TS TET Notification 2023: తెలంగాణ టెట్–2023 నోటిఫికేషన్ విడుదల.. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు..
అర్హత: డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా పరీక్షకు హాజరుకావచ్చు.
పరీక్ష విధానం: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు బోధించేందుకు పేపర్–1 రాయాలి. పేపర్–1ను డీఈడీ అభ్యర్థులతోపాటు బీఈడీ అభ్యర్థులకు కూడా జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్‌సీటీఈ) అనుమతి ఇచ్చింది. పేపర్–2 రాసేందుకు కేవలం బీఈడీ పూర్తిచేసిన వారే అర్హులు.
ఒక్కో పేపర్‌కు 150 మార్కులు.
అర్హత మార్కులు: జనరల్ కేటగిరీలో 90, బీసీలు–75,ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత లభిస్తుంది. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.
ముఖ్య సమాచారం
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 16.08.2023
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీలు: 09.09.2023 నుంచి 14.09.2023 వరకు;
- పరీక్ష తేది: 15.09.2023.
- ఫలితాల వెల్లడి: 27.09.2023
- వెబ్‌సైట్: https://tstet.cgg.gov.in/
చదవండి: Telangana Jobs 2023: తెలంగాణలో 1520 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |