Skip to main content

GDS Results: గ్రామీణ డాక్‌ సేవక్ ఫ‌లితాల విడుద‌ల‌... మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న‌ గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల తుది జాబితాను ఇండియ‌న్ పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్ విడుద‌ల చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్య‌ర్థుల జాబితా అందుబాటులో ఉంది.
 Gramin Dak Sevaks
Gramin Dak Sevaks

జాబితాలో పేరున్న అభ్య‌ర్థులు మార్చి 21వ తేదీలోపు త‌మ విద్యార్హ‌త‌ను తెలిపే ఒరిజ‌నల్ స‌ర్టిఫికెట్ల‌తో పాటు సెల్ఫ్ అటెస్టేష‌న్ చేసిన రెండు సెట్ల జిరాక్స్ కాపీల‌ను వెరిఫికేష‌న్ కోసం తీసుకెళ్లాలి. త‌మ‌కు కేటాయించిన డివిజ‌న్ పోస్ట్ ఆఫీసుల‌కు మాత్ర‌మే అభ్య‌ర్థులు వెళ్లాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: పది పాస్‌తో 40,889 ఉద్యోగాలు... 4 గంటలే పని.. పూర్తి వివరాలు ఇవే
ఏపీలో 2480, తెలంగాణ‌లో 1266 ఖాళీలు

దేశవ్యాప్తంగా మొత్తం 40,889 పోస్టులు ఉండగా... తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగానికి ఎంపికైతే రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పని ఉంటుంది. ఈ వర్క్‌తో పాటు ఇండియన్‌  పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ అందిస్తారు. విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌ తపాలా శాఖ సమకూరుస్తుంది. సైకిల్‌ తొక్కడం కచ్చితంగా వచ్చి ఉండాలి. 

చ‌ద‌వండి: కార్పొరేట్ జాబ్స్‌ వ‌దిలేసి.. రోడ్ల‌పై స‌మోసాల‌తో స్టార్ చేసి... నేడు కోట్లు ​​​​​​​
ఎంపికైతే ఇలా...

పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా గ్రామీణ డాక్‌ సేవక్‌ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టుగా ఉండాలి. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు.

Published date : 21 Apr 2023 01:49PM
PDF

Photo Stories