Group 2 Success Plan: ప్రతి సబ్జెక్ట్‌లో ముఖ్యమైన టాపిక్స్ ఇవే!!
ఏపీపీఎస్సీ గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 897 పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు, 566 నాన్–ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి తొలి దశ స్క్రీనింగ్ టెస్ట్ ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. గ్రూప్–2 పోస్ట్‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. తొలి దశలో స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత దశలో మెయిన్ పరీక్ష ఉంటాయి. ఈ రెండు పరీక్షలు కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. మెయిన్‌లో మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే గ్రూప్2 కొలువు ఖరారవుతుంది.
చదవండి: APPSC Group-1,2: గ్రూప్స్ అభ్యర్థులు చదవాల్సిన పుస్తకాలు ఇవే!!
150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్
ఎంపిక ప్రక్రియ తొలి దశలో స్క్రీనింగ్ టెస్ట్ ఒకే పేపర్‌గా 150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంశాలపై మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు.
2024 ఫిబ్రవరి 25న గ్రూప్2 ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. దీనికి సిద్ధం కావడానికి మీకు దాదాపు 2.5 నెలల సమయం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ఒక పటిష్టమైన ప్రణాళికతో మీ అధ్యయనాన్ని ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ప్రతి సబ్జెక్ట్‌లో దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన అంశాలు:
హిస్టరీ:
- రాష్ట్ర చరిత్ర, సంస్కృతి
- ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ.. ముఖ్యమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి
- జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర
- భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
- రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరులు
- వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి.
- చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు.. వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
- రాజనీతి శాస్త్రం
- రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు
- భావనలు మొదలు తాజా పరిణామాలు (రాజ్యాంగ సవరణలు, వాటి ప్రభావం) తెలుసుకోవాలి
- గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.
- సివిల్, క్రిమినల్ లా, కార్మిక చట్టాలు, సైబర్ చట్టాలు, ట్యాక్స్ లాస్ గురించి తెలుసుకోవాలి.
ఎకానమీ:
- మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి.
- ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి.
- ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్ సర్వేలపై అవగాహన పొందాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు
- ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు
- ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్
- డీఆర్‌డీఓ
- ఇంధన వనరులు
- విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి.
- అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు
- పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పొందాలి.
కొన్ని ముఖ్యమైన చిట్కాలు:
- సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోండి: పరీక్షలో ఏ అంశాలను అడుగుతారో తెలుసుకోవడానికి సిలబస్‌ను పూర్తిగా చదవండి.
- కాలపట్టికను రూపొందించుకోండి: ప్రతి అంశానికి ఎంత సమయం కేటాయించాలి అని నిర్ణయించుకోండి. మీ అధ్యయనాన్ని ట్రాక్ చేయడానికి మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
- మంచి నాణ్యమైన పుస్తకాలు ఎంచుకోండి: పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేసే పుస్తకాలను ఎంచుకోండి.
- సొంత నోట్స్ రాసుకోండి: చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిని నోట్స్ లో రాసుకోండి. ఇది మీకు పునశ్చరణ సమయంలో సహాయపడుతుంది.
- పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయండి: పరీక్షా ఫార్మాట్ మరియు ప్రశ్నల స్థాయిని అర్థం చేసుకోవడానికి పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయండి.
- సమయ పరిమితితో పరీక్షలు రాయండి: మీ సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయ పరిమితితో పరీక్షలు రాయండి.
- ఆరోగ్యంగా ఉండండి... తగినంత నిద్రపోండి: పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.