Polity Bit Bank For All Competitive Exams: ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్ ఎవరు?
1. విధాన పరిషత్‌కు సంబంధించి సరైంది?
ఎ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ విరామకాలం 25 ఏళ్లు
బి) ప్రస్తుత తెలంగాణ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య - 40
సి) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య - 58
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
2. అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో విధానసభ సభ్యుల సంఖ్య?
ఎ) 233
బి) 243
సి) 245
డి) 292
- View Answer
- సమాధానం: బి
3. విధానసభకు సంబంధించి సరైంది?
ఎ) సభ్యుల సంఖ్య గరిష్టం 500
బి) అధికరణ - 333 ప్రకారం ఒక సభ్యుడిని గవర్నర్ నియమిస్తారు
సి) స్టీఫెన్ సన్ను గవర్నర్ నియమించారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
4. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానసభకు మధ్యంతర ఎన్నికలు ఎన్నిసార్లు జరిగాయి?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: ఎ
5. ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్?
ఎ) శమంతకమణి
బి) కల్పనాదేవి
సి) ప్రతిభా భారతి
డి) పద్మా దేవేందర్ రెడ్డి
- View Answer
- సమాధానం: సి
6. హైదరాబాద్ రాష్ర్ట ఏకైక స్పీకర్ ఎవరు?
ఎ) మాడపాటి హన్మంతరావు
బి) సరోజిని పుల్లారెడ్డి
సి) కాశీనాథరావు వైద్య
డి) కొండా లక్ష్మణ్ బాపూజీ
- View Answer
- సమాధానం: సి
7. కింది వాటిలో రాష్ర్ట శాసనసభకు లేని అధికారం ఏది?
ఎ) శాసన అధికారం
బి) కార్య నిర్వాహక అధికారం
సి) రాజ్యాంగ అధికారం
డి) న్యాయ అధికారం
- View Answer
- సమాధానం: డి
8. తెలంగాణ విధాన పరిషత్ అధ్యక్షుడెవరు?
ఎ) నేతి విద్యాసాగర్ రావు
బి) చక్రపాణి యాదవ్
సి) స్వామిగౌడ్
డి) పై ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
9. కిందివాటిలో ఏది సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికార పరిధిలోకి వస్తుంది?
ఎ) కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
బి) రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
సి) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
డి) ఆదేశిక సూత్రాల పరిరక్షణ
- View Answer
- సమాధానం: సి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
10. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) న్యాయశాఖ మంత్రి
సి) రాష్ర్టపతి
డి) గవర్నర్
- View Answer
- సమాధానం: సి
11. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది?
ఎ) గవర్నర్
బి) పార్లమెంట్
సి) రాష్ర్ట ప్రభుత్వం
డి) భారత రాష్ర్టపతి
- View Answer
- సమాధానం: డి
12. షాబానో కేసు దేనికి సంబంధించింది?
ఎ) జీవించే హక్కు
బి) ఉమ్మడి పౌరస్మృతి
సి) ఆస్తి హక్కు
డి) నిర్బంధ విద్య
- View Answer
- సమాధానం: బి
13. రాష్ర్ట ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు?
ఎ) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
బి) గవర్నర్
సి) అడ్వకేట్ జనరల్
డి) న్యాయశాఖ మంత్రి
- View Answer
- సమాధానం: సి
14. హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్ ఎక్కడి నుంచి చెల్లిస్తారు?
ఎ) కేంద్ర సంఘటిత నిధి
బి) రాష్ర్ట సంఘటిత నిధి
సి) రాష్ర్ట ఆగంతుక నిధి
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: ఎ
15. కిందివాటిలో సరైంది?
ఎ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటిప్రధానన్యాయమూర్తి - కె.సుబ్బారావు
బి) దేశంలో హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి - లీలాసెథ్
సి) దేశంలో స్థాపించిన మొదటి హైకోర్టు - కలకత్తా హైకోర్టు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
16. హైకోర్టులకు సంబంధించి సరికానిది?
ఎ) రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్‌లో ఉంది
బి) ఉత్తరప్రదేశ్ హైకోర్టు లక్నోలో ఉంది
సి) ఉత్తరాఖండ్ హైకోర్టు నైనిటాల్లో ఉంది
డి) ఛత్తీస్గడ్ హైకోర్టు బిలాస్పూర్లో ఉంది
- View Answer
- సమాధానం: బి
17. ఇ-కోర్టులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం?
ఎ) గుజరాత్
బి) హిమాచల్ ప్రదేశ్
సి) కేరళ
డి) తెలంగాణ
- View Answer
- సమాధానం: ఎ
18. జాతీయ సమాచార కేంద్రాన్ని ఎప్పుడు నెలకొల్పారు?
ఎ) 1976
బి) 1980
సి) 1984
డి) 2002
- View Answer
- సమాధానం: ఎ
19. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
ఎ) బెంగళూరు
బి) హైదరాబాద్
సి) పుణే
డి) గాంధీనగర్
- View Answer
- సమాధానం: బి
20. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్‌సను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1999
బి) 2001
సి) 2003
డి) 2005
- View Answer
- సమాధానం: బి
21. భారత సమాచార మంత్రిత్వశాఖ నిర్వచనం ప్రకారం ఎలక్ట్రానిక్ పాలన అంటే?
ఎ) SMRTA
బి) SSMRT
సి) SMART
డి) SART
- View Answer
- సమాధానం: సి
22. మేఘరాజ్ అంటే?
ఎ) కృత్రిమ వర్షాలను కురిపించే కార్యక్రమం
బి) వర్షాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం
సి) పర్యావరణాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం
డి) క్లౌడ్ కంప్యూటింగ్ సేవల కార్యక్రమం
- View Answer
- సమాధానం: డి
23. మీసేవ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సేవల సంఖ్య?
ఎ) 141
బి) 250
సి) 331
డి) 401
- View Answer
- సమాధానం: సి
24. దేశంలో మొదటిసారిగా ఏ రాష్ర్ట శాసనసభను ‘పేపర్‌లెస్’ కార్యాలయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
ఎ) గుజరాత్
బి) ఆంధ్రప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
25. ఇంటర్నెట్ వినియోగంలో మొదటిస్థానం ఆక్రమించిన దేశం?
ఎ) భారత్
బి) అమెరికా
సి) బ్రిటన్
డి) చైనా
- View Answer
- సమాధానం: బి
26. కింది వారిలో ఎవరిని గవర్నర్ నియమించరు?
ఎ) రాష్ర్ట మానవహక్కుల కమిషన్ చైర్మన్
బి) రాష్ర్ట ఎలక్షన్ కమిషనర్
సి) రాష్ర్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్
డి) అడ్వకేట్ జనరల్
- View Answer
- సమాధానం: సి