Polity Bit Bank For All Competitive Exams: తెలంగాణ సాధనలో భాగంగా సకల జనుల సమ్మెను ఏ రోజు ప్రారంభించారు?
1. 1947లో ఏర్పాటు చేసిన కేబినెట్ అధినేత?
ఎ) సర్దార్ పటేల్
బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) బి.ఆర్. అంబేద్కర్
డి) మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
- View Answer
- సమాధానం: బి
2. మంత్రిమండలిని ఏర్పాటు చేసేది, శాఖలను కేటాయించేది ఎవరు?
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధాన మంత్రి
సి) స్పీకర్
డి) ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: డి
ఎ) షణ్ముగ శెట్టి
బి) సర్దార్ బల్‌దేవ్‌సింగ్
సి) బాబూ జగ్జీవన్‌రామ్
డి) శ్యాంప్రసాద్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: సి
4. మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు?
ఎ) 89
బి) 91
సి) 92
డి) 95
- View Answer
- సమాధానం: బి
5. ప్రభుత్వ విధాన రూపకల్పన ఎవరి బాధ్యత?
ఎ) మంత్రిమండలి
బి) ప్రధాన మంత్రి
సి) రాష్ట్రపతి
డి) పార్లమెంట్
- View Answer
- సమాధానం: ఎ
6. కిందివాటిలో మంత్రిమండలి విధి కానిది?
ఎ) విధాన రూపకల్పన
బి) దేశ రక్షణ
సి) దత్తశాసన రూపకల్పన
డి) రాజ్యాంగ పరిరక్షణ
- View Answer
- సమాధానం: డి
7. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ పుట్టిన రోజు?
ఎ) 1934 ఆగస్టు 6
బి) 1932 నవంబర్ 6
సి) 1934 ఆగస్టు 14
డి) 1936 డిసెంబర్ 25
- View Answer
- సమాధానం: ఎ
8. 2004 నుంచి 2006 వరకు మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో కె. చంద్రశేఖర్‌రావు ఏ మంత్రిత్వ శాఖను నిర్వహించారు?
ఎ) పట్టణాభివృద్ధి శాఖ
బి) కార్మిక శాఖ
సి) గ్రామీణ అభివృద్ధి
డి) పంచాయతీ రాజ్
- View Answer
- సమాధానం: బి
9. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9ని భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఇది ఎవరి జన్మదినం?
ఎ) కొండా లక్ష్మణ్ బాపూజీ
బి) సి. నారాయణరెడ్డి
సి) కాళోజీ నారాయణరావు
డి) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: సి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
10. కాశీం రజ్వీ దుర్మార్గాలను వ్యతిరేకించిన షోయబుల్లాఖాన్ ఏ పత్రిక సంపాదకునిగా పనిచేశారు?
ఎ) సియాసత్
బి) ఇమ్రోజ్
సి) సామ్నా
డి) హైదరాబాద్ షాన్
- View Answer
- సమాధానం: బి
11. 1952 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో భువనగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి?
ఎ) రావి నారాయణరెడ్డి
బి) ఆరుట్ల రామచంద్రారెడ్డి
సి) ఆరుట్ల కమలాదేవి
డి) ధర్మబిక్షం
- View Answer
- సమాధానం: ఎ
12. తెలంగాణ సాధనలో భాగంగా సకల జనుల సమ్మెను ఏ రోజు ప్రారంభించారు?
ఎ) 2011 సెప్టెంబర్ 13
బి) 2011 ఆగస్టు 15
సి) 2011 అక్టోబర్ 2
డి) 2012 సెప్టెంబర్ 13
- View Answer
- సమాధానం: ఎ
13. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు?
ఎ) 2-6-2014
బి) 1-3-2014
సి) 1-4-2014
డి) 1-6-2014
- View Answer
- సమాధానం: బి
14.తెలంగాణ సమస్య పరిష్కారానికి సంబంధించి 2011లో నివేదిక సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ ఎన్ని మార్గాలను సూచించింది?
ఎ) 3
బి) 4
సి) 5
డి) 6
- View Answer
- సమాధానం: డి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
15.తెలంగాణ రాష్ట్ర మొదటి అడ్వొకెట్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) కరణం రాంచందర్ రావు
బి) సుభాషణ్ రెడ్డి
సి) రామకృష్ణా రెడ్డి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
16. అధికరణ 79 ప్రకారం పార్లమెంట్ అంటే?
ఎ) లోక్‌సభ
బి) లోక్‌సభ, రాజ్యసభ
సి) లోక్‌సభ, రాజ్యసభ, అటార్నీ జనరల్
డి) లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: డి
17. లోక్‌సభకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
ఎ) లోక్‌సభ నిర్మాణం గురించి అధికరణ 81 తెలుపుతుంది
బి) లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552
సి) కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 20కి మించకూడదు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
18. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 2026 సంవత్సరం వరకు పెంచకూడదని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు?
ఎ) 81
బి) 84
సి) 86
డి) 95
- View Answer
- సమాధానం: బి
19. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ను ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 2020 వరకు పొడిగించారు?
ఎ) 92
బి) 93
సి) 94
డి) 95
- View Answer
- సమాధానం: డి
20. ఓటర్లపరంగా దేశంలో అతిపెద్ద నియోజకవర్గం ఏది?
ఎ) లఢక్
బి) పశ్చిమ ముంబయి
సి) గాంధీనగర్
డి) మల్కాజ్‌గిరి
- View Answer
- సమాధానం: డి
21. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంత మంది సభ్యులను నియమిస్తారు?
ఎ) 2
బి) 12
సి) 14
డి) 20
- View Answer
- సమాధానం: బి
22. రాజ్యసభకు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంత మంది ఎన్నికవుతారు?
ఎ) 80
బి) 85
సి) 31
డి) 34
- View Answer
- సమాధానం: సి
23. ఏకీకృత న్యాయవ్యవస్థగా దేన్ని పేర్కొంటారు?
ఎ) మొత్తం న్యాయ స్థానాలు ఉన్నత న్యాయ స్థానం నియంత్రణలో పనిచేసే విధానం
బి) ప్రతి న్యాయస్థానం స్వతంత్రంగా పనిచేసే విధానం
సి) శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు బాధ్యత వహించనిది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
24. అమెరికాలో ‘సుప్రీం లెజిస్లేచర్’గా దేన్ని పేర్కొంటారు?
ఎ) కాంగ్రెస్
బి) సెనెట్
సి) మంత్రి మండలి
డి) అమెరికా ఫెడరల్ కోర్టు
- View Answer
- సమాధానం: డి
25. స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి?
ఎ) స్వతంత్రంగా పనిచేసేది
బి) రాజ్యాంగ హోదా ఉన్నది
సి) శాసన, కార్యనిర్వహక శాఖలకు బాధ్యత వహించనిది
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి