియమం
సి) ప్రకరణ 275 షెడ్యూల్డ్ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Indian Polity Bit Bank for Competitive Exams: రాష్ట్ర శాసనాలు రద్దుచేసే అధికారం ఎవరికి ఉంది?
15. విద్యాహక్కు చట్టం ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది?
ఎ) అన్ని స్థాయిల విద్యార్థులకు
బి) కళాశాల విద్యార్థులకు
సి) సీనియర్ సెకండరీ స్థాయి విద్యార్థులకు
డి) 14 ఏళ్ల లోపు వయసున్న విద్యార్థులకు
- View Answer
- సమాధానం: డి
16. చట్టం వల్ల సమాన రక్షణ అంటే?
ఎ) ప్రత్యేక రక్షణ
బి) సమాన అవకాశాలు
సి) అసమానతను తగ్గించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
17. ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు?
ఎ) ప్రభుత్వ చర్యలకు
బి) న్యాయస్థాన చర్యలకు
సి) ప్రైవేట్ వ్యక్తుల చర్యలకు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
18. నేరారోపణ ఎదుర్కొనే వ్యక్తిని బలవంతం మీద నేరం ఒప్పించడాన్ని ఏమంటారు?
ఎ) సెల్ఫ్ ఇన్క్రిమినేషన్
బి) డబల్ జపార్డీ
సి) ఎక్స్ పోస్ట్ లా
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
19. ప్రాథమిక హక్కులను అమలుపరచడంలో పార్లమెంటు కొన్ని వర్గాలపై ప్రత్యేక పరిమితులు విధించవచ్చు. ఆ వర్గాలు?
ఎ) రక్షణ దళాలు
బి) నేరస్థులు
సి) విదేశీయులు
డి) నిందితులు
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Fundamental Rights (Article 28-32): ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త ఎవరు?
20. కింద పేర్కొన్న వాటిలో వ్యక్తిగత స్వేచ్ఛలపై పరిమితులు?
ఎ) శాంతి భద్రతలు
బి) దేశ రక్షణ
సి) నైతిక ప్రవర్తన
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
21. కింది ఏ వర్గానికి ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన లేదు?
ఎ) వికలాంగులు
బి) మహిళలు
సి) ఆర్థికంగా వెనుకబడినవారు
డి) ఎ, సి
- View Answer
- సమాధానం: డి
22. కింద పేర్కొన్న వాటిలో ఏ ప్రాతిపదికన సకారాత్మక వివక్షతను రాజ్యాంగం అనుమతించలేదు?
ఎ) విద్యాపరమైన వెనుకబాటు
బి) సామాజిక వెనుకబాటు
సి) ఆర్థిక వెనుకబాటు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
23. 'న్యాయ సమీక్ష' ఏ ప్రభుత్వ లక్షణం?
ఎ) ఏక కేంద్ర
బి) సమాఖ్య
సి) పార్లమెంటరీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
చదవండి: Fundamental Rights of India: ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?
24. కింది ఏ ప్రకరణను సుప్రీంకోర్టు ఉదారంగా వ్యాఖ్యానించి, దాని పరిధిని విస్తరించింది?
ఎ) ప్రకరణ 32
బి) ప్రకరణ 13
సి) ప్రకరణ 20
డి) ప్రకరణ 21
- View Answer
- సమాధానం: డి
25. ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా రూపొందించిన చట్టాలను న్యాయస్థానాలు కొట్టివేస్తాయి. అయితే చట్టం అనే పదంలోకి రాని అంశం?
ఎ) ఆర్డినెన్సులు
బి) ఉపచట్టాలు
సి) నోటిఫికేషన్లు
డి) రాజ్యాంగ సవరణ
- View Answer
- సమాధానం: డి
26. ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపని అత్యవసర పరిస్థితి?
ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి
బి) రాజ్యాంగ అత్యవసర పరిస్థితి
సి) పై రెండూ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి