Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?
1. ప్రకరణ 3 ప్రకారం జరిగిన మార్పులను రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు. కారణం?
ఎ) రాజ్యాంగంలో అలాంటి మినహాయింపులున్నాయి.
బి) సాధారణ మెజారిటీతో చేసిన సవరణలు ప్రకరణ 368 ప్రకారం–రాజ్యాంగ సవరణ ప్రక్రియలోకి రావు.
సి) బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండటం
డి) పైవి ఏవీకాదు
- View Answer
- సమాధానం: బి
2. ‘India is Indestructible Union of Destructible States’’ అనగా?
ఎ) బలమైన కేంద్ర ప్రభుత్వం
బి) రాష్ట్రాలు యూనియన్ నుంచి విడిపోలేవు, విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్
సి) భారత యూనియన్ రాష్ట్రాల కూటమి
డి) పై అన్నియు
- View Answer
- సమాధానం: బి
3. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో ఈ కింది ఎవరి పాత్ర ఉండదు.
ఎ) పార్లమెంటు
బి) రాష్ట్రపతి
సి) రాష్ట్ర గవర్నర్
డి) రాష్ట్ర శాసనసభ
- View Answer
- సమాధానం: సి
4. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదిక కానిది?
ఎ) భౌగోళిక అంశాలు
బి) ప్రాంతీయ అసమానతలు
సి) రాజకీయ గతిశీలత
డి) పైవి ఏవీ కాదు
- View Answer
- సమాధానం: డి
5. ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?
ఎ) 1960–1970
బి) 1970–1980
సి) 1980–1990
డి) 1990–2000
- View Answer
- సమాధానం: బి
6. కేంద్రపాలిత ప్రాంతం కాకుండా ఉమ్మడి రాజధానిగా ఏర్పాటైన నగరం/నగరాలు?
ఎ) హైదరాబాద్
బి) మద్రాస్
సి) బొంబాయి
డి) ఎ, బి
- View Answer
- సమాధానం: ఎ
7. భౌగోళిక ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం/రాష్ట్రాలు
ఎ) తెలంగాణ
బి) ఉత్తరాఖండ్
సి) చత్తీస్ఘడ్
డి) పై అన్నీ
- View Answer
- సమాధానం: డి
8. స్వాతంత్రం రాక ముందు ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రం?
ఎ) ఒరిస్సా
బి) మద్రాస్ స్టేట్
సి) మైసూర్ స్టేట్
డి) పైవి ఏవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
9. భారత్లో రాష్ట్రాల ఏర్పాటు పద్ధతి సమాఖ్య విరుద్ధం అనే విమర్శ ఉంది. కారణం?
ఎ) కేంద్ర అధికారాలు ఏక పక్షం
బి) రాష్ట్రాల అభిప్రాయానికి విలువ లేక పోవడం
సి) సాధారణ మెజారిటీని ఆపాదించడం
డి) పై అన్నీ సరైనవి
- View Answer
- సమాధానం: డి
10. భారత సమాఖ్యకు ఏ లక్షణాన్ని ఆపాదించవచ్చు.
ఎ) Holding together of the states
బి) Coming together of the states
సి) Gathering together of the states
డి) None of above
- View Answer
- సమాధానం: ఎ
Groups Practice Tests