TSPSC: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్‌లో ఏయే అంశాలుంటాయో తెలుసా..?
దీంతోపాటు ఆర్థిక సంఘం సిఫార్సులు, ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతిఆయోగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. పారిశ్రామిక విధానాలు, విదేశీ వాణిజ్య విధానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి అధ్యయనం చేయాలి.
సహజ వనరుల లభ్యత, ఆర్థికాభివృద్ధి దిశగా అవి దోహదపడుతున్న తీరుపై అధ్యయనం చేయాలి. కోర్ ఎకానమీకి సంబంధించి ద్రవ్యం, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్‌ల నిర్వచనాలు–సిద్ధాంతాలు తెలుసుకోవాలి. అలాగే జాతీయాదాయ భావనలు, జీడీపీ, తలసరి ఆదాయం వంటి బేసిక్ కాన్సెప్ట్‌లపై అవగాహన అవసరం. వీటితోపాటు ఆర్థిక రంగంలో తాజా పరిణామాల గురించి కూడా అధ్యయనం చేయాలి. ఇండియన్ ఎకానమీ పరంగా అభ్యర్థులు మరింత పట్టు సాధించేందుకు ఆర్థిక సంఘం సిఫార్సులు, తాజా బడ్జెట్ గణాంకాలు, సహజ వనరుల లభ్యత, వాటి వల్ల లభిస్తున్న ఆదాయం–జీడీపీలో వాటి వాటా వంటిపై పట్టు సాధించాలి.
తెలంగాణ ఎకానమీ....
పేపర్–3లోనే ఉండే తెలంగాణ ఎకానమీలో తెలంగాణ ప్రాంతంలోని ముఖ్యమైన వనరులు, అవి లభించే ప్రాంతాలు, పంటలు–దిగుబడి కారకాలు గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు తాజా సమకాలీన అంశాలతో సమ్మిళితమైన అంశాలపైనా అధ్యయనం ముఖ్యం. అదే విధంగా తెలంగాణ ఆర్థిక విధానం, ఆయా రంగాల్లో అభివృద్ధి, జీఎస్‌డీపీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఎకానమీలో పట్టు సాధించడం కోసం అభ్యర్థులు మానవాభివృద్ధి సూచీలలోని వివిధ ఇండికేటర్స్‌ను పరిశీలించాలి. రాష్ట్ర ఆర్థిక సర్వే గణాంకాలు, కేంద్ర ఆర్థిక సర్వేలో రాష్ట్రాల వారీగా పేర్కొన్న గణాంకాలు సేకరించి ఔపోసన పట్టాలి.