Indian Polity Bit Bank for Competitive Exams: ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారెవరు?
1. జతపరచండి.
జాబితా - I
a) ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు
b) రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన
c) పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం
d) మొదటి లా కమిషన్ ఏర్పాటు
జాబితా- II
i) భారత ప్రభుత్వ చట్టం - 1935
ii) భారత భారత కౌన్సిళ్ల చట్టం - 1909
iii) భారత ప్రభుత్వ చట్టం - 1919
iv) చార్టర్ చట్టం - 1883
ఎ) a-iv, b-ii, c-iii, d-i
బి) a-ii, b-iii, c-i, d-iv
సి) a-ii, b-iv, c-iii, d-i
డి) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: బి
2. కింది వాటిలో సరికానిది ఏది?
1) భారత రాజ్యాంగం 1935 చట్టం జిరాక్స్ కాపీ - కె.టి.షా
2) భారత రాజ్యాంగం ఒక అందమైన అతుకుల బొంత - మారిస్ జోన్స్
3) భారత రాజ్యాంగం ఐరావతం లాంటింది - హెచ్.వి. కామత్
4) భారత రాజ్యాంగ పరిషత్ ఒక హిందువుల సభ - చర్చిల్
ఎ) 1, 3
బి) 1, 4
సి) 1, 2, 4
డి) 2, 4
- View Answer
- సమాధానం: డి
3. కింది వారిలో రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన వారెవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) బి.ఆర్. అంబేడ్కర్
సి) గోపాలస్వామి అయ్యంగార్
డి) గణేశ్ వాసుదేవ మౌళంకర్
- View Answer
- సమాధానం: డి
4. జతపరచండి.
జాబితా - I
a) రాష్ట్రపతి ఎన్నిక విధానం
b) రాజ్యాంగ సవరణ విధానం
c) ఉమ్మడి జాబితా
d) అవశిష్ట అధికారాలు
జాబితా- II
i) కెనడా
ii) ఆస్ట్రేలియా
iii) దక్షిణాఫ్రికా
iv) ఐర్లాండ్
ఎ) a-iv, b-ii, c-iii, d-i
బి) a-ii, b-iii, c-i, d-iv
సి) a-iv, b-iii, c-ii, d-i
డి) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: సి
చదవండి: Indian Polity Bit Bank For All Competitive Exams: దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు?
5. కింది వాటిలో సరైనవి ఏవి?
1) సమాఖ్య ప్రభుత్వ ప్రధాన లక్షణం - కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన
2) పార్లమెంట్ ప్రధాన లక్షణం-శాసన నిర్మాణ శాఖకు కార్య నిర్వాహక బాధ్యత వహించడం
3) పార్లమెంటరీ విధానంలో మంత్రి మండలి సమష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత అనే సూత్రాలతో పని చేస్తుంది
4) అధ్యక్ష తరహా ప్రభుత్వం సుస్థిర కాలం ఉంటుంది
ఎ) 1, 2
బి) 3, 4
సి) 1, 2, 3
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
6. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) ఇప్పటి వరకు ఒకేసారి సవరించారు
2) రాజ్యాంగానికి ఉపోద్ఘాతం
3) ప్రవేశికకు మూలం నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం
4) రాజ్యాంగ ఆశయాలు - న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
ఎ) 1, 2
బి) 1, 4
సి) 1, 2, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
7. 'రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులను సవరించడానికి గానీ, కుదించడానికి గానీ పార్లమెంటుకు ఎలాంటి అధికారం లేదు' అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు వెలువరించింది?
ఎ) గోలక్ నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్
బి) కేశవానంద భారతీ Vs స్టేట్ ఆఫ్ కేరళ
సి) ఎస్.ఆర్. బొమై్మ Vs భారత ప్రభుత్వం
డి) సరళ ముద్గల్ Vs భారత ప్రభుత్వం
- View Answer
- సమాధానం: ఎ
8. పౌరులు ప్రాథమిక హక్కులను వదులుకోవడానికి న్యాయస్థానం అనుమతించదు. ఈ ప్రక్రియను న్యాయ పరిభాషలో ఏమని పేర్కొంటారు?
ఎ) డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ
బి) డాక్ట్రిన్ ఆఫ్ వేవర్
సి) డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్
డి) డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్‌స్టాన్స్
- View Answer
- సమాధానం: బి
9. ప్రాథమిక విద్యను నిర్బంధ విద్యగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు వెలువరించింది? 1) ఉన్నికృష్ణన్ Vs ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
2) మోహినీ జైన్ Vs కర్ణాటక ప్రభుత్వం
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1, 2
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
10. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) అంబేడ్కర్ ఆదేశిక సూత్రాలను 1935 చట్టం ద్వారా వెలువడిన Instruments of Instructionsతో పోల్చాడు
2) ఆదేశిక సూత్రాలను సరిగా అమలు చేస్తే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది - ఎం.సి. చాగ్లా
3) ఆదేశిక సూత్రాల అమలులో ప్రభుత్వాలు వైఫల్యం చెందితే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయినట్లే - బి.ఆర్. అంబేడ్కర్
4) ఆదేశిక సూత్రాలు.. ఒక బ్యాంకు తనకు అనుగుణంగా చెల్లించే చెక్కు లాంటివి - కె.టి. షా
ఎ) 1, 4
బి) 1, 3, 4
సి) 2, 3, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
11. జతపరచండి.
జాబితా - I
a) రామ రాజ్య, గ్రామ స్వరాజ్య స్థాపన
b) సంపద వికేంద్రీకరణ
c) పని హక్కు, నిరుద్యోగ భృతి
d) భారత సంస్కృతి, వారసత్వ పరిరక్షణ
జాబితా- II
i) అధికరణ - 49
ii) అధికరణ - 41
iii) అధికరణ - 39
iv) అధికరణ - 40
ఎ) a-i, b-ii, c-iii, d-iv
బి) a-iv, b-iii, c-ii, d-i
సి) a-ii, b-iv, c-iii, d-i
డి) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: బి
12. కింది వారిలో ఉప రాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) వి.వి. గిరి
బి) జాకిర్ హుస్సేన్
సి) నీలం సంజీవ రెడ్డి
డి) ఫకృద్దీన్ అలీ అహ్మద్
- View Answer
- సమాధానం: డి
13. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
1) ఎన్నికల గణంలో పార్లమెంట్ సభ్యులు, విధాన సభ సభ్యులు ఉంటారు
2) ఎన్నికల గణంలో పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల విధాన సభ సభ్యులు ఉంటారు
3) ఎన్నికల గణంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు,అన్ని రాష్ట్రాల,కేంద్ర పాలిత ప్రాంతాల విధాన సభ సభ్యులు ఉంటారు.
4) 16వ రాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా కొనసాగాడు
ఎ) 1, 2
బి) 3, 4
సి) 1, 3, 4
డి) 3
- View Answer
- సమాధానం: బి
14. జతపరచండి.
జాబితా - I
a) లోక్‌సభ రద్దు వాయిదా
b) పార్లమెంట్ ఉమ్మడి సభల సమావేశం
c) రాష్ట్రపతి అత్యాదేశాల (ఆర్డినెన్స్) జారీ
d) రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం
జాబితా- II
i) అధికరణ - 85
ii) అధికరణ - 123
iii) అధికరణ - 143
iv) అధికరణ - 108
ఎ) a-i, b-ii, c-iii, d-iv
బి) a-i, b-iv, c-ii, d-iii
సి) a-ii, b-iv, c-iii, d-i
డి) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: బి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్ ఎవరు?
15. కింది వారిలో సభలో సభ్యుడు కాకపోయినప్పటికీ సభాధ్యక్షుడిగా కొనసాగేదెవరు?
ఎ) లోక్‌సభ స్పీకర్
బి)విధాన పరిషత్ చైర్మన్
సి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
డి) రాజ్యసభ చైర్మన్
- View Answer
- సమాధానం: డి
16. జతపరచండి.
జాబితా - I
a) మైనార్టీ ప్రభుత్వం
b) జాతీయ ప్రభుత్వం
c) సంకీర్ణ ప్రభుత్వం
d) అత్యధిక మెజార్టీ ప్రభుత్వం
జాబితా- II
i) జవహర్ లాల్ నెహ్రూ
ii) మొరార్జీ దేశాయ్
iii) పి.వి. నరసింహా రావు
iv) రాజీవ్ గాంధీ
ఎ) a-i, b-ii, c-iii, d-iv
బి) a-iii, b-i, c-ii, d-iv
సి) a-ii, b-iv, c-iii, d-i
డి) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: బి
17. మంత్రి మండలికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) మంత్రి మండలి సంఖ్యపై 91వ సవరణ ద్వారా పరిమితి విధించారు
2) సమష్టి నిర్ణయాన్ని వ్యతిరేకించి రాజీనామా చేసిన మొదటి మంత్రి బి.ఆర్. అంబేడ్కర్
3) మంత్రి మండలి సమష్టిగా రాష్ట్రపతికి, వ్యక్తిగతంగా పార్లమెంట్‌కు బాధ్యత వహిస్తుంది
4) రాజ్యాంగం ప్రకారం మంత్రి మండలిని ఏర్పాటు చేసేది, శాఖలు కేటాయించేది ప్రధాన మంత్రి
ఎ) 1, 4
బి) 1, 2, 3
సి) 2, 3, 4
డి) 1, 2
- View Answer
- సమాధానం: డి
18. కింది వారిలో 1947లో నెహ్రూ మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందని వారు?
ఎ) అంబేడ్కర్
బి) శ్యామా ప్రసాద్ ముఖర్జీ
సి) షణ్ముగం శెట్టి
డి) పై వారందరూ
- View Answer
- సమాధానం: డి
19. 'అటార్నీ జనరల్‌కు పార్లమెంట్లో సభ్యత్వం లేకపోయినా చర్చల్లో, సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉంటుంది' అని తెలిపే అధికరణ ఏది?
ఎ) అధికరణ - 76
బి) అధికరణ - 88
సి) అధికరణ - 165
డి) అధికరణ - 78
- View Answer
- సమాధానం: బి
చదవండి: Fundamental Rights of India: గతంలో అడిగిన ప్రశ్నలు ఇవే...
20. భారత పార్లమెంట్‌కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) భారత పార్లమెంట్ పితామహుడిగా ఇంద్రజిత్ గుప్తాను పేర్కొంటారు
2) మొదటి మధ్యంతర ఎన్నికల ద్వారా 5వ లోక్‌సభ ఏర్పడింది
3) లోక్‌సభ 3వ స్పీకర్ - హుకుం సింగ్
4) రెండు దశాబ్దాల తర్వాత పూర్తి మెజార్టీతో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది
ఎ) 1, 4
బి) 1, 3, 4
సి) 2, 3, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
21. జతపరచండి.
జాబితా - I
a) ప్రభుత్వ ఖాతాల సంఘం
b) ప్రభుత్వ అంచనాల సంఘం
c) సభా వ్యవహారాల సంఘం
d) అర్జీలపై కమిటీ
జాబితా- II
i) మంత్రులకు కూడా సభ్యత్వం ఉంటుంది
ii) అతిపెద్ద పార్లమెంటరీ కమిటీ
iii) సమావేశాల అజెండా రూపకల్పన
iv) అతి ప్రాచీన పార్లమెంటరీ కమిటీ
ఎ) a-iv, b-ii, c-iii, d-i
బి) a-iv, b-iii, c-ii, d-i
సి) a-ii, b-iv, c-iii, d-i
డి) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: ఎ
22. ఆర్థిక బిల్లుకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) రాష్ట్రపతి పూర్వ సమ్మతితో లోక్‌సభలో ప్రవేశ పెట్టాలి
2) లోక్‌సభలో ఆమోదం పొందకపోతే ప్రభుత్వం కూలి పోతుంది
3) లోక్‌సభ ఆమోదం తర్వాత రాజ్యసభకు పంపితే, ఆమోదించి లేదా వ్యతిరేకించి 14 రోజుల్లోగా తిప్పి పంపాలి
4) రెండు సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తే శాసనం అవుతుంది
ఎ) 1, 2
బి) 3, 4
సి) 1, 2, 3
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: సి
23. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రవేశ పెట్టేందుకు లోక్‌సభలో 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి
2) తీర్మానం నెగ్గేందుకు లోక్‌సభలో సాధారణ మెజార్టీ ఆమోదించాలి
3) లోక్‌సభకు హాజరై, ఓటు వేసిన సభ్యుల్లో సాధారణ మెజార్టీ ఆమోదించాలి
4) హాజరైన సభ్యుల్లో ప్రత్యేక మెజార్టీ ఆమోదించాలి
ఎ) 2, 4
బి) 1, 3
సి) 2, 3
డి) 1, 4
- View Answer
- సమాధానం: ఎ
24. లోక్‌సభ స్పీకర్‌గా అతి తక్కువ కాలం పనిచేసిన వారెవరు?
ఎ) నీలం సంజీవ రెడ్డి
బి) బలిరాం భగత్
సి) బలరాం జాకర్
డి) సర్దార్ హుకుం సింగ్
- View Answer
- సమాధానం: బి
చదవండి: Fundamental Rights of India: గతంలో అడిగిన ప్రశ్నలు ఇవే...
25. జతపరచండి.
జాబితా - I
a) అమరేశ్వరీ దేవి
b) లీలా సేత్
c) ఫాతిమా బీవీ
d) అన్నా చాందీ
జాబితా- II
i) సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి
ii) హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి
iii) ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి
iv) హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి
ఎ) a-iii, b-iv, c-i, d-ii
బి) a-iv, b-iii, c-ii, d-i
సి) a-ii, b-iv, c-iii, d-i
డి) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: ఎ
26. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలోనిది?
ఎ) ప్రారంభ అధికార పరిధి
బి) అప్పీళ్ల విచారణ పరిధి
సి) సలహాపూర్వక పరిధి
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
27. కింది వాటిలో సరైంది ఏది?
1) మన రాష్ట్ర విధాన పరిషత్ విరామ కాలం 22 ఏళ్లు
2) విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దు న్యాయశాఖ పరిధిలోకి వస్తుంది
3) విధాన పరిషత్ రద్దు గురించి ఆర్టికల్ 169 తెలియజేస్తుంది
4) ప్రస్తుతం విధాన పరిషత్ 6 రాష్ట్రాల్లో అమల్లో ఉంది
ఎ) 1, 3
బి) 2, 4
సి) 2, 3, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
28. ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారెవరు?
ఎ) యడ్యూరప్ప
బి) జగదాంబిక పాల్
సి) నాదెండ్ల భాస్కర్
డి)జానకీ రామచంద్రన్
- View Answer
- సమాధానం: బి
29. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు కేటాయించాలని సిఫారసు చేసిన కమిటీ?
ఎ) సర్కారియా కమిటీ
బి) రాజమన్నార్ కమిటీ
సి) సంతానం కమిటీ
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
చదవండి: టీఎస్పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్లైన్ క్లాస్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
30. ప్రణాళికలు, సాంఘిక సంక్షేమం ఏ జాబితాలోకి వస్తాయి?
ఎ) కేంద్ర జాబితా
బి) రాష్ట్ర జాబితా
సి) ఉమ్మడి జాబితా
డి) అవశిష్ట అంశాలు
- View Answer
- సమాధానం: సి