Polity Bit Bank For All Competitive Exams: సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
1. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు?
ఎ) రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ
బి) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
సి) కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
2. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ అధ్యక్షునిగా ఎవరు కొనసాగుతారు?
ఎ) రాష్ర్టపతి
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) కేంద్ర న్యాయశాఖ మంత్రి
డి) అటార్నీ జనరల్
- View Answer
- సమాధానం: బి
3. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు ఏ రాష్ట్రానికి చెందినవారు?
ఎ) తమిళనాడు
బి) కర్ణాటక
సి) మహారాష్ర్ట
డి) కేరళ
- View Answer
- సమాధానం: బి
4. కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలో ఉంటుంది?
ఎ) ప్రారంభ అధికార పరిధి
బి) అప్పీళ్ల విచారణ అధికార పరిధి
సి) సలహా రూపక పరిధి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
5. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది?
ఎ) గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్ స్టేట్-1967
బి) కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్-1973
సి) బేరుబారి వర్సెస్ భారత ప్రభుత్వం - 1960
డి) ఇంద్రసహాని వర్సెస్ భారత ప్రభుత్వం - 1993
- View Answer
- సమాధానం: బి
6. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
ఎ) లీలాసెథ్
బి) అన్నా చాంది
సి) ఫాతిమా బీబి
డి) అమరేశ్వరి దేవి
- View Answer
- సమాధానం: సి
7. కిందివాటిలో సరైనది?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం జస్టిస్ చంద్రశూడ్ పనిచేశారు
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం జస్టిస్ నాగేంద్రసింగ్ పనిచేశారు
సి) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
8. అధికరణ 152 నుంచి ఏ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చారు?
ఎ) గోవా
బి) జమ్మూ కశ్మీర్
సి) నాగాలాండ్
డి) అరుణాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
9. గవర్నర్‌ను నియమించేటప్పుడు రాష్ర్టపతిని సంప్రదించాలని ఇందుకు అవసరమైన అధికరణ 155ని సవరించాలని ఏ కమిటీ సూచించింది?
ఎ) రాజమన్నార్ కమిటీ
బి) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
సి) సర్కారియా కమిటీ
డి) సంతానం కమిటీ
- View Answer
- సమాధానం: సి
10. గవర్నర్ వ్యవస్థకు సంబంధించి సరికానిది?
ఎ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ సి.ఎం. త్రివేది
బి) గవర్నర్ పదవి చేపట్టిన తొలి తెలుగువ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య
సి) ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు
డి) గవర్నర్ పదవి చేపట్టేందుకు కనీస వయసు 35 ఏళ్లు
- View Answer
- సమాధానం: సి
11. కింది వాటిలో గవర్నర్ విచక్షణాధికారం ఏది?
ఎ) బిల్లులను రాష్ర్టపతికి నివేదించడం
బి) రాష్ర్ట పరిస్థితికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపడం
సి) విధానసభ రద్దు పర్చే విషయం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
12. కింది వాటిలో గవర్నర్ అర్హతకు సంబంధించి సరైంది?
ఎ) 35 ఏళ్లు నిండి ఉండాలి
బి) కనీస విద్యార్హత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
సి) శాసనసభలో సభ్యుడై ఉండరాదు
డి) 65 ఏళ్లు నిండి ఉండకూడదు
- View Answer
- సమాధానం: ఎ
13. ఈ కింది వాటిలో గవర్నర్‌కు ఏ అధికారాలు లేవు?
ఎ) ఆర్థిక అధికారాలు
బి) విచక్షణాధికారాలు
సి) సైనికాధికారాలు
డి) కార్య నిర్వాహకాధికారాలు
- View Answer
- సమాధానం: సి
14. ఏ అధికరణ ప్రకారం నేరస్థులకు క్షమాభిక్ష పెట్టేందుకు, శిక్షను తగ్గించేందుకు గవర్నర్‌కు అధికారం ఉంటుంది?
ఎ) అధికరణ-153
బి) అధికరణ-161
సి) అధికరణ-213
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
15. కిందివాటిలో సరైనది?
ఎ) 243(జీ) ప్రకారం గవర్నర్ రాష్ర్ట ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులను నియమిస్తారు
బి) 243(జు) ప్రకారం గవర్నర్ రాష్ర్ట ఎలక్షన్ కమిషన్ కమిషనర్‌ను నియమిస్తారు
సి) అధికరణ 165 ప్రకారం గవర్నర్ అడ్వకేట్ జనరల్‌ను నియమిస్తారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
16. ముఖ్యమంత్రికి సంబంధించి సరైంది?
ఎ) ప్రత్యక్షంగా ఎన్నికవుతాడు
బి) పరోక్షంగా ఎన్నికవుతాడు
సి) గవర్నర్ నియమిస్తారు
డి) గవర్నర్ నామ నిర్దేశం చేస్తారు
- View Answer
- సమాధానం: సి
17. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తక్కువ కాలం పనిచేసిందెవరు?
ఎ) భవనం వెంకట్రామ్ రెడ్డి
బి) టి. అంజయ్య
సి) నాదెండ్ల భాస్కర్‌రావు
డి) ఎన్. జనార్దన్ రెడ్డి
- View Answer
- సమాధానం: సి
18. ఆంధ్ర రాష్ర్ట మొదటి ఉప ముఖ్యమంత్రి?
ఎ) కె.వి.రంగారెడ్డి
బి) సుబ్బారెడ్డి
సి) నీలం సంజీవరెడ్డి
డి) కళా వెంకట్రావ్
- View Answer
- సమాధానం: సి
19. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట డిమాండ్‌తో రాజీనామా చేసిన మొదటి మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇతను ఎవరి మంత్రి వర్గంలో మొదటిసారి మంత్రి పదవిని నిర్వహించారు?
ఎ) దామోదరం సంజీవయ్య
బి) కె. బ్రహ్మానందరెడ్డి
సి) నీలం సంజీవరెడ్డి
డి) జలగం వెంగళరావు
- View Answer
- సమాధానం: ఎ
20. రాష్ర్ట మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపు గురించి తెలిపే అధికరణ?
ఎ) అధికరణ - 74
బి) అధికరణ - 164
సి) అధికరణ -165
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
21. రాష్ర్ట మంత్రి మండలికి సంబంధించినది?
ఎ) కనీస సభ్యుల సంఖ్య 10, గరిష్టం 30
బి) కనీసం-12 మంది, గరిష్టం- ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం
సి) ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం మించరాదు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
22. ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు ఒక రాష్ర్టమంత్రిని రాజీనామా చేయమని కోరవచ్చు?
ఎ) రాష్ర్ట శాసనసభ
బి) గవర్నర్
సి) ముఖ్యమంత్రి
డి) ప్రధాన కార్యదర్శి
- View Answer
- సమాధానం: సి
23. రాష్ర్ట సచివాలయ అధిపతి ఎవరు?
ఎ) రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
బి) గవర్నర్
సి) ముఖ్యమంత్రి
డి) పై ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
24. విధాన పరిషత్ రద్దు, తిరిగి ఏర్పాటు గురించి ఏ అధికరణ తెలుపుతుంది?
ఎ) అధికరణ-167
బి) అధికరణ - 169
సి) అధికరణ-170
డి) అధికరణ - 175
- View Answer
- సమాధానం: బి
25. ప్రస్తుతం ద్విసభ విధానం ఉన్న రాష్ట్రాల సంఖ్య?
ఎ) ఐదు
బి) ఆరు
సి) ఏడు
డి) ఎనిమిది
- View Answer
- సమాధానం: సి