Skip to main content

Linguistic States Study Material: భాషా ప్రయుక్త రాష్ట్రాలు

Study Material for Linguistic States for Competitive Exams  Thar commissions

దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి రెండు రకాల రాజకీయ భాగాలు ఉండేవి.
1. నేరుగా బ్రిటిష్‌ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భాగాలు.
2. బ్రిటిష్‌ సార్వభౌమాధికారం కింద పనిచేసే సంస్థానాలు (స్వదేశీ సంస్థనాలు).

ఆనాడు దేశంలో 552 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. బ్రిటిషువారు ప్రకటించిన విలీన ఒప్పందం ప్రకారం 549 స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనం అయ్యాయి కానీ హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్‌ సంస్థానాలు విలీనాన్ని వ్యతిరేకించాయి. కశ్మీర్‌ భారత్‌లో విలీన ఒప్పందం ద్వారా అంతర్భాగం అయింది. ప్రజాభిప్రాయం ద్వారా జునాగఢ్‌ భారత్‌లో కలిసిపోయింది. ప్రజాభిప్రాయం ద్వారా కలిసిన మొదటి, చివరి సంస్థానం ఇదే. హైదరాబాద్‌ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్‌ 17న ఆపరేషన్‌ పోలో అనే పోలీసు చర్య (సైనిక చర్య) ద్వారా విలీనం చేశారు.
1950 నాటికి రాజ్యాంగం ప్రకారం నాలుగు రకాల రాష్ట్రాలు అమలులో ఉండేవి. వీటిని పార్ట్‌–ఎ, బి, సి, డిగా వర్గీకరించారు. పార్ట్‌–ఎలో బ్రిటిష్‌ పాలిత గవర్నర్‌ ప్రావిన్స్‌లు 9 ఉండేవి. పార్ట్‌–బిలో శాసనసభ కలిగిన స్వదేశీ సంస్థానాలు 9, పార్ట్‌–సిలో చీఫ్‌ కమిషనర్‌ ప్రాంతాలు 10, పార్ట్‌–డిలో అండమాన్‌ నికోబార్‌ దీవులు ఉండేవి.

Indian Navy Recruitment: అవివాహిత యువతీ యువకులకు గుడ్‌న్యూస్‌.. ఇండియన్‌ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

నేపథ్యం..
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ఉండేది. ఈ డిమాండు మొట్టమొదటి సారి తెరపైకి తెచ్చింది తెలుగువారే.

గమనిక: స్వాతంత్య్రం రాక ముందు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఒడిశా.

  •     1913లో బాపట్లలో జరిగిన ఆంధ్రమహాసభ ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు డిమాండ్‌ చేసింది.
  •     1927లో కాంగ్రెస్‌ సమావేశం భాషాప్రయుక్త రా­ష్ట్రాల ఏర్పాటును సమర్థిస్తూ తీర్మానం చేసింది.
  •     1931లో జరిగిన రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి గాం«ధీ హాజరైన సందర్భంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండుపై చర్చించాలని భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించారు.

1937లో రాయలసీమ, ఆంధ్ర నాయకుల మధ్య కాశీనాథుని నాగేశ్వరరావు నివాసంలో ఒక ఒప్పందం కుదిరింది. కాశీనాథుని నివాసం పేరు శ్రీభాగ్‌ కాబట్టి దీన్ని శ్రీభాగ్‌ ఒప్పందం అంటారు. స్వాతంత్య్రానంతరం రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భంలో మద్రాసు, ఆంధ్ర నాయకుల మధ్య తలెత్తిన వివాదాలు ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు బలమైన కారణాలుగా చెప్పొచ్చు. 

Chamoli-Pithorgarh Road: దగ్గరకానున్న చైనా సరిహద్దు.. 500 కి.మీ. నుంచి 80 కి.మీ.కు తగ్గనున్న రోడ్డు..

థార్‌ కమిషన్‌ –1948
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై పరిశీలనకు రాజ్యాంగ పరిషత్తు 1948లో ఉత్తరప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌.కె.థార్‌ నాయకత్వంలో ఇద్దరు సభ్యులతో(పన్నాలాల్,జగత్‌ నారాయణ్‌లాల్‌) ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ కేవలం భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాలు ఏర్పాటు చేయడా­న్ని తిరస్కరించింది.పరిపాలనా సౌలభ్య ప్రాతిపదికపైనే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

జె.వి.పి. కమిటీ
థార్‌ కమిషన్‌ నివేదికకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనను విరమింపజేయడానికి అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ 1948 డిసెంబర్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభ్‌భాయ్‌ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా దేశం మొత్తం మీద రాష్ట్రాల పునర్‌నిర్మాణాన్ని వాయిదా వేయాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం దానికి మినహాయింపుగా భావించాలని నివేదించింది.

Al Jazeera offices: అల్‌–జజీరా కార్యాలయాల మూసివేత.. ఎక్క‌డంటే..

1952 ఆగస్టు 15 నుంచి 35 రోజుల పాటు గొల్లపూడి సీతారామయ్య శాస్త్రి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 35 రోజుల తర్వాత ఆచార్య వినోభా భావే అతడి నిరాహారదీక్షను విరమింపజేశారు.
1952 అక్టోబర్‌ 19 నుంచి మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. దీక్ష 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా మద్రాసును సందర్శించిన జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ పొట్టి శ్రీరాములు తన దీక్షను కొనసాగించారు. 58వ రోజున డిసెంబర్‌ 15న ఆయన అమరుడయ్యారు. పొట్టి శ్రీరాములు మృతితో హింసాత్మక సంఘటనలు చెలరేగాయి.దీంతో 1952 డిసెంబర్‌ 19న పార్లమెంటులో నెహ్రూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు. 

Published date : 06 May 2024 04:05PM

Photo Stories